Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
సాంప్రదాయ దుస్తుల మీదకు వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ..!
కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ చుడీదార్ కుర్తా మీదకు చాలా గ్రాండ్ గా ఉంటాయి. ఎందుకంటే చాలా మంది మహిళలు మరియు సెలబ్రెటీలు చుడీదార్ కుర్తాలను ధరించడానికి చాలా ఇష్టపడుతారు. చుడీదార్ లు నిజానికి ఒక సంప్రదాయ దుస్తులు అందువలనే చుడీదార్ లమీదకు కొన్ని హెయిర్ స్టైల్స్ ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. పాతకాలపు హెయిర్ స్టైల్స్ ఎవ్వరూ ఇష్టపడరు. ప్రస్తుత కాలంలో చుడీదార్ ల మీదకు కూడా వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ను ప్రయత్నిస్తున్నారు.
మీకు కూడీ చుడీదార్ ల మీదకు కొత్తరకం హెయిర్ స్టైల్ కావాలనుకుంటే కొన్ని చుడీదర్ కుర్తా భారతీయ హెయిర్ స్టైల్స్ ను ప్రయత్నించవచ్చు. కానీ, సాధారణ హెయిర్ స్టైల్స్ నివారించాలి. కొన్ని రకాలు సాంప్రదాయకరమైన బ్రైడ్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. సమయం దొరికినప్పుడు వాటిని మీరు ప్రయత్నించవచ్చు . చుడీదార్ మీదకు ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుందో అని ఎంపిక చేసుకోవడం అనేది ఒక కీలకమైన అంశం. ఎందుకంటే ఫార్మల్ అకేషన్స్ కు ఇటువంటి దుస్తులను ఎంపిక చేసుకోము. కాబట్టి చుడీదర్ల మీదకు కొన్ని రకాల ఫ్యాన్సీ హెయిర్ స్టైల్స్ ప్రయత్నించడానికి సమయం లేనప్పుడు ఈ క్రింది వాటిలో మీకు నచ్చిన హెయిర్ స్టైల్ తో మీ అందాన్ని ఇతరులు ఆకర్షించే విధాంగా తయారవచ్చు. మరి ఆ హెయిర్ స్టైల్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

టాప్ నాట్ బన్: ఇక్కడ దీపికా పదుకొనే తన హెయిర్ ను పైకి ముడి వేసింది. అయితే ఆమె జుట్టు ఫ్లాట్ గా కనిపించలేదు. ఎందుకంటే ఆమె కేశాలు కర్లింగా ఉండటం వల్ల తర్వాత వాటిని రోల్డ్ చేసి బన్ లా చేయడం వల్ల అంత ఫ్లాట్ గా కనబడలేదు.

సైడ్ స్వెప్ట్ హెయిర్: సైడ్ స్వెప్ట్ హెయిర్ స్టైల్ ప్రస్తుత ట్రెండ్ ను బాగా అలరిస్తోంది. అయితే ఈ స్టైల్ ఎందుకు ఒక అందమైన చుడీదార్ కుర్తా మీదకు నప్పదో కారణం లేదు.

ప్లెయిన్ బ్రైడ్: మీకు నిజంగానే పొడవాటి జుట్టు ఉన్నట్లైతే మీరు ట్రావెల్ చేసేటప్పుడు వాటిని అలాగే వదిలేయకూడదు. జస్ట్ ఒక జడలాగే అల్లుకోవాలి. ఇది చాలా సులభమైన మరియు త్వరగా వేసేసుకోగల ప్లెయిన్ బ్రైడ్ హెయిర్ స్టైల్.

మెస్సీ ఓపెన్ హెయిర్ : మీరు యవ్వనంగా కనబడాలంటే మరియు చుడీదార్ లో సౌకర్యవంతంగా కనబడాలంటే మీ కేశాలకు మీ వేళ్లతోనే జస్ట్ బ్రెష్ చేయండి. ఇది మెస్సీ ఓపెన్ హెయిర్ టైప్ లో కనబడుతుంది.

సైడ్ బన్: సైడ్ బన్ అనేది పురాతన కాలపు సాంప్రదాయపు స్టైల్. అది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్ గా తలపొస్తోంది. ఇలా సైడ్ బన్ వేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించాల్సి అవసరం లేదు.

సైడ్ బ్రైడ్ : సైడ్ బ్రైడ్ వేసుకోవడం చాలా సులభం మరియు చూడటానికి చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది. సైడ్ బ్రైడ్ కు కేశాలు లూజుగా ఉండేలా నిర్ధారించుకోవాలి. జడ చాలా టైట్ గా ఉంటే అతి మీ ముఖం పాలిపోయినట్లు చేస్తుంది.

నీట్ బన్: బహుముఖ కేశాలంకరణలో ఇది ఒక ముఖ్యమైనటువంటి కేశాలంకరణ. దీన్ని మీరు సులభంగా ప్రత్నించవ్చు. నీట్ బన్ ప్రస్తుతం ఫ్యాషన్ . మీకు మందపాటి జుట్టు మరియు స్లిమ్ ఫిగర్ అయితే మాత్రమే ఈ అలంకరణను ప్రయత్నించాలి.

మెస్సీ బన్: ఇది ఒక చిందరవదంగా అనిపించే ఒక స్టైలిష్ హెయిర్ స్టైల్. సన్నగా ..నాజుగ్గా ఉండే వారికి ఈ మెస్సీ బన్ ఫర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

ఫ్రెంచ్ బ్రైడ్: పేరులో అనిపిస్తోంది ఇది ఇండియన్ హెయిర్ స్టైల్ కాదని. ఇది ఒక ఫ్రెంచ్ జడ మడత. తల మీద నుండి జడ అల్లడం మొదలు పెట్టాలి. ఈ ఫ్రెంజ్ అంట్ టైట్ బ్రైడ్ ఒక ప్రత్యేకమైన రూపం కలిగి ఉంటుంది.

బ్యాక్ బ్రెష్డ్ హెయిర్: మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నప్పుడు మీ కేశాలను అలా లూజ్ గా వెనకకు దువ్వి వదిలేయవచ్చు .



Click it and Unblock the Notifications