Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తెల్ల జుట్టు నివారించడానికి 5 ఆశ్చర్యకరమైన ఉత్పత్తులు
ప్రస్తుతం ఈ మోడ్రన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందంగా కనబడుటకు ఆరటపడుతున్నారు. ఇది ఒక్క మహిళల్లో మాత్రమే కాదు, పురుషులు కూడా అందుకు ముందున్నారు. అందంతో పాటు, స్త్రీలతో పాటు, పురుషులు కూడా వారి జుట్టును సంరక్షించుకోవడం తగిన జాగ్రత్తలు పాటిస్తూ, దీర్ఘకాలం పాటు జుట్టు అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత అందంగా ఉంచుకొనే, కాలంతో పాటు మానవ శరీరంలో వచ్చే మార్పులో గ్రేహెయిర్ (తెల్ల జుట్టు)కు కూడా ఒక కారణం. అయితే గ్రే హెయిర్ అనేది ప్రతి ఒక్కరి జీతితంలో ఎదురయ్యే సమస్యే అయినా, అతి చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతుంటారు . గ్రే హెయిర్ జ్ఞానం మరియు పరిపక్వతతో ముడిపడి ఉన్నందున మీరు చూడటానికి యంగ్ మరియు బ్యూటిఫుల్ గా ఉంటారు. అలా యంగ్ గా ఉండాలంటే, తెల్లజుట్టు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతి ఒక్కరూ జుట్టు కలర్ సహజంగా ఉండేలా ఎందుకు కోరుకుంటారు?
మీరు మార్కెట్లో ఒటిసి హెయిర్ ప్రొడక్ట్స్ ను కనుగొనవచ్చు. ఇవి మీ జుట్టుకు నేచురల్ హెయిర్ కలర్ ను అందిస్తాయి. అలాగే వైబ్రాంట్ షేడ్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల చూడటానికి స్టైలిష్ గా కనబడుతుంది. అయితే, ఈ కలర్స్ లో కొన్ని కెమికల్స్ ఉపయోగించడం వల్ల అనేక పరిణామాలకు దారితీయవచ్చు. చాలా వరకూ ఓటిసి హెయిర్ కలర్ ఉత్పత్తుల్లో ఎక్కువగా అమ్మోనియా మరియు ఇతర కఠిన కెమికల్స్ ను వినియోగిస్తుంటారు. ఇటువంటి ఉత్పత్తులు సున్నిత చర్మ తత్వం కలవారికి జుట్టుకు హానికలిగించవచ్చు. అదే సమయంలో ఇటువంటి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్స్ కు గురిచేసి , జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా నేచురల్ హెర్బ్స్ మరియు వాటి యొక్క ద్రవాలను ఉపయోగించడం వల్ల వీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు మరియు వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు. అందులో ఇవి ఖరీదైనవి కూడా కాదు మరియు ఇటువంటి సొల్యుషన్స్ ను మీరు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మీ జుట్టుకు కలరింగ్ ఇవ్వడంతో పాటు, ఈ హెర్బ్స్ లో నేచురల్ హెయిర్ కలర్స్ కలిగి ఉంటాయి, ఇవి జుట్టుకు తగినంత పోషణ కూడా అందిస్తాయి. మరి బెస్ట్ నేచురల్ హోం మేడ్ హెయిర్ కలర్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

కొబ్బరి నూనె మరియు కరివేపాకు:
కొబ్బరి నూనె అమేజింగ్ మాయిశ్చరైజింగ్ మరియు ఇది తలకు మరియు జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. కరివేపాకును ఉపయోగించినప్పుడు, ఇది ఆయుర్వేద గుణాలను అందిస్తుంది. దాంతో గ్రే హెయిర్ ను కవర్ చేస్తుంది. అరకప్పు కరివేపాకులో కొబ్బరినూనెను వేయాలి . దీన్ని సాస్ పాన్ లో వేసి నిదానంగా తక్కువ మంట మీద కాచుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం చల్లార్చనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని తలకు మరియు జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

ఆమ్లా/ఉసిరికాయ
ఇండియన్ గూస్బెర్రీగా పలువబడే ఉసిరియకాయలో అనేక ప్రయోజనాలున్నాయి. దీన్ని ఉపయోగించి గ్రేహెయిర్ ను కవర్ చేయవచ్చు. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, ఎండలో ఎండనివ్వాలి. ఎండిన తర్వాత ఈ ముక్కలను కొబ్బరి నూనెలో వేసి కొద్ది సమయం బాగా మరిగించాలి. ఈ ఉసిరికాయ ముక్కలు క్రిస్పీగా గట్టిపడుతాయి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను తలకు మరియు జుట్టుకు పట్టించాలి. కొంత సమయం అలాగే ఉంచుకొని తర్వాత నాణ్యమైన షాంపుతో తలస్నానం చేయాలి.

మజ్జిగ మరియు కరివేపాకు:
కరివేపాకు మరియు మజ్జిగ కాంబినేషన్ కూడా గ్రేహెయిర్ ను నివారిస్తుంది. ఒక కప్పు మజ్జిగలో గుప్పెడు కరివేపాకు వేయాలి. ఈ మిశ్రమాన్నితలకు పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచి, అరగంట తర్వాత నిధానంగా మసాజ్ చేసి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

క్యారెట్ సీడ్ ఆయిల్ మరియు నువ్వుల నూనె:
క్యారెట్ సీడ్ ఆయిల్ మరియు నువ్వుల నూనె రెండింటిని మిక్స్ చేసి తలకు బాగా పట్టిస్తే గ్రేహెయిర్ నివారించబడుతుంది. అందుకు 4టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెలో కొద్దిగా క్యారెట్ సీడ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి నిధానంగా మసాజ్ చేయాలి. దీన్ని కొద్ది సేపు అలాగే ఉంచి, తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

నిమ్మరసం, బాదం ఆయిల్ మరియు ఉసిరి:
నిమ్మరసం, ఉసిరికాయ మరియు బాదం ఆయిల్లో ఆయుర్వేదిక్ గుణగణాలు ఉండటం వల్ల ఈ మూడు పదార్థాల యొక్క మిశ్రమం గ్రేహెయిర్ ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజరేటర్లో 3రోజుల పాటు నిల్వ చేసి తర్వాత బయటకు తీసి తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా ప్రతి రోజూ కూడా అప్లై చేయవచ్చు.
ఈ చిన్న చిన్నఆశ్చర్యకరమై చిట్కాలు మనకు తెలిసిన, వాటిని మనం ఎప్పుడూ ప్రయత్నించి ఉండము . ఇటువంటి సులభ చిట్కాలను మనం నిర్లక్ష్యం చేసేది ఎక్కువ. ఈ చిట్కాలు చాలా సింపుల్ గా మరియు ఖరీదు తక్కువగా ఉండి, మీ తెల్ల జుట్టును నివారిస్తాయి



Click it and Unblock the Notifications