Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
శిరోజాల అందాన్ని మెరుగుపరిచే నేచురల్ హెయిర్ కేర్ టిప్స్
కేశాలు అందవిహీనంగా, నిర్జీవంగా మారడానికి పోషకాహార లోపం ప్రధాన కారణం అంటున్నారు పోషకాహార నిపుణులు. పోషకాహారం తీసుకోవడం అన్నది శరీరానికే కాకుండా శిరోజాలకు చాలా మేలు చేకూరుస్తుందని వారు చెబుతున్నారు. పోషకాహారం వలన జుత్తు ఊడిపోవడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలను తేలికగానే అధిగమించవచ్చని వారు వివరిస్తున్నారు. దీనికి తీసుకోవలసిన ఆహారపు జాగ్రత్తలు ఈ క్రింది విధంగా ...

1. కోడిగుడ్డు: గుడ్డు వేసవికాలం వేడి చేస్తుందనేది అవాస్తవం. దీనిలోని సల్ఫర్ శిరోజాలను అందంగా, ఆకర్షణీయంగా ఉంచడానికి దోహదపడుతుంది. అందువల్ల ప్రతిరోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవడం మంచిది.
2. ఇనుము: ఇనుము లోపం వలన కూడా జుత్తు ఊడిపోయే అవకాశం ఎక్కువ. ఖర్జూరంలో ఇనుము అధికంగా లభిస్తుంది. ఖర్జూరం ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడుతుంది కూడా!
3. విటమిన్ సి: విటమిన్ సి లోపం వలన జుత్తు చివర్లు చిట్లిపోయి అందవిహీనంగా కనపడతాయి. జామలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనితో పాటు ఉసిరి, టమాట, బత్తాయి తదితరాలు సాధ్యమైనంత ఎక్కువగా తీసుకో వాలి.
4. మాంసకృత్తులు : కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. చేపలలో ఎక్కువగా లభిస్తాయి. అయితే గుడ్లు, చేపలు తినలేని వారు సోయాను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. సోయాలోని లైసిన్ అమినో ఆమ్లం జుత్తు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
4. నీరు: నీటితో పాటు కొబ్బరినీళ్లు పండ్లరసాలు, సలాడ్‌లు అధికంగా తీసుకోవాలి.
5. జుట్టు సంరక్షణకు: జుట్టు రక్షణకు షాంపూ కండీషనర్ యాంటీ ఫ్రీజ్ సీరమ్, లివిన్ కండీషనర్‌ను రోజూ వాడాలి. హానికారక కెమికల్స్ ఉన్న షాంపూలను అసలు వాడకూడదు, కురుల మెరుపుకోసం అందంగా కనిపించడానికి కండీషనర్ తప్పకుండా వాడాలి. రింగుల జుట్టు ఉన్నవారికి కండీషనర్‌తో ఉపయోగం లేకపోతే వారు షైన్ సిరమ్ వాడాలి. షైన్ సిరమ్‌తో జుట్టు మెత్తగా మారుతుంది. కెమికల్స్ బారి నుంచి జుట్టు సంరక్షణకు వారంలో ఒకసారి క్లారిఫ్లయింగ్ షాంపూ వాడవచ్చు. జుట్టు కర్లీగా, స్ట్రెయిటనింగ్ చేసుకోవడానికి వారంలో ఒకసారి ఆయిల్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. ఫ్యాటీ ఆల్కహాల్‌తో కూడిన హెయిర్ మాస్క్ వేసుకోవడంతో కురులకు జీవం వస్తుంది. పాడైన జుట్టుకు ఈ రెండు పద్ధతులు రీ హైడ్రేట్ చేయడానికి అనువైనవి.
6. ప్రకృతి సిద్ధమైన అరటిపండు, స్ట్రాబెర్రీలతో కూడిన హెయిర్ మాస్క్ వాడితే జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది.
7. దుమ్ము ధూళి నుంచి జుట్టును కాపాడుకోవడానికి లివాన్ కండీషనర్, హెయిర్ క్రీమ్, ఎస్‌పిఎఫ్ కలిగి ఉన్న సీరమ్‌ను క్రమపద్ధతిలో వాడాలి.
హెయిర్ కేర్‌కు మార్కెట్లో చాలా రకాల సన్‌ప్రొటెక్టివ్ హెయిర్ కేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడవచ్చు. ఎస్‌పిఎఫ్ శాతం ఉన్న ఉత్పత్తులు జుట్టును సంరక్షిస్తాయి. జుట్టు రంగును కాపాడతాయి. పాడవకుండా రక్షిస్తాయి.



Click it and Unblock the Notifications