For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రును మాయం చేసే 8 హెర్బల్ చికిత్సా పద్థతులు

|

శిరోజాల పరిరక్షణలో తరచూ చిరాకు పెట్టి , ఇబ్బంది కలిగించే సమస్య చుండ్రు. ఈ చుండ్రు (Dandruff) ఒకరకమైన చర్మవ్యాధి. ఏ కాలంలో అయినా ఎల్లప్పుడూ అందరినీ వేధించే సమస్య తలలో చుండ్రు, వయసుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం. కొన్ని సమయాల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ తోడుఅవుతుంది. ప్రతిరోజూ కొన్ని లక్షల చర్మం కణాలు పుడుతూ ఉంటాయి, కొన్ని లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి. ఇలా తల పైన కొత్త కణాలు కంటే మృతకనాలు ఎక్కువయితే అవి పెచ్చులుగా తలపై కనిపిస్తాయి ... అదే చుండ్రు . వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ చేరి చుండ్రు వలన పూర్తిగా జుట్టు రాలిపోయే ప్రమాదం రావచ్చును.

చుండ్రును తక్షణం పోగొట్టే 20 సులభ చిట్కాలను మీకోసం:క్లిక్ చేయండి

చుండ్రు రావడానికి కారణాలు అనేకం: చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అధిక వత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి వత్తిడికి గురి కావడం సహజం. అలాగే ఎక్కువ సమయం ఎసి గదుల్లో గడపడం వల్ల, ఫ్యాన్ కింద కూర్చున్నా తల మీది చర్మం పొడిగా అయిపోయి పొట్టులా లేస్తుంది. షాపూతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలపోయినా కూడా చుండ్రు వచ్చే అవకాశం వుంది. తలకు రాసుకునే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగడానికి అవకాశం ఎక్కువ. కలుషిత వాతావరణం కూడా చుండ్రును పెంచుతుంది.

పురుషుల్లో చుండ్రు: నిమ్మతో నివారణా చిట్కాలు: క్లిక్ చేయండి

ఏ వాతావరణంలో నివసించే వారికైనా చుండ్రు వస్తుంది. కాలాలు మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తలలో చుండ్రును పెంచుతాయి. శరీరానికి కావలసినంత పౌష్ఠికాహారం తీసుకోపోయినా, శరీరంలోని హార్మోన్లు సక్రమంగా లేకపోయినా కూడ చుండ్రు వస్తుంది. దీనివల్ల వచ్చే మానసిక అందోళన నుంచి బయటపడలన్నా, చుండ్రు పోవలన్నా ఎప్పుడూ మందులపై అధారపడకూడదు. ఇంట్లోనే తయారుచేసుకునే కొన్నిహెర్బల్ పదార్థాలను ఉపయోగించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ బాధ తగ్గించుకోవచ్చు. మరి ఈ హెర్బల్ పదార్థాలేంటో క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి...

మెంతులు:

మెంతులు:

చుండ్రు నివారణకు మెంతులు కూడా మంచి ఔషధమే. మెంతులను రాత్రిపూట నానబెట్టి, మరుసటిరోజు మెత్తటి పేస్టులాగా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలంతా, మాడుకు కూడా బాగా పట్టించి, అరగంటసేపు అలాగే ఉంచి.. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేసుకుంటే చుండ్రు తగ్గుతుంది, జట్టు పొడిబారకుండా ఉంటుంది.

పెరుగు:

పెరుగు:

చుండ్రును వదలగొట్టడంలో మరో ముఖ్య పదార్థం పెరుగు. అంతేకాదు పెరుగు వల్ల కురులు మంచి షైనింగ్ తో సున్నితంగా మారుతాయి. ఇక బాదాం నూనె మాత్రం తల మాడుకు మాయిశ్చరైజర్ గా పనిచేసి కురులు పెరిగేలా చేస్తుంది. నిమ్మరసం డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. కాబట్టి ఈ మూడింటిని ఒక మిక్సింగ్ బౌల్ లో మిక్స్ చేసి తల మాడికు పట్టించి రెండు గంటల తర్వాత తల స్నానం చేయాలి.

