Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
సిల్కీ హెయిర్ కోసం: రెగ్యులర్ హెయిర్ కేర్ టిప్స్
సాధారణంగా మీరు అందం విషయంలో మీరు మేకప్ తో వెళ్లినా, మేకప్ లేకుండా వెళ్ళినా, పర్వాలేదు. కానీ, జుట్టు చిందరవందరగా మెస్ అప్ అయ్యి, చిక్కుబడిన జుట్టు ఉంటే ఇక అందం మొత్తం పాడైనట్లే. అందే అందమైన జుట్టు, నునుపుగా, సిల్కీగా ఉంటే మీ అందాన్ని రెండింతలు పెంచుతుంది. మీరు అందంగా కనిపించడం మాత్రమే కాదు, ఒక నమ్మకం కూడా మీలో ఏర్పడుతుంది. పర్సనాలిటీ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, సిల్కీ జుట్టు పొందడానికి, మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

పొడవాటి జుట్టు అయినా, కర్లీ హెయిర్ లేదా స్ట్రెయిట్ హెయిర్ అయినా..జుట్టు ఏరకమైన అన్ని రకాల జట్టుకు సరైన కేర్ తీసుకోవడం చాలా అవసరం . తగినంత శ్రద్ద మరియు బాధ్యత తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు ఎటువంటివైనా నివారించబడి, ప్రకాశవంతంగా మరియు మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది.
అయితే అందరికీ ఒకే విధమైన జుట్టు సంరక్షణ పద్దతులు సరిపోవు, జిడ్డు జట్టు మరియు పొడిబారిన జుట్టు కలిగిన వారు, జుట్టు కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి జుట్టు రకమైన మీరు సిల్కీగా, స్మూత్ హెయిర్ ను కోరుకుంటున్నట్లైతే ఈ క్రింది చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి. ...
1. డైట్: జుట్టు మూలాలు శరీరం మీద ఆధారపడుతాయి. జుట్టు మూలాలకు న్యూట్రీషయిన్ ఎక్కువగా అవసరం అవుతాయి. ఈ పోషకాల ద్వారా జుట్టు పెరుగుదల ఉంటుంది. కాబట్టి మీరు హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ హెయిర్ ఫోలిసెల్స్ కు అవసరం అయ్యే న్యూట్రిషిన్స్ అందుతాయి. ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం జుట్టు కు చాలా మంచిది.
2. హెయిర్ ప్యాక్: సిల్మీ మరియు స్మూత్ హెయిర్ పొందడానికి హెయిర్ ప్యాక్స్ ను ఎప్పటికీ మిస్ చేసుకోకూడదు. బాగా తెలిసిన కొన్ని హోం మేడ్ హెయిర్ ప్యాక్ లను నేచురల్ హెయిర్ ప్యాక్ లను ఇంట్లో అప్పుడప్పుడు వేసుకుంటుండాలి . గుడ్డు, తేనె, పాలు, నిమ్మరసం, పెరుగు వంటి వాటి మిశ్రమంతో తప్పనిసరిగా హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. ఇవి జుట్టుకు పోషణ సాఫ్ట్ నెస్, షైనింగ్ అందివ్వడమే కాదు, ఇవి జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి.
3. ఆయిలింగ్: జుట్టు పోషణకు ప్రధానం ఆయిల్. ఆయిల్ పెట్టకుండా జుట్టు పెరగదు. అంతే కాదు జుట్టు కూడా సిల్కీగా మారదు. కొన్ని ప్రత్యేకమైన నూనెలు కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ లేదా ఇతర నూనెలు కూడా జుట్టు పోషణకు బాగా సహాయపడుతాయి. అయితే ఏ నూనెలైనా గోరువెచ్చగా చేసి తలకు మసాజ్ చేసుకోవాలి. జుట్టు మొదళ్ళకు బాగా పట్టించాలి. తల స్నానం చేయడానికి ముందు ఇలా చేయడం వల్ల మీ జుట్టుకు గొప్ప విశ్రాంతిని కలిగించవచ్చు.
4. క్లెన్సింగ్: క్లెన్సింగ్(శుభ్రం) క్రమం తప్పకుండా రెగ్యులర్ గా చేయడం వల్ల తల మరియు జుట్టులో దుమ్ము, ధూళి తొలగిపోతుంది. ఇంకా శారీరక శ్రమ మరియు చెమట చేరి జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి, రెగ్యులర్ హెయిర్ కేర్ చాలా అవసరం. అందుకు మన్నికైన షాంపులను లేదా ఇంట్లో హేర్బల్ పద్దతులను ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల తల, జుట్టు క్లీన్ గా ఆరోగ్యంగా ఉంటాయి.
5. కండీషనింగ్: తలస్నానం చేసిన తర్వాత రెగ్యులర్ గా జుట్టుకు కండీషన్ అప్లై చేసుకోవడం మర్చిపోకండి. హోం మేడ్ కండీషన్ ప్రొడక్ట్స్ , చల్లని బ్లాక్ టీ, బీర్ మరియు వెనిగర్ వంటివి హెయిర్ కండీషనర్ గా చాలా సహాయపడుతాయి. మరియు వీటి ఖరీదు కూడా తక్కువ.



Click it and Unblock the Notifications











