For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రింగ్ రాజ్ ఆయిల్ మీ జుట్టు సమస్యలను ఎలా మాయం చేస్తుంది

By Super
|

ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి ఆరోగ్యం మీద మాత్రమే కాదు, సౌందర్య మీద కూడా ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ . డెర్మటాలజిస్ట్ అభిప్రాయం ప్రకారం సాధారణ ప్రజలు ఒక్కరోజుకు 50 నుండి100 వరకూ వెంట్రుకలను కోల్పోతున్నారు. ఇది చాలా సాధరణం ఇలా అతి తక్కువలో కేశాలు రాలినా తిరిగి పెరుగుదల ఉంటుంది .

అందువదల్ల, ఇంత కంటే మరింత ఎక్కువగా జుట్టు రాలుతుంటే , మీ జుట్టు అనారోగ్యకరంగా మారినట్టైతే అందుకు వాతావరణంలో వేడి మాత్రమే కాదు, మీరు తలకు ఉపయోగించే హెయిర్ డైయర్స్ , హెయిర్ స్టైల్ ప్రొడక్ట్, కెమికల్స్ కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి. అయితే, ఇటువంటి పరిస్థితుల్లో మీ జుట్టును బ్రింగరాజ్ ఆయిల్ రక్షిస్తుంది . ఇది ఒక హెర్బల్ రెమెడీ. ఇది జుట్టు పెరుగుదలను పెంపొందిస్తుంది , ఇటువంటి పరిస్థితుల్లో బ్రింగరాజ్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

బ్రింగరాజ్ ఆయిల్ అంటే ఏమి?

బ్రింగరాజ్ అనేది ఒక మూలిక . దీన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ‘రసాయనాల్లో’ ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం దీన్ని తీసుకోవడం వల్ల వయస్సు మీదపకుండా చేస్తుంది , చర్మం ప్రకాశవంతంగా మార్చుతుంది. అదే విధంగా జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు రాలడం తగ్గించడంలో ఇది ఒక అత్యంత ప్రభావంతమైన మూలిక. అందువల్ల వివిధ రకాలా హెయిర్ ప్రొడక్ట్స్ లో ఈ మూలికను ఉపయోగిస్తున్నారు . బ్రింగరాజ్ ఆయిల్ అంటే ఈ మూలికను ఉడికించి తీయగా వచ్చే నూనె దీన్ని కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఈ బ్రింగరాజ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఆరోగ్యకరమైన జుట్టును పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

ఆరోగ్యకరమైన జుట్టును పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

ఆయుర్వేదం ప్రకారం, జుట్టు రాలడం మరియు ఇతర జుట్టు సమస్యలు పిట్టా కాంపోనెంట్ అధికం అవ్వడం వల్ల రాలుతాయి, ఈ సమస్యను నిర్మూలించడానికి బ్రింగరాజ్ ఆయిల్ సహాపడుతుంది . ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఈ నూనెను రెగ్యులర్ గా తలకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్తప్రసరణ జరుగుతుంది . ఈ ప్రక్రియ వల్ల హెయిర్ ఫాలిసెల్స్, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి . బ్రింగరాజ్ ఆయిల్ ను ఇతర మూలికలు శీకాకాయ్ మరియు ఆమ్లా మరియు కొబ్బరి నూనె, నువ్వుల నూనెతో కలిపి ఉపయోగించుకోవచ్చు . ఇవన్నీ కూడా ఒక్కటిగానే పనిచేస్తాయి . ఇవి జుట్టును మరింత ఆరోగ్యవంతంగా , ప్రకాశవంతంగా మార్చుతాయి.

చుండ్రును మరియు జుట్టు తెల్లబడుటను నివారిస్తుంది

చుండ్రును మరియు జుట్టు తెల్లబడుటను నివారిస్తుంది

బ్రింగరాజ్ ఆయిల్ తో తలకు రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల తలలో ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా నివారిస్తుంది . చుండ్రు రాకుండా కాపాడుతుంది . దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు తెలబడదు. తెల్లగా ఉన్న జుట్టు తిరిగి ఒరిజినల్ కలర్లోకి మారేవిధంగా చేస్తుంది.

ఒత్తిడి తగ్గిస్తుంది

ఒత్తిడి తగ్గిస్తుంది

బ్రింగరాజ్ ఆయిల్ తో రెగ్యులర్ గా మసాజ్ చేసుకోవడం వల్ల ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది . ఎవరైతే ఒత్తిడి వల్ల హెయిర్ ఫాల్ కు గురిఅవుతున్నారో అటువంటి వారికి ఈ బ్రింగరాజ్ ఆయిల్ ఎఫెక్టివ్ గా పనిచేసి, ఒత్తిడిని తగ్గించడంతో పాటు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . అంతే కాదు, టెన్సన్స్, తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.

బ్రింగరాజ్ ఆయిల్ ను ఎలా ఉపయోగించాలి

బ్రింగరాజ్ ఆయిల్ ను ఎలా ఉపయోగించాలి

ఈ నూనె చాలా కమర్షియల్ గా మార్కెట్లో అందుబాటులో ఉంది . బ్రింగరాజ్ ఆయిల్ మాత్రమే కాకుండా, బ్రింగరాజ్ పౌడర్ ను కూడా అందుబాటులో ఉంది. ఈ నూనె అయినా, పౌడర్ అయినా సరే మీరు రెగ్యులర్ గా ఉపయోగించే నూనెలతో మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి . కొన్నిగంటలు అలాగే ఉంచిత తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బ్రింగరాజ్ ఆయిల్ ఒక నేచురల్ ప్రొడక్ట్ , అందువల్ల, ఎటువంటి హానికరమైన దుష్ప్రభావాలు ఉండవు. ఎందుకంటే, ఇందులో కూలింగ్ ఎఫెక్ట్ అధికంగా ఉంటుంది . అయితే , ఒక సలహా ఏంటంటే, దీన్ని రాత్రంతా తలకు పెట్టుకొని పడుకోకూడదు. మరి వింటర్ లో దీనివాడకం తగ్గించాలి.

English summary

How bhringraj oil can banish your hair problems

If you have observed that you seem to be losing a few strands of hair every day, you are not alone. Dermatologists agree that on an average, people lose between 50 to 100 hair strands each day.
Story first published: Thursday, October 23, 2014, 13:07 [IST]
Desktop Bottom Promotion