Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
జుట్టు చిట్లడానికి కారణాలు మరియు నివారణ
స్త్రీ మరియు పురుషులు ఎదుర్కొనే ఒక ప్రధాన జుట్టు సమస్య హెయిర్ బ్రేకేజ్. మీకు పొడవాటి జుట్టు ఉన్నట్లైతే ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది . హెయిర్ బ్రేకేజ్ అనేది ప్రధానంగా హెయిర్ డ్యామేజ్ వంటిదే. ఇది మీ జుట్టును మరింత రఫ్ గా మార్చుతుంది. దాంతో మీ జుట్టు చూడటానికి అనారోగ్యకరంగా ఉంటుంది. హెయిర్ బ్రేకేజ్ కు కారణం స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, జుట్టు చిక్కుబడటం, ముడులు బడటం వల్ల జుట్టు మద్యలోనిక తెగిపోతాయన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. వీటివల్లే చాలా సులభంగా హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. అలాగే తడి జుట్టును స్టైలింగ్ చేయడం వల్ల కూడా, హెయిర్ బ్రేకేజ్ కు కారణం కావచ్చు.
హెయిర్ బ్రేకేజ్ కు చిక్కు, ముడులు మాత్రమే కారణం కాదు, హెయిర్ బ్రేకేజ్ అవ్వడానికి మరికొన్ని కారణాలు కూడా దాగున్నాయి. జుట్టు చిట్లడం మరియు చిట్లిన జుట్టు డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి.

జుట్టు చిట్లడానికి కరణాలు...
జుట్టు చివర్లు చిట్లడానికి కారణాలు అనేకం. తగినంత తేమ లేకపోవడం, ఎండకు ఎక్కువగా తిరగడం, గాఢత కలిగిన షాంపూల వాడకం, హెయిర్ డ్రయర్‌తో ఎక్కువ సేపు ఆరబెట్టడం, హెయిర్ స్ట్రెయిటెన్ చేయడం, రంగు వేయడం, హెయిర్ బ్లీచ్ చేయించడం... వంటివన్నీ జుట్టు చిట్లడానికి దారితీస్తాయి.

చిట్ల కుండా ఏం చేయాలి?
వారానికి మూడుసార్లకు మించి తలస్నానం చేయరాదు, బాగా వేడిగా ఉన్న నీరు మంచిది కాదు. దేహం భరించగలిగినంత వేడి నీటిని వాడాలి.

తడిజుట్టు మీద నేరుగా డ్రయర్‌తో ఆరబెట్టరాదు.
ముందుగా టవల్‌తో తుడిచిన తర్వాత డ్రయర్‌తో ఆరబెట్టాలి. వీలయితే హెయిర్ డ్రయర్ వాడకాన్ని పూర్తిగా మానేసి జుట్టుని సహజంగా ఆరనివ్వాలి.

చిట్లితే ఏం చేయాలి?
జుట్టు చివర్లను నెలకోసారి, కనీసం రెండు నెలలకోసారి అయినా కత్తిరించాలి. రెండుగా చిట్లిన వెంట్రుక వేగంగా పైకి చీలిపోతుంది, చివర్లను కత్తిరిస్తే ఆగిపోతుంది.

చిట్లితే ఏం చేయాలి?
కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనెలను సమపాళ్లలో తీసుకుని గోరువెచ్చ చేసి జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. రాత్రంతా ఉంచి ఉదయం తలస్నానం చేయాలి. రాత్రంతా ఉంచుకోవడం సాధ్యం కాకపోతే గంట తర్వాత స్నానం చేయవచ్చు.

జుట్టు చిట్లడానికి కారణాలు మరియు నివారణ
కోడిగుడ్డుసొనలో మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.

జుట్టు చిట్లడానికి కారణాలు మరియు నివారణ
కప్పు బొప్పాయి గుజ్జు. అరకప్పు పెరుగు కలిపి మాడుకు, జుట్టు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications