Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
సిల్కీ అండ్ షైనీ హెయిర్ కోసం బనానా కాంబినేషన్ హెయిర్ ప్యాక్స్...!
ప్రపంచం మొత్తానికి హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్. హెయిర్ ఫాల్ అరికట్టడానికి మనం ఏదో ఒకటి చేయాలనుకొంటాం. ఇంకా హెయిర్ బాగా పెరగాలని ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాం. కానీ, కొన్ని చిట్కాలు మరియు చికిత్సలు మాత్రమే మంచి ఫలితాలను చూపెడుతాయి. హెయిర్ ప్యాక్ చాలా సాధారణ పద్దతి. దీన్ని ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు. హెయిర్ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కేశాలు మెత్తగా, మందంగా పెరుగుతాయి.
హెయిర్ ప్యాక్ లో చాలా రకాలు ఉన్నాయి. అందులోనూ వివిధ రకాల వస్తువులు ఉదా పెరుగు, తేనె, వెనిగర్, గుడ్డు, హెన్నా, నిమ్మ వంటి వాటితో హెయిర్ ప్యాక్స్ వేసుకుంటుంటాం. అలాగే బనానా(అరటితో)హెయిర్ ప్యాక్ మీరెప్పుడైనా విన్నారా? అరటి పండులో హెయిర్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇది పొడిబారిన, చిక్కుబడిన మరియు రఫ్ హెయిర్ ను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. బనానా హెయిర్ మాస్క్ ఇంకా కేశాలను మృదువుగా మరియు సున్నితంగా పట్టుకుంటే జారిపోయేలా తయారవుతాయి.
ఈ సీజన్ లో ఏర్పడే జుట్టు సమస్యలు చుండ్రు, తల దురద, పొడిబారిన జుట్టు వంటి సాధారణ సమస్యలకు మంచి నివారణోపాయని. అందుకే బనానా హెయిర్ ప్యాక్ చాలా పాపులర్ అయింది. కాబట్టి మీ జుట్టు రాలడాన్ని తగ్గించి, మృదువైన కేశాలను పొందాలనుకుంటే కొన్ని బనానా హెయిర్ ప్యాక్ లను తలకు ఎలా వేసుకోవాలో క్రింది పద్దతులను చూడండి....

బనానా-అవొకాడో హెయిర్ ప్యాక్: బాగా పండిన అరటిపండు గుజ్జులో అవొకాడో మరియు కొబ్బరి పాలు మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు మరియు కేశాలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ బనానా హెయిర్ ప్యాక్ మంచి హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. మీ హెయిర్ ను సిల్కీగా మరియు సాఫ్ట్ గా తయారు చేస్తుంది. ఇది డ్యామేజ్ హెయిర్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది జుట్టు చిట్టడాన్ని మద్యకు తెగిపోవడాన్ని అరికడుతుంది.
బనానా -కోకా హెయిర్ ప్యాక్: బాగా పండిన అరటి పండు ముక్కలు మిక్సీలో వేసి, అందులో పాలు, బాదాం ఆయిల్ వేసి బాగా బ్లెడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ పొడవైన కేశాలకు మరియు తల మాడుకు పట్టించాలి . ఈ మిశ్రమాన్ని 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి . ఈ బనానా హెయిర్ ప్యాక్ కేశాలకు పోషణ అంధిస్తుంది. కోకను మిక్స్ చేయడం వల్ల కేశాలకు నేచురల్ కలర్ ను అంధిస్తుంది.
బనానా -గుడ్డు హెయిర్ ప్యాక్: కేశాలను మృదువుగా, సిల్కీగా మరియు ఆరోగ్యంగా ఉంచే వాటిలో గుడ్డు ప్రధానమైనది. గుడ్డును, బనానాను ఉపయోగించి పొడిబారిన కేశాలను నివారించి సున్నితమైన జుట్టును పొందవచ్చు. గుడ్డు, బనానా మిశ్రమాన్నికురులు, తలమాడుకు పట్టించి ఒక గంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల, సిల్కీ మరియు షైనీ హెయిర్ మీ సొంతం అవుతుంది.
బనానా -మొయోనైజ్ హెయిర్ ప్యాక్ : పచ్చిగా ఉన్న అరటిపండు ముక్కలను మిక్సీలో వేసి, అందులో మొయోనైజ్ 2టేబుల్ స్పూన్లు, 3 చుక్కల లావెండర్ ఆయిల్ మరియు కొన్ని చుక్కల బాదాం ఆయిల్ వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మీ కేశాలు సిల్కీగా ఉండటమే కాదు, కేశాలకు కావల్సిన తేమను అంధించి కేశాలను సుతిమెత్తగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ హోం మేడ్ బనానాన హెయిర్ ప్యాక్స్ అద్భుతమైన ఫలితాలనిస్తాయి. ఈ హెయిర్ ప్యాక్ ను పొడి ఉన్న కేశాలకు అప్లై చేయకూడదు. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసే ముందు కురులకు హాట్ ఆయిల్ మసాజ్ లేదా జుట్టు తడి చేసిన అరగంట తర్వాత ఈ హెయిర్ ప్యాక్స్ అప్లైచేయవచ్చు.



Click it and Unblock the Notifications