For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై హెయిర్ నివారణకు బెస్ట్ హెయిర్ ఆయిల్స్

|

పొడిబారిన మరియు చిక్కుబడిన జుట్టు సమస్య చాలా మంది మహిళల్లో వేధించే ఒక సాధారణ సమస్య. డ్రై హెయిర్ వల్ల జుట్టు నిర్జీవంగా కనడటం మాత్రమే కాదు, జుట్టు రాలడానికి కూడా ప్రధాన కారణం అవుతుంది. జుట్టు సంరక్షణలో తగినంత జాగ్రత్తలు, మరియు జుట్టు అవసరం అయ్యే తేమ అందనప్పుడు ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. జుట్టులో తగినంత తేమ లేకపోవడం వల్ల, జుట్టు పొడిబారడం, చిక్కుబడటం, కేశాల్లో జీవం లేకుండా నిర్జీవంగా కనబడటం జరుగుతుంది. అంతే కాదు డ్రై హెయిర్ ఎక్కువగా ఉన్నప్పుడు తల మాడు బాగా పొడి బారడం వల్ల చుండ్రు సమస్య పెరుగుతుంది.

పొడి జుట్టు ఏర్పడటాకి అనేక బాహ్య కారకాలు ఫలితం కూడా ఉంటుంది. ఉదా: కఠిమైన హెయిర ఉత్పత్తులను మితిమీరి ఉపయోగించడం, ఎక్కువ షాంపును ఉపయోగించడం, డైయింగ్, హీటింగ్ హెయిర్, గాలిలో ఎక్కువగా తిరగడం, మరియు వేడి వాతావరంలో అధికంగా తిరగడం, అధిక ఖనిజాలున్న నీటిని తలకు పోసుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే బాహ్య కారకాలు అనేకం ఉన్నాయి..బాహ్య కారకాలు కొన్ని లేదా ఇతర పరిహారం పొందవచ్చు. అయితే చాలా ముఖ్యమైన విషయం ఎల్లప్పుడూ మీ జుట్టును తేమగా ఉంచుకోవడాని ప్రయత్నించాలి. జుట్టుకు తగినంత తేమ అందాంటే సరైన ఆహార నియమాలు పాటించిన ప్పుడు మాత్రమే ఇది సాధించగలరు మరియు తరచూ తలకు నూనె రాస్తుండాలి. డ్రై హెయిర్ సమస్యను తగ్గించుకోవడాని తలకు ఆయిల్ మసాజ్ చాలా ఉపయోగపడుతుంది. మరియు ఇతర అవసరం అయ్యే నూనెలు కూడా జుట్టుకు తగినంత తేమను అంధించి జుట్టుకు తలమాడుకు తగినంత తేమను అంధిస్తుంది.

కాబట్టి డ్రై హెయిర్ నుండి విముక్తి పొండానికి ఇక్కడ కొన్ని బెస్ట్ ఆయిల్ లిస్ట్ ఉన్నది. ఈ నూనెలతో మీ పొడి బారిన జుట్టు మరియు చిక్కుబడిని జుట్టును వదిలించుకోండి...

లావెండర్ ఆయిల్:

లావెండర్ ఆయిల్:

ఇది ఒక అద్భుతమైన, సహజసిద్దమైన నూనె. దీని వల్ల పొందే ప్రయోజనాలు చెప్పలేనన్ని ఉన్నాయి పొడి జుట్టుకు దారితీసే దురదును తగ్గించడంతో పాటే అనేక సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

రోజ్ మెరీ ఆయిల్:

రోజ్ మెరీ ఆయిల్:

ఇది జుట్టుకు తగినంత తేమను అంధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దాంతో తలలో చుండ్రు మరియు దురద వదలగొట్టి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

సాండిల్ వుడ్ ఆయిల్:

సాండిల్ వుడ్ ఆయిల్:

సాండిల్ ఉడ్ ఆియల్ పొడి జుట్టు మరియు చిక్కుబడ్డ జుట్టుకు మంచి చికిత్స వంటింద. అంతే కాదు సాండిల్ వుడ్ ఆయిల్ వల్ల జుట్టు నునుపుగా, మెత్తగా మరియు తగినంత తేమతో ఉండేలా చేయడంతో పాటు పోషణను కూడా అందిస్తుంది. మరయిు మీ కేశాలనుండి మంచి సువాసన వచ్చేలా చేస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె బెస్ట్ హోం రెమడీ . ఇది అనేక జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఇది జుట్టుకు మంచి పోషణ ఇవ్వడంతో పాటు, తగినంత తేమను అందిస్తుంది . మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జెరనియమ్ ఆయిల్:

జెరనియమ్ ఆయిల్:

జెరనియమ్ ఆయిల్ జుట్టు మొదలనుండి బలాన్ని అందివ్వడానికి సహాయపడుతుంది. దాంతో జుట్టుకు తగినతం పోషణ అందించబడి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

ఇది తల మాడుకు, జుట్టుకు తగినంత తేమను అంధిస్తుంది. బాదాం నూనె కూడా మీ కేశాలకు తగినంత షైనింగ్ ను అంధిస్తుంది. ఫలితంగా జుట్టు చాలా అందంగా కనబడుతుంది.

English summary

Best Oils For Dry Hair


 Dry and frizzy hair is a common problem for most women. Dry hair not only looks dull but is also a reason for hair fall. Dry hair occurs when your hair does not have enough moisture. The lack of moisture makes your hair look dry, frizzy, lifeless and dull.
Story first published: Friday, September 27, 2013, 15:53 [IST]
Desktop Bottom Promotion