Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
జుట్టు సమస్యలకు ముల్తాని మట్టితో హెయిర్ ప్యాక్
ముల్తాని మట్టి లేదా ఫుల్లర్స్ ఎర్త్ నేచురల్ గా లభించేటటువంటివి వీటిని మనం ‘బిటోనైట్' అని పిలుస్తాము. చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చర్మంలోని మలినాలను తొలగించడంలో ముల్తానిమట్టి అద్భుతంగా సహాయపడుతుంది. ఈ ముల్తానీ మట్టిని మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న బ్యూటీ వస్తువు కాదు, ఎందుకంటే ఈ వస్తువును రోమన్ కాలం నుండి ఒక అద్భుతమైన బ్యూటీ ప్రొడక్ట్ గా ఒక మంచి క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ముల్తానీ మట్టి బాగా పాపులర్ అయింది. బ్యూటీపార్లర్ లోనే కాదు, ఇంట్లో కూడా ఉపయోగించే ఈ బ్యూటీ ప్రొడక్ట్ చర్మంలో మలినాలనుతొలగించడానికి మాత్రమే కాదు, ఇతర చర్మ సమస్యలు, మొటిమలు, మచ్చలు, ముఖంగా ప్యాచ్ లను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
చర్మం సంరక్షణకు మాత్రమే కాకుండా, కేశాలకు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముల్తానీ మట్టితో హెయిర్ ప్యాక్ చేసుకుంటే జుట్టు చివర్లు చిట్లడం అనేది ఉండదు. ఇది ఒక మేలైన క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది, ఇది కేశాలకు ఎటువంటి హాని కలగజేయదు. ముల్తాని మట్టి తల, మాడునుండి అదనపు నూనెను గ్రహిస్తుంది, దాంతో పాటు చుండ్రును నివారిస్తుంది. అంతే కాదు, ఇది తలలో బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచి కేశకణాలకు తగినంత బలాన్ని అంధించి ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. కాబట్టి, ముల్తానీ మట్టి హెయిర్ ప్యాక్ ను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మీ కేశాలు రేడియంట్ గా మరియు బ్యూటిఫుల్ గా కనబడుతాయి.

మీ కేశాలకు మంచి షైనింగ్ తో మరియు అందంగా నేచురల్ గా పొందడానికి ముల్తాని మట్టి హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి రెడీ అవ్వండి. ..
జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది: తలకు నూనె పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. మరుసటి రోజు ఉదయం టవల్ ను వేడినీళ్ళలో డిప్ చేసి, నీరు మొత్తం పిండేసి, తలకు చుట్టుకోవాలి. తలకు చుట్టుకొని పది నిముషాల తర్వాత, ముల్తాని మట్టి మరియు పెరుగును ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. మీకేశాల పొడవును బట్టి తీసుకొని మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని మీ తలకు, కేశాల పొడవున అప్లై చేయండి 10నిముషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. చిట్లిన జుట్టును నివారించడానికి ఈ హెయిర్ ఫ్యాక్ ను వారానికి ఒక సారి ఉపయోగించండి.
పొడి జుట్టుకు: ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, అరకప్పు పెరుగు, నిమ్మరసం ఒక టీస్పూన్, మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి, ఈ ప్యాక్ ను మీ కేశాలకు పూర్తిగా పట్టించాలి. అప్లై చేసిన 20నిముషాల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.
ఆయిట్ జుట్టుకు: ముల్తానీ మట్టిని నీటితో కలిపి, తలకు పట్టించడానికి మూడు-నాలుగు గంటల సేపు నాననివ్వాలి. ప్యాక్ అప్లై చేసిన తర్వాత రీటా పౌడర్ ను కూడా తలకు అప్లై చేసి 10నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
స్ట్రెయిట్ హెయిర్ కోసం :
మీరు నేచురల్ గా స్ట్రెయిట్ హెయిర్ ను పొందాలంటే? ఒక కప్పు ముల్తానీ మట్టికి, 5టీస్పూన్ల బియ్యం పిండి, ఒక గుడ్డును వేసి బాగా మిక్స్ చేసి, తలకు ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేయడానికి ముందును తలను బాగా చిక్కులేకుండా దువ్వుకోవాలి. ఈప్యాక్ వేసుకొన్న తర్వాత తలను బాగా ఆరనివ్వాలి, తర్వాత తలస్నానం చేసి, కండిషనర్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కేశాలు స్ట్రెయిట్ గా మరియు సిల్కీగా మారుతాయి.



Click it and Unblock the Notifications