For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడిగా..రఫ్ గా ఉన్న జుట్టు నివారించే చిట్కాలు

|

మీ అందమైన లుక్ కొరకు ప్రకాశించే చర్మం,సుందరమైన కళ్ళు మరియు పెదవులు ఉన్నాయి. కానీ జుట్టు విషయానికి వస్తే మీ జుట్టు పొడి మరియు నిస్తేజంగా ఉందని భావిస్తున్నారా. నిజంగానే మీ జుట్టు చెడుగా ఉందని భావిస్తున్నారు? కానీ మీ అబిప్రాయం పూర్తిగా తప్పు. మీరు సహజ మూలికలను ఉపయోగించి నిజంగా మీ జుట్టును అందంగా చేయవచ్చు. మీ పొడి మరియు పెళుసు జుట్టు చికిత్సకు ఉపయోగించటానికి అనేక మూలికలు ఉన్నాయి.

ప్రకృతి మాకు పొడి,నిస్తేజం మరియు పెళుసైన జుట్టు నుంచి బయటపడటానికి సహాయం చేయటానికి మాత్రమే అనేక మూలికలను ఇచ్చింది. అంతేకాక జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టును ప్రకాశవంతం మరియు మృదువుగా తయారుచేస్తుంది. మీకు కేవలం ఒక చిన్న ఆందోళన ఉంటుంది. మీ జుట్టు కొరకు మీకు క్రమశిక్షణ అవసరం. మీరు ఒక క్రమ పద్ధతిలో ఈ సహజ మూలికలను రాస్తే ఖచ్చితంగా కొద్దికాలంలోనే తేడాను చూడగలరు. వీటిలో భ్రింగ్రాజ్,హెన్నా,ఉసిరికాయ,బ్లాక్ టీ, శీకాయి,కలబంద మరియు కుంకుడు వంటి అనేక సహజ మూలికలు ఉన్నాయి.

ఈ మూలికలను ఉపయోగించినప్పుడు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఉత్తమ ఫలితాలను పొందడానికి (కనీసం వారానికి ఒకసారి) క్రమం తప్పకుండా ఉపయోగించాలి.

అన్ని మూలికల ఔషధములను ఉపయోగించడంతో పాటు మీరు ఆమ్ల,కలబంద రసము,అక్రోట్లు,బాదం, గుడ్లు,కాయధాన్యాలు మరియు పెరుగులను కూడా చేర్చాలి. మీరు ఒక సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా కింది మూలికలను ఉపయోగిస్తే ఖచ్చితంగా పొడి మరియు నిస్తేజంగా ఉండే జుట్టు నుంచి బయటపడవచ్చు.

మీరు పొడి మరియు నిస్తేజమైన జుట్టు సమస్యను అనుభవిస్తుంటే మరియు వదిలించుకోవటం కొరకు బ్రాహ్మి బాగా ఉపయోగపడుతుంది. ఇది పొడి,నిస్తేజంగా మరియు పెళుసైన జుట్టు కొరకు ఒక గొప్ప నివారణ మార్గంగా చెప్పవచ్చు.ఇది మీ జుట్టులో రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాక మీ జుట్టు నల్లగా మరియు ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది.

పొడి జుట్టు చికిత్స కొరకు కొన్ని మూలికలను చూద్దాము.

హెన్నా

హెన్నా

జుట్టుకు హెన్నా అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది పొడి జుట్టు చికిత్సకు సహాయపడుతుంది. జుట్టు పోగులు బలంగా మరియు మృదువుగా ఉండటానికి మరియు చుండ్రు తగ్గటానికి సహాయపడుతుంది. హెన్నాలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన మీ జుట్టుకు పోషణ మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

భ్రింగ్రాజ్

భ్రింగ్రాజ్

భ్రింగ్రాజ్ పొడి జుట్టు చికిత్స కొరకు ఒక ప్రసిద్ధ మరియు పురాతన నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఇది మీ పొడి జుట్టును పోషించుటమే కాకుండా తలపై ఇతర చర్మ రోగాలను వదిలించుకోవటం కొరకు సహాయపడుతుంది. ఇది మీ తలపై చర్మంనకు బలాన్ని మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బ్రాహ్మి

బ్రాహ్మి

మీరు పొడి మరియు నిస్తేజమైన జుట్టు సమస్యను అనుభవిస్తుంటే మరియు వదిలించుకోవటం కొరకు బ్రాహ్మి బాగా ఉపయోగపడుతుంది. ఇది పొడి, నిస్తేజంగా మరియు పెళుసైన జుట్టు కొరకు ఒక గొప్ప నివారణ మార్గంగా చెప్పవచ్చు.ఇది మీ జుట్టులో రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాక మీ జుట్టు నల్లగా మరియు ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది.

ఉసిరికాయ

ఉసిరికాయ

ఉసిరికాయలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన మీ తల చర్మంపై వచ్చే అనేక రకాల అంటువ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. ఇది పొడి,దెబ్బతిన్న మరియు పలుచటి జుట్టుకు చాలా మంచిదిగా పరిగణించబడుతుంది. ఇది జుట్టు పెరుగుదల కొరకు విటమిన్ C ని అందిస్తుంది.

కలబంద

కలబంద

కలబంద అనేక విధాలుగా మీ జుట్టుకు ఒక గొప్ప నివారణ మార్గంగా చెప్పవచ్చు. అంతేకాక అనేక మీ జుట్టు సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఇది మీ పొడి జుట్టుకు మాయశ్చరైజర్ గా పనిచేసి మీ జుట్టును ప్రకాశవంతంగా మరియు మృదువుగా తయారుచేస్తుంది. కలబంద మీ జుట్టుకు మెరుపును పెంచటానికి ప్రసిద్ధి చెందింది.

కుంకుడు

కుంకుడు

కుంకుడును అనేక జుట్టు చికిత్సలకు మన పూర్వీకులు శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన జుట్టు టానిక్ మరియు అనేక విధాలుగా మీ తలపై చర్మం మరియు పొడి జుట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన జుట్టు సమస్యలు లేకుండా మీరు దోషరహిత జుట్టును పొందడానికి సహాయం చేస్తుంది.

అతిమథురం

అతిమథురం

అతిమథురంను లికోరైస్ అని కూడా పిలుస్తారు. ఈ గొప్ప హెర్బ్ ను జుట్టు చికిత్సల కొరకు ఒక సంప్రదాయ మూలికా నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఇది భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు. అతిమథురంలో ఉండే హైడ్రేట్లు మీ పొడి జుట్టు మరియు జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అంతేకాక జుట్టును పటిష్టం చేస్తాయి.

శీకాయ

శీకాయ

శీకాయ అన్ని వయస్సుల వారి జుట్టు కొరకు ఒక సాంప్రదాయ ఔషధంగా వాడతారు. దీనిని 'జుట్టు కొరకు పండు' అని కూడా అంటారు. ఇది మీ పొడి జుట్టు తిరిగి మృదువుగా మారటానికి సహాయపడుతుంది. అంతేకాక మెరిస్తూ ఉండటం మరియు ఎగిరిపడటం గమనించవచ్చు. దీనిలో హైడ్రేట్లు ఉండుట వలన మీ తలపై చర్మంను బాగా పోషిస్తుంది. అంతేకాక మీ జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది.

English summary

Herbs For Dry Hair Treatment

You look beautiful, you have a glowing skin, lovely eyes and lips. But when it comes to your dry and dull hair, you feel very bad. Do you really feel that your hair are naturally bad? No! You are totally wrong.
Story first published: Wednesday, October 23, 2013, 17:48 [IST]
Desktop Bottom Promotion