Latest Updates
-
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు
జుట్టురాలడం తగ్గించే కొన్ని యోగాసనాలు
యోగా మరియు ధ్యానం సాధన చేయుట వలన జుట్టు నష్టంను తగ్గించటమే కాకుండా మంచి ఆరోగ్యకరమైన జుట్టును ఇస్తుంది. అంతేకాకుండా శారీరక మరియు మానసికంగా మీ మొత్తం వ్యవస్థకు ప్రయోజనం కలిగిస్తుంది. ఇంకా సూటిగా చెప్పాలంటే యోగ జీర్ణశక్తిని మెరుగుపరుచుట,చర్మంలో రక్త ప్రసరణ విస్తరించేందుకు సహాయపడుతుంది. అంతేకాక ఆందోళన మరియు ఒత్తిడిని క్రమంగా తగ్గించి జుట్టు నష్టంను తగ్గిస్తుంది.
జుట్టు నష్టం కొరకు ఉపయోగకరంగా ఉండే ఆసనాలు
తల ముందుకు వంచి ఆసనాలు చేయుట వలన తల పై భాగంలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీని పలితంగా జుట్టు మూలాలకు పోషణ కలిగి అప్పుడు జరిగే మార్పులను పరిశీలన చేయండి. ఇక్కడ మీరు తప్పకుండా ప్రయత్నించటానికి కొన్ని ఆసనాలు ఉన్నాయి.

అదోముఖ శవాసనం
ఇది క్రిందికి కుక్క భంగిమలో ఉంటుంది. ఇది తలకు మంచి సర్క్యులేషన్ అందిస్తుంది. సైనస్ మరియు జలుబు చికిత్సకు మంచిది. అంతేకాకుండా మానసిక అలసట, నిరాశ మరియు నిద్రలేమికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మీకు అదోముఖ శవాసనం ఎలా చేయాలో ఉంది.

ఉత్తాసనం
ఇది ముందుకు నిలబడే భంగిమలో ఉంటుంది.తల మీద చర్మంనకు ప్రసరణను మెరుగుపరుస్తుంది. నీరసం మరియు అలసట తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ గొప్ప భంగిమ మెనోపాజ్ యొక్క లక్షణాలకు ఉపశమనం మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వజ్రాసనం
ఇది డైమండ్ భంగిమలో ఉంటుంది. దీనిని ఇతర ఆసనాల వలే కాకుండా భోజనం అయిన తర్వాత వేయవచ్చు. దీనిలో ముందుకు వంగే భంగిమ ఉండుట వలన తలపై చర్మంనకు ప్రసరణను పెంచుతుంది. అంతేకాకుండా మూత్ర రోగాలకు చికిత్సకు,బరువు నష్టంకు,జీర్ణక్రియ మెరుగుపరచటానికి మరియు ఉదరంలో గ్యాస్ తగ్గటానికి సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియ అనేది శరీరంలో సంతులనం సృష్టించడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు నష్టం తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది. ఇక్కడ వజ్రాసనం ఎలా చేయాలో ఉంది.

కపాలభాతి ప్రాణాయామం
ఈ ప్రాణాయామం మీ మెదడు కణాలు మరియు నాడీ వ్యవస్థ కోసం చాలా మంచిది. అంతేకాకుండా ఎక్కువ ఆక్సిజన్ పొందటానికి సహాయపడుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని తీసివేయుటకు సహాయపడుతుంది. స్థూలకాయం మరియు మధుమేహంను తరిమి కొడుతుంది. శరీరంను సంతులనం చేయుట ద్వారా తక్కువ జుట్టు నష్టంకు దారితీస్తుంది.

పవనముక్తాసనం
ఇది గ్యాస్ ను తగ్గించి మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాక వెన్ను దిగువ కండరాలను పటిష్టపరచడం,ఉదరం మరియు పిరుదులపై ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.మంచి జీర్ణక్రియ సంతులనం వలన జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

సర్వంగాసనం
థైరాయిడ్ గ్రంధి పోషణకు,శ్వాసక్రియ,నాళము,జననేంద్రియ మరియు నాడీ వ్యవస్థ ఆరోగ్యకరమైన ఫంక్షన్ కు సహాయపడుతుంది. ఇది తల క్రిందికి ఉండే భంగిమలో ఉంటుంది. తలపై చర్మం మీద మంచి సర్క్యులేషన్ ఉండుట వలన జుట్టు నష్టం తగ్గుతుంది.



Click it and Unblock the Notifications