హెన్నా:

హెన్నా:

హెన్నా కూడా చుండ్రుని నివారించడంలో చక్కగా తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు హెన్నాని తలకు పట్టించి మర్నాడు తలస్నానం చేయండి. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ వెనిగర్ కలిపి దాన్ని తలపైన రాసుకుని మర్ధన చేసుకోవాలి. అర్థగంట తర్వాత గుడ్డుతో తలస్నానం చేయాలి.

పెసరపిండి:

పెసరపిండి:

చుండ్రును తగ్గించటంలో మరో మహత్తరమైన ఔషధంగా పెసరపిండి ఉపయోగపడుతుంది. రెండు టీస్పూన్ల పెసరపిండిని అరకప్పు పెరుగులో కలిపి తలకు పట్టించాలి. అరగంట తరువాత మంచినీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుస్రాలు చేసినట్లయితే చుండ్రు బాగా తగ్గిపోతుంది. జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

వేపాకు:

వేపాకు:

చుండ్రు నివారణకు ఒక మంచి దివ్వ ఔషదం. తలస్నానం చేసే రోజు కొన్ని వేపాకులు తీసుకొని ఒక గిన్నెడు నీళ్ళలో ఉడకబెట్టి బాగా మరిగిన నీళ్ళ రంగు మారుతుంది. మామూలుగా ప్రతి నిత్యం ఎలా తలస్నానం చేస్తారో అలాగే తలస్నానం చేసి, చివరగా మరిగిన వేపాకు నీళ్ళు కొద్దిగ చల్లరాక తల మీద పోసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే చాలు దీనివల్ల చుండ్రు తగ్గటమే కాకుండా జుట్టు పెరగుతుంది కూడా

తులసి:

తులసి:

తులసి ఆకులకు కొద్దిగా ఉసిరి పొడి మిక్స్ చేసి పేస్ట్ చేసి తలకు పట్టిస్తే, చాలా ఎఫెక్టివ్ గా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటి మిశ్రమాన్నిమిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. చుండ్రును నివారించడంలో మంచి ఫలితం ఉంటుంది.

అల్లం మరియు బీట్ రూట్:

అల్లం మరియు బీట్ రూట్:

హెర్బల్ రూట్ గా పిలుచుకొనే అల్లం కొన్ని అద్భుతాలనే చేస్తుంది. ఎందుకంటే ఇది చుండ్రు మరియు డ్యామేజ్ హెయిర్ ను నివారిస్తుంది. అల్లం రసం-బీట్ రూట్ రసంతో తలకు మసాజ్ చేస్తే చుండ్రు శాశ్వతంగా తొలగిపోతుంది. బీట్ రూట్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళలో వేసి వేడిచేసి రాత్రి పడుకొనే ముందు తల మాడుకు బాగా మర్దన చేసి మరుసటి రోజు ఉదయాన్ని తలస్నానం చేస్తే చుండ్రు తగ్గి వెంట్రులకు పెరుగుతాయి.

అలోవెరా జెల్:

అలోవెరా జెల్:

అలోవెరా జెల్ ఒక నేచురల్ బ్యూటీ రెమడీ. ఇది స్కిన్ కేర్ కు మాత్రమే కాదు, హెయిర్ కేర్ లో కూడా అద్భుతంగా సహాయపడుతుంది తలస్నానం చేయడానికి 20నిముషాల ముందు అలోవెర జెల్ ను తలమాడుకు బాగా మర్దన చేయాలి. మసాజ్ చేసిన అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

8 Herbal Treatments To Take Care Of Your Dandruff

Nothing can be more irritating and annoying than having a scalp littered with ugly dandruff flakes. These flakes are actually the dead cells of your scalp skin which slough off and appear onto the surface in the form of larger chunks.
Desktop Bottom Promotion