Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జుట్టుకు హెన్నా అప్లైచేస్తే, పొందే అద్భుత ప్రయోజనాలు
కురులు పట్టుకుచ్చులా మెరిసిపోయే సోయగమే వేరు. అలాంటి శిరోజాలు ఓ వరమని చెప్పుకోవచ్చు. ఎంత అందమైన కురులున్నా కూడా వాతావరణంలో మార్పుల వల్ల ప్రభావం వాటిపైపడుతుంది. జీవంకోల్పోయిన జుట్టుతోపాటు మరికొన్ని సమస్యలు వచ్చిపడతాయి. సమయానికి తగినట్లుగా సరైన జాగ్రత్తలు పాటిస్తూ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండేలా చూసుకోవడమే దానికి తగిన పరిష్కారం.
జుట్టుకు సంబంధించిన ఏ సమస్యకైనా హెన్నా లేదా గోరింటాకు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా హెయిర్ డైలు వాడే వారికి... పెర్మింగ్, స్ట్రెయిటనింగ్ చేయించుకున్నప్పుడు వాటిలోని రసాయనాల వల్ల జుట్టు, తల పొడిబారి, చుండ్రువచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమస్యలన్నింటికీ హెన్నా దివ్యౌషధంలా పనిచేస్తుంది. అయితే, సరైన రీతిలో వాడితేనే ప్రయోజనాలు పొందగలుగుతాం.ముఖ్యంగా పచ్చిగోరింటాకు ముద్ద కాకుండా పొడిని వాడాలి. అలాగే అన్నివయసులవారూ హెన్నాను ఒకేరకంగా పెట్టుకోకూడదు.
జుట్టుకు హెన్నా అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది పొడి జుట్టు చికిత్సకు సహాయపడుతుంది. జుట్టు పోగులు బలంగా మరియు మృదువుగా ఉండటానికి మరియు చుండ్రు తగ్గటానికి సహాయపడుతుంది. హెన్నాలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన మీ జుట్టుకు పోషణ మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అయితే హెన్న ఎలా అప్లై చేయాలని తెలుసుకోవడం ముఖ్యం. అనేక జుట్టు సమస్యలను నివారించే ఈ హెన్నా కలరింగ్ కోసం అయితే, కొంత హెన్నా పౌడర్ ను టీ లేదా కాఫీ డికాషన్ లో కలిపి పెట్టి, తలకు అప్లై చేసే ముందు పెరుగు మిక్స్ చేసి తలకు ప్యాక్ లా వేసుకోవాలి. ఇది మీరు తీసుకొనే వస్తువుల మీదే మీ అన్ని రకాల జుట్టు సమస్యలను నివారించగలుగుతాం. అదే మీకు చుండ్రు సమస్య ఉన్నప్పుడు, హెన్నా ప్యాక్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తర్వాత నూనె పెట్టుకొన్న తలకు ప్యాక్ లా వేసుకోవాలి . హెన్నా తడి ఆరిన తర్వాత చిక్కుబడకుండా ఉంటుంది . హెన్నా ప్యాక్ పెట్టుకొన్న తర్వాత 30-45నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి. కేశాలకు నేచురల్ హెయిర్ కండీషనర్ కావాలంటే హెన్నా ప్యాక్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు.
హెన్నా వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు:

1. హెయిర్ కలర్:
హెన్నా వల్ల అత్యంత సాధారణ ప్రయోజనం, జుట్టు కలరింగ్ కోసం ఒక నేచురల్ డై గా ఉపయోగపడుతుంది. ఇది గ్రే హెయిర్ కు కలర్ అంధిస్తుంది. మరియు నేచురల్ హెయిర్ కలర్ ను అంధిస్తుంది.

2. హెయిర్ కండీషనర్:
జుట్టుకు నేచురల్ కండీషన్ గా హెన్నాను ఉపయోగించవచ్చు. హెన్నాకు పెరుగు మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తర్వాత అప్లై చేయడం వల్ల మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.

3. చుండ్రును నివారిస్తుంది:
చుండ్రును నివారించడంలో హెన్నా అద్భుతంగా పనిచేస్తుంది. హెన్నా అప్లై చేయడం వల్ లఇది చుండ్రునివారించి,శాస్వతంగా నివారిస్తుంది.

4. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
హెన్నా వల్ల జుట్టుకు అత్యంత ముఖ్యమైన ప్రయోజనం. ఇది హెయిర్ ఫ్యాల్ తగ్గిస్తుంది. ఎవరైతే జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారో వారు హెన్నా ప్యాక్ ను తలకు అప్లై చేసుకోవాలి.

5. జుట్టును బలోపేతం చేస్తుంది:
బలమైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి, హెన్నాను ఉపయోగించాలి. హెన్నాను నిమ్మరసం మరియు పెరుగుతో మిక్స్ చేసి తలకు ప్యాక్ లా వేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అంధిస్తుంది.

6. చిక్కుబడిన జుట్టును నివారిస్తుంది :
చిక్కుబడిని మరియు పొడిబారిన జుట్టును మ్యానేజ్ చేయడానికి హెన్నాను తలకు అప్లై చేయాలి . ఇది జుట్టును మ్యానేజ్ చేస్తుంది మరియు సాప్ట్ గా మార్చుతుంది.

7. జుట్టును స్ట్రెయింట్ గా చేస్తుంది:
హెన్నాప్యాక్ తలకు అప్లై చేయడం వల్ల ఇది జుట్టును డ్రైగా మరియు చిక్కుబడేలా చేస్తుందని చాలా మంది నమ్ముతారు . అయితే, దానికి చాలా తక్కువ ప్రభావం ఉన్నప్పుటికి, జుట్టును స్ట్రెయిట్ హేయిర్ గా మార్చుతుంది.

8. తలను శుభ్రపరుస్తుంది:
తలలో ఇన్పెక్షన్స్ మరియు చుండ్రు వల్ల అనేక జుట్టు సమస్యలు, జుట్టురాలడం పెరుగుతాయి . హెన్నా జుట్టును, తలను శుభ్రం చేస్తుంది, జిడ్డును నిరోధిస్తుంది.



Click it and Unblock the Notifications