Latest Updates
-
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుతమైన వస్తువులు..!
జుట్టు రాలుట అనేది ఒక సాధారణ విషయం గా మారిపోయింది. ఈ సమస్య తో బాధపడే ఎంతో మంది తల దువ్వుకోవడానికి కూడా భయపడుతున్నారు. తల స్నానం చేసే తప్పుడు ఇంకా దువ్వుకునేటప్పుడు ఉడిపోయే జుట్టు పోగులు ఎంతో ఇబ్బందికి గురి చేస్తాయి. అయినప్పటికీ, ఏంతో మందికి అర్ధం కాని విషయం జుట్టు రాలడమనేది సహజమైన ప్రక్రియ అని. మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు ఉడిపోతూనే ఉంటుంది. మన చేతుల్లో ఉన్నది రాలిపోయే జుట్టు శాతాన్ని తగ్గించడం మాత్రమే.
జుట్టు రాలడాన్ని అరికట్టే కొన్ని వాణిజ్య ఉత్పత్తులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందువల్ల, అనవసరంగా కొత్త సమస్యలో కి చిక్కుకోకుండా జుట్టు రాలుట సమస్యని కొంత వరకు తగ్గించేందుకు ప్రయత్నించాలి. వంటింటి చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను కొంత వరకు తగ్గించుకోవచ్చు. వీటినే హోం రెమెడీస్ అని కూడా అంటారు. సహజామైన ఉత్పత్తులనే వంటింటి చిట్కాలలో వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వంటింటి చిట్కాలను పాటించడం వల్ల బట్టతలని అరికట్టి మీ తలని హెలిపాడ్ కాకుండా కాపాడుకోవచ్చు. జుట్టు రాలడాన్ని అరికట్టే చిట్కాలు మీకోసం.
జుట్టు రాలుట ని నివారించేందుకు వంటింటి చిట్కాల:

కేశాలకు షాంపూ..హెయిర్ కండీషనర్: ఎల్లప్పుడూ మీ జుట్టు ని పరిశుభ్రం గా ఉంచుకోండి. చుండ్రు, దురద వంటి సమస్యల జుట్టు రాలడానికి ప్రధాన కారణం. జుట్టుని పరిశుభ్రం గా ఉంచుకోవడం వల్ల ఈ సమస్యలని అరికట్టవచ్చు. మీ జుట్టు రకాన్ని బట్టి షాంపూ మరియు హెయిర్ కండిషనర్ లని వాడండి.

ఆవ నూనె- హెన్నా: ఒక కప్పు ఆవ నునె లో నాలుగు టేబుల్ స్పూన్ల హెన్నా ఆకులని కలపండి. ఈ మిశ్రమాన్ని ఉడికించి ఒక బాటిల్ లో కి తీసుకోండి. ఈ నునె తో మీ తలపై చర్మాన్ని (స్కాల్ప్) ని తరచూ మసాజ్ చెయ్యండి.

మెంతులు: రెండు టేబుల్ స్పూన్ల మెంతుల ని రుబ్బి వాటికి కొన్ని నీళ్ళు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కి అప్లై చేసి నలభై నిమిషాల వరకు అలాగే వదిలేయండి. ఆ తరువాత శుభ్రమైన నీటితో కడగండి. నెలకొక సారి ఈ విధం గా చేస్తే జుట్టు రాలుట తగ్గుతుంది.

హెడ్ మసాజ్: జుట్టు ని చల్లటి నీటి తో కడిగి మీ వేళ్ళతో తలపై చర్మాన్ని బాగా రుద్దండి. రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలుట తగ్గుతుంది.

ఉల్లిపాయ: మీకు తలపై బట్ట తలలా పాచెస్ ఏర్పడినట్లయితే ఆ పాచెస్ పై ఉల్లిపాయతో చర్మం ఎర్రగా అయ్యేవరకు రుద్ది ఆ తరువాత తేనె రాయండి.

గుడ్డు: తేనే మరియు గుడ్డు లో ఉండే పచ్చ సోన ని కలిపి ఒక మిశ్రమం గా తయారు చేసుకుని మీ తలపై చర్మం పై మసాజ్ చెయ్యడం వల్ల జుట్టు రాలుట అరికట్టవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ తలపై కనీసం ఒక అరగంట సేపు ఉంచుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో కడగాలి.

పెరుగు: అయిదు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి కలిపితే హోం మేడ్ షాంపూ రెడీ. ఈ మిశ్రమాన్ని తలపై రాసి కొన్ని నిమిషాల తరువాత కడిగేయాలి.

కొబ్బరి నూనె: ఒక కప్పు వేడి వేడి కొబ్బరి నూనె లో కొన్ని ఎండు ఉసిరి ముక్కలు కలపాలి. తరువాత దీనిని ఉడికించి మిశ్రమం గా చేయాలి. ఒక సీసాలో ఈ మిశ్రమాన్ని భద్రపరచాలి. ఈ మిశ్రమంతో ప్రతి రోజు తలపై చర్మాన్ని మసాజ్ చెయ్యాలి.

ఉసిరి: ఉసిరి రసం మరియు నిమ్మ రసం కలిపి చేసిన షాంపూ తో జుట్టు రాలుట ని తగ్గించవచ్చు. జుట్టు పెరుగుటకు ఈ చిట్కా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

పాలకూర: ప్రతి రోజూ పాలకూర మరియు బచ్చల కూర రసాన్ని త్రాగడం వల్ల జుట్టు రాలుట ని అరికట్టవచ్చు.

కొత్తిమీర: కొత్తి మీర రసంతో మీ జుట్టుని వాష్ చెయ్యడం వల్ల జుట్టు రాలుటని తగ్గించవచ్చు.

కొబ్బరి పాలతో తలపై చర్మాన్ని రుద్దడం కూడా జుట్టు రాలుట ని అరికట్టడం లో తోడ్పడుతుంది.

ఒక టేబుల్ స్పూన్ నిమ్మ గింజలు, ఇంకొక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలని తీసుకుని రుబ్బి అందులో కొంచెం నీళ్ళు కలిపి తలపై అప్లై చెయ్యాలి. ఇది కూడా జుట్టు రాలుట తగ్గించడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.



Click it and Unblock the Notifications