Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
చుండ్రును మాయం చేసే అలోవెరా జెల్
జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక సాధారణ చర్మ సమస్య. ఇది మనం తలను క్లీన్ గా ఉంచుకోకపోతే కొన్ని బ్యాక్టిరియా మరియు ఫంగస్ వల్ల, కాలుష్యం వల్ల ఏర్పడుతుంది. తలలో చుండ్రు వల్ల తలలో ఎక్కువగా దురద, మరియు తలలో మొత్తం పొట్టు పొట్టుగా రాలుతుంటుంది. ఈ సమస్యను నివారించడానికి అలోవెరా (కలబంద) చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కలబందలో ఉండే పెక్టిన్ అనే అంశం తలలో కొత్త కణాలను మరియు కణజాలాలను ఉత్తత్తి చేయడానికి, నిర్వహించడానికి గొప్పగా సహాయపడుతుంది . అంతే కాదు, తలలోపలిబాగంలో జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యంగా పెరగడానికి కొన్ని న్యూట్రీషియన్లను గ్రహిస్తుంది . తలలో సెబమ్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం వల్ల ఆటోమ్యాటిక్ గా చుండ్రును నివారించవచ్చు. కాబట్టి, కొత్త జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
అలోవెరాతో తయారుచేసిన మన్నికైన షాంపుతో తలస్నానం చేయడం మరియు మంచినీళ్ళను తలకు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అలాగే అలోవెరాతో తయారుచేసిన షాంపు లేదా కండీషనర్ ను ఉపయోగించడం జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. తలలో చుండ్రును పూర్తిగా నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

కేవలం అలోవెరా
తలకు మరియు జుట్టుకు నేరుగా అలోవెరా జెల్, లేదా కలబంద రసాన్ని నేరుగా తలకు పట్టించి నిధానంగా మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజుల్లో వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది తాజాగా ఉండే అలోవెరా జెల్ స్క్రాచెస్, ఇన్ఫ్లమేషన్ మరియు సన్ బర్న్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

కలబంద మరియు మెంతులు
నీళ్ళలో మెంతులు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం రాత్రంతా నానిన మెంతులను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ కు అలోవెరా జెల్ ను మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను తలకు పట్టించాలి. ఇది తలలో అవాంఛితంగా ఏర్పడా నూనెను తొలగిస్తుంది. దాంతో తలలో జిడ్డు వదులుతుంది. దాంతో తలలో ఎలాంటి బ్యాక్టీరియా, ఫంగస్ ఉన్నా తొలగిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

యూకలిప్టస్ ఆయిల్ మరియు అలోవెరా
యూకలిప్టస్ ఆయిల్లో కొద్దిగా అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, నిధానంగా మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి. ఈ రెండు నేచురల్ హెర్బ్స్ లో ఉండే థెరఫాటిక్స్ లక్షణాల వల్ల తల మరియు జుట్టు క్లీన్ గా మారుతుంది. హెయిర్ షాంపును ఈ విధంగానే మీరు ఉపయోగించాల్సి ఉంటుంది.

కలబంద మరియు నిమ్మరసం
తాజా నిమ్మరసం కూడా చుండ్రు నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది చాలా ఆరోగ్యకరమైనది, ఇది చాలా గొప్ప ప్రయోజనం కలిగిస్తుంది . ఒక నిమ్మకాలో సగం భాగం నిమ్మరసం తీసుకొని అందులో అలోవెరా జెల్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి . తలకు పట్టించిన 1గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ప్రీ షాంపు ట్రీట్మెంట్
షాంపు ఉపయోగించడానికి ముందు ఫ్రీ షాంపు ట్రీట్మెంట్ ఉపయోగించడం వల్ల చుండ్రును నివారించడంతో పాటు జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. అలోవెరాలో ఉండే నేచురల్ ఎంజైమ్స్ తలలోని డెడ్ స్కిన్ సెల్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. అదే సమయంలో తలకు అవసరం అయ్యే తేమను కూడా అందిస్తుంది. అలోవెరా తలలోని పిహెర్ బ్యాలెన్స్ చేస్తుంది. అలోవెరా జెల్ ను తలకు పట్టించి తర్వాత 10 నిముషాల తర్వతా షాంపుతో తలస్నానం చేయాలి.

ఓవర్ నైట్ ట్రీట్మెంట్
ఆలోవెరా జెల్ ను అరకప్పు తీసుకొని , అందులో రెండు చెంచాలా ఆముదం, రెండు చెంచాలా మెంతి పొడి మరియు ఒక చెంచా తులసి పొడి మిక్స్ చేసి తలకు, జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత షవర్ క్యాప్ పెట్టుకొని నిద్రపోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మంచి నీరు, మన్నికైన షాంపుతో తలస్నానం చేయడం వల్ల జుట్టుకు అవసరం అయ్యే పోషకాలు అందడంతో పాటు, చుండ్రు వదులుతుంది. ఈ హెయిర్ మాస్క్ చాలా ఎఫెక్టివ్ గా కండీషన్ పనిచేస్తుంది. చుండ్రును నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీన్నికనీసం వారానికొకసారి ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications











