For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టును మెరిపించడానికి బీర్ ను ఏవిధంగా ఉపయోగించాలి

|

బీర్ త్రాగడం వల్ల రిలాక్స్ అవొచ్చు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది అభిప్రాయం. ఇది శరీరంలోని టాక్సిన్స్ (విషాలను లేదా వ్యర్థాలను)బయటకు పంపిస్తుంది . మరియు కిడ్నీ స్టోన్స్ ను తొలగిస్తుందని గట్టి అభిప్రాయం ఉంది. అయితే మీరు బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ తెలుసుకొన్నట్లైతే ఆశ్చర్యపడక మానరు. బీర్ తీసుకోవడం వల్ల మరియు అప్లై చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి.

బీర్ వల్ల చర్మానికి మాత్రమే సంబంధించి ఉపయోగాలు మాత్రమే కాదు. బీర్ వల్ల కేశాలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది . బీర్ బెస్ట్ నేచురల్ హెయిర్ కండీషనర్ గా మనకు అందుబాటులో ఉంది. అందువల్ల బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ మెండుగా ఉండటం వల్ల పూర్తి శరీర ఆరోగ్యానికి ఉపయోగించబడుతున్నది. చర్మానికి మరియు కేశాలకు బీర్ ను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు . బీర్ బాత్ వల్ల ముఖంలో గ్లో వస్తుంది,వృద్ధాప్యంతో పోరాడుతుంది, చర్మాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ ను నిర్వహిస్తుంది మరియు మరియు మొటిమలకు విరుగుడుగా కూడా పనిచేస్తుంది.

బీర్ వల్ల కేశాలకు కూడా అనేక ప్రయోజనాలున్నాయి. బీర్ తో హెయిర్ వాష్ చేయడం వల్ల కేశాలకు తగినంత పోషణ అందుతుంది. కేశాలకు నేచురల్ కండీషనర్ గానే కాకుండా, సహజంగా కేశాలు మందంగా మరియు పొడవుగా పొందడానికి బీర్ ను కేశ సంరక్షణలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు. కాబట్టీ మీకు జుట్టు చాలా పల్చగా ఉన్నట్లైతే వాటిని మందంగా మరియు బలమైన జుట్టును పొందడానికి మీ కేశాలకు బీర్ వాష్ చేయడం మంచిది. అంతే కాదు బీర్ తో మరికొన్ని బ్యూటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మరి అవేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకొని మన జుట్టును సంరక్షించుకొందాం...

జుట్టును బలోపేతం చేస్తుంది:

జుట్టును బలోపేతం చేస్తుంది:

బీర్ జుట్టుకు అప్లై చేసిన కొన్ని గంటల తర్వాత మాత్రే ఉత్తమ ఫలితం చూపిస్తుంది. బీర్ ను జుట్టుకు పట్టించిన తర్వాత ఎప్పుడైతే బీర్ హెయిర్ రూట్స్, జుట్టు ఎక్కువగా గ్రహిస్తుందో అప్పుడే జుట్టుకు మంచి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది.

కండీషనర్ గా పనిచేస్తుంది:

కండీషనర్ గా పనిచేస్తుంది:

సహజంగా షాంపు పెట్టి స్నానం చేసిన విధంగానే స్నానం చేసిన తర్వాత బీర్ ను స్ప్రే బాటిల్లో పోసి, జుట్టుకు స్ప్రే చేయాలి. ఇది ఒక మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. దీంతో పాటు గుడ్డు కూడా ఒక మంచి కండీషనర్. అయితే ఈ రెండింటిలోకి బీరే ఉత్తమం ఎందుకంటే, బీర్ ను నేరుగా జుట్టుకు స్ప్రే చేసి వదిలేయవచ్చు.

డ్యామేజ్ అయిన హెయిర్ క్యూటికల్స్ ను మరమ్మత్తు చేస్తుంది:

డ్యామేజ్ అయిన హెయిర్ క్యూటికల్స్ ను మరమ్మత్తు చేస్తుంది:

బీర్ లో ఉండే ప్రోటీన్ డ్యామేజ్ అయిన హెయిర్ క్యూటికల్స్ ను రిపేర్ చేస్తుంది. ఇటువంటి జుట్టుకు కనీసం రెండు వారాల పాటు క్రమం తప్పకుండా కేర్ తీసుకొన్నట్లైతే మంచి ఫలితం ఇస్తుంది.

హెయిర్ ఫోలిసెల్స్ కు పోషణ అందిస్తుంది:

హెయిర్ ఫోలిసెల్స్ కు పోషణ అందిస్తుంది:

బీర్ మీ డ్యామేజ్ హెయిర్ ను నివారించడం మాత్రమే కాదు, ఇది హెయిర్ ఫోలిసెల్స్ కు తగిన పోషణను అందిస్తుంది.

జుట్టును షేనింగ్ గా మరియు స్మూత్ గా మారుస్తుంది:

జుట్టును షేనింగ్ గా మరియు స్మూత్ గా మారుస్తుంది:

జుట్టు స్మూత్ గా మరియు మంచి షైనింగ్ తో ఉండాలంటే, అందుకు బీర్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. బీర్ ను తడి జుట్టు మీద స్ప్రే చిసి నేచురల్ గా తడి ఆరనివ్వాలి . లేదా జుట్టు బ్లో చేయడానికి లేదా స్టైల్ చేయడానికి ముందు స్ప్రే చేయాల్సి ఉంటుంది.

మాయిశ్చరైజ్ ను అందిస్తుంది:

మాయిశ్చరైజ్ ను అందిస్తుంది:

జుట్టు సంరక్షణలో సింపుల్ గా కోట్ చేయడం వల్ల, ఇది జుట్టుకు కావల్సినంత తేమను అందిస్తుంది. చల్లని నీటితో తలస్నానం చేయడం వల్ల చిక్కుపడకుండా , జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది.

పోషకాలు:

పోషకాలు:

బీర్ లో మినిరల్స్, విటమిన్స్, అమినో యాసిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టుకు చాలా అవసరమైన పోషకాలు.బీర్ షాంపు మరియు కండీషనర్ ను జుట్టుకు చివర మగ్గునీటిలో కలిపి పోసుకోవాలి.

జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది:

జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది:

బీర్ తో జుట్టును మసాజ్ చేయకూడదు. లేదా ఎక్కువ సమయం బీర్ తో జుట్టును నాననివ్వకూడదు. బీర్ తలకు పట్టించిన కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేస్తే, జుట్టు చిట్లడాన్ని నివారించవచ్చు.

పొడి జుట్టు:

పొడి జుట్టు:

పొడిబారిన జుట్టును నివారించడంలో బీర్ అద్భుతంగా సహాయపడుతుంది. జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.కనుక వారానికొకసారి జుట్టుకు బీర్ ను తలకు పట్టించడం మంచిది.

జుట్టు చిక్కుబడటాన్ని నివారిస్తుంది:

జుట్టు చిక్కుబడటాన్ని నివారిస్తుంది:

చిక్కుబడిన జుట్టును మ్యానేజ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇటువంటి జుట్టుకు బీర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బీర్ లో ఉండే ప్రోటీన్స్ మీ జుట్టును స్మూత్ గా మరియు షైనీగా మార్చుతుంది. మరియు చూడటానికి అందంగా తయారుచేస్తుంది.

English summary

How To Use Beer For Shiny Hair

Beer is not always bad! Yes, you heard it right. Your doctor will say beer is not good for your health. However, your beautician will have a different opinion on this. Beer is widely used for hair care.
Story first published: Monday, December 29, 2014, 14:55 [IST]
Desktop Bottom Promotion