For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుపెరుగుదలను ప్రోత్సహించే సహజ సుగంధద్రవ్యాలు

By Derangula Mallikarjuna
|

సాధారణంగా మన వంటల్లో రుచి మరియు ఫ్లేవర్ కోసం అనేక సుగంధ ద్రవ్యాలను ఉపయగిస్తుంటాం. ప్రతి ఒక్క సుగంధ ద్రవ్యంలో ఈ రెండు కాంబినేషన్లు ఉంటాయి . కొన్ని సుగంధ ద్రవ్యాలు చాలా తక్కువగా ఉంటే మరికొన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మన ఇండియాలు వంటలకు ఈ సుగంధ ద్రవ్యాలు చాలా ముఖ్యమైనవి . ప్రపంచవ్యాప్తంగా మన భారత దేశంలో సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యాలను అధికంగా వాడటం వల్ల భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు .

సుగంధ ద్రవ్యాలు వంటకు మాత్రమే కాదు మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు. కొన్ని సుగంధ ద్రవ్యాల్లో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉదా: పసుపు: చర్మాన్ని శుభ్రపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది మరియు చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా మరికొన్ని సుగంధ ద్రవ్యాలు జుట్టుకూడా మేలు చేస్తాయి . ఈ సుగంధ ద్రవ్యాలు కేశ కణాలను బలపేతం చేస్తాయి మరియు జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. కొన్నింటిని, జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మరియు రఫ్ హెయిర్ నివారించడానికి మరియు డల్ హెయిర్ ను తగ్గించడానికి కొన్ని సుగంధ ద్రవ్యాలను ఉత్తమ రెమెడీలుగా కూడా ఉపయగిస్తున్నారు .

జుట్టు పతనం ఆపడానికి మరియు జుట్టు పెరుగుదల పెంపొందించు కొన్ని ప్రయోజనకర సుగంధ ద్రవ్యాలు క్రింద ఇవ్వబడ్డాయి : -

కరివేపాకు -

కరివేపాకు -

మన ఇండియన్ మహిళల్లో పొడవాటి జుట్టు కలిగి ఉండటానికి ఒక బ్యూటీ సీక్రెంట్ కరివేపాకు. ఈ మసాలా దినుసు వంటకాల్లో అద్భుతమైన సువానను జోడించడంతో పాటు, జుట్టు పొడవుగా మరియు మందగా పెరగడానికి అద్భుతంగా సహాయపడుతుంది. కరివేపాకులను ఉపయోగించడం, కొన్ని కరివేపాకులను తీసుకొని ఒక బైల్ కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. బౌల్ క్రింది బాగంలో నల్లగా ఏర్పడుతుంది.అలా తయారైన నల్లటి మిశ్రమాన్ని మీ తలకు ఉపయోగించవచ్చు . ఇలా తలకు పెట్టుకొన్న తర్వాత 2,3గంటల పాటు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే , మీరు మీజుట్టు పెరుగుదలను గమనించవచ్చు.

 బ్లాక్ జీలకర్ర -

బ్లాక్ జీలకర్ర -

ఈ సుగంధ ద్రవ్యం ఆహారాలకు మంచి వాసన రుచి మాత్రమే కాదు, జుట్టు, చర్మం మరియు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. బ్లాక్ జీలకర్రలో జుట్టును బలోపేతం చేయడానికి మరియు హెయిర్ గ్రోత్ పెంచడానికి సహయపడే సహజ లక్షణాలు ఇందులో అధికంగా ఉన్నాయి . బ్లాక్ జీలకర్రను జుట్టు రాలడాన్నిఅరికట్టడానికి ఉపయోగిస్తారు . బ్లాక్ జీలకర్ర జుట్టుకి చాలా మంచి సుగంధ ద్రవ్యాలుగా ఉన్నాయి.

 పసుపు:

పసుపు:

అనేక విధాలుగా ఉపయోగించదగ్గ మ్యాజిక్ కలిగినటువంటి పసుపు. గాయాలను మాన్పడానికి ఒక యాంటీసెప్టిక్ గా పసుపును ఉపయోగిస్తున్నారు. అలాగే స్కిన్ కండీషనర్ గాను , స్కిన్ క్లెన్సర్ గాను మరియు ఆరోగ్యానికి ఒక మంచి సుగంధ ద్రవ్యంగాను ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ బహుళార్ధసాధక మసాలా దినుసులో అనేక హెయిర్ బెనిఫిట్స్ కూడా కలిగి ఉన్నాయి. పసుపు తలలో చర్మం rejuvenates చేస్తుంది మరియు జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది . ఇంకా ఇది చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది.చుండ్రువల్ల జుట్టురాలడాన్ని అరికడుతుంది. పసుపును డ్రైరెక్ట్ గా అలాగే అప్లై చేయవచ్చు లేదా నూనెతో మిక్స్ చేసి అప్లై చేయవచ్చు. అప్లై చేసిన తర్వాత 20నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి . మంచి ఫలితాల కోసం రెగ్యులర్ గా ఉపయోగించండి.

పెప్పర్ :

పెప్పర్ :

బ్లాక్ మరియు రెడ్ పెప్పర్ ఆహారాలకు మంచి హాట్ అండ్ స్పైసీని మాత్రమే తీసుకురావడం కాదు, ఇది, జుట్టుకు చాలా ఉపయోగకరం. అలాగే, పెప్పర్ లో సహజ టాక్సిన్స్ కలిగి ఉండి జుట్టు గ్రీవం పెరుగుదలను విస్తరింపచేస్తుంది. మరియు అలాగే కొత్త జుట్టు మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరిగేలా చేస్తుంది. అలాగే పెప్పర్ తలలో బ్లడ్ సర్కులేషన్ ను మెరుగుపరుస్తుంది. ఫలితంగా జుట్టు పెరుగుదలను అధికంగా మెరుగుపర్చుతుంది. అందువలన మిరియాలు జుట్టుకి ఒక సుగంధ ద్రవ్యంగా చెప్పబడింది.

 రోజ్మేరీ:

రోజ్మేరీ:

ఈ స్పైసీ సూపులకు ఒక మృదువైన రుచి ఇస్తుందని ఉపయోగిస్తారు . దీన్ని జుట్టుకోసం ఉపయోగించినప్పుడు అద్భుత ప్రయజనాలను అందిస్తుంది . రోజ్మెరీ స్పైసీ జుట్టుపెరుగుదలకు మరియు పోషణకు బాగా సహాయపడుతుంది. దీన్ని జుట్టు గ్రీవం చైతన్యపరచడానికి మరియు జుట్టు నష్టం నివారించడానికి ఉపయోగిస్తారు. అలాగే చుండ్రు మరియు పొడి జుట్టు నివారణకోసం రోజ్మెరీని ఒక గొప్పఔషధంగా ఉపయోగిస్తారు .

పైన పేర్కొన్నవి కొన్ని సుగంధ ద్రవ్యాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా, మీరు బాహ్యంగా నూనెలతో, హెయిర్ మాస్క్ మరియు హెయిర్ ప్యాక్ లుగా ఉపయోగించవచ్చు.వీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్లజుట్టు పెరుగుదలలో మంచి మార్పులను మీరు గమనించవచ్చు. చర్మం మరియు శరీరం మరియు కేశ సంరక్షణకు రసాయన ఉత్పత్తులకంటే, ఇటువంటి నేచురల్ వస్తువును ఉపయోగించడం ఎంతో ప్రయోజనకరం.

English summary

Spices For Hair Growth

Spices are ingredients that enhance the taste and flavor of cuisines. Every spice has a unique flavor, aroma and applications accordingly. Some spices are mild while others are very strong.
Desktop Bottom Promotion