Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పురుషుల్లో జుట్టు రాలడం నివారించే 11 నేచురల్ మార్గాలు
ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలే సమస్య సర్వ సాధారణం అయిపోయింది. స్త్రీ మరియు పురుషులిద్దరూ హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే స్త్రీలతో పోల్చితే పురుషుల్లోనే జుట్టు అధికంగా రాలుతున్నది. ప్రతి రోజూ వందలోపు హెయిర్ ఫాల్ ఉంటే అది సాధారణ స్థితిగా పరిగణించాలి అదే వందకు పైన హెయిర్ ఫాల్ ఉన్నట్లైతే దాన్నీ ప్రమాధకరంగా గ్రహించి వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం లేదా చికిత్స తీసుకోవడం చాలా అవసరం అవుతుంది.
గతంలో జుట్టు రాలుతున్నదంటే వయస్సైంది కాదా అనుకునే వారు, కానీ ప్రస్తుత రోజుల్లో చిన్న వయస్సులోనే జుట్టురాలే సమస్య రోజురోజుకు పెరుగుతున్నది. అందుకు ప్రధాన కారణం కెమికల్ ప్రొడక్ట్స్, ఒత్తిడి, మరియు పాపులేషన్ మరియు కాలుష్యం అందుకు ప్రధాణ కారణం అవుతున్నది.
ఇవే కాకుండా ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పౌష్టికాహార లోపం, కొన్ని రకాల మందుల వాడకం, విటమిన్స్ మరియు మినిరల్స్ లోపం వల్ల కూడా చిన్నవయస్సులోనే జుట్టు రాలే సమస్యను ఎందుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో పురుషుల్లో చిన్న వయస్సులోనే జుట్టు రాలడానికి ప్రధాణకారణం హార్మోనుల అసమతుల్యత కూడా కారణం అవుతుంది. దాంతో బట్టతలకు కారణం అవుతుంది.
పురుషుల్లో కూడా జుట్టు రాలడం నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ నేచురల్ పద్ధతులను అనుసరించడం ద్వారా రాలిపోయిన జుట్టు తిరిగి పెరుగుతుంది . కొన్ని నూనెలు, ఎగ్ ప్యాక్ మరియు ఇతర నేచురల్ పదార్థాలను తలకు పట్టించడం వల్ల జుట్టు తిరిగి పెరుగుతుంది. మరి అదెలాగో చూద్దాం...

1. విటమిన్ హెచ్:
విటమిన్ హెచ్ లో బయోటిన్ అనే అంశం ఎక్కువగా ఉంటుంది. బయోటిన్ తక్కువగా ఉన్నప్పుడు జుట్టు ఎక్కువగా రాలుతుంది. గోళ్ళు పెళుసుబారుతుంది. కాబట్టి విటమిన్ హెచ్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ను నివారించి, హెయిర్ స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. బయోటిన్ ఎక్కువగా గుడ్డు, వేరుశెనగలు, పెరుగు, లివర్, సాల్మన్, చీస్ వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. మరియు మీరు బయోటిన్ సప్లిమెంట్ ను కూడా ఎక్కువగా తీసుకోవచ్చు.

2. రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్స్ ను చేర్చాలి:
తీసుకొనే ఆహారం సరిగా లేకపోతే, జుట్టు సమస్యలు తలెత్తుతాయి. . కాబట్టి హెల్తీ హెయిర్ పొందాలంటే, ప్రోటీన్స్ ను ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా అందులో లెగ్యుమ్స్, పల్స్, మీట్, చికెన్, సోయా, పాలు, మరియు గుడ్లు, మరియు ఇతర ప్రోటీన్ ఫుడ్స్ ను చేర్చుకోవాలి.

3. మన్నికైన నూనెలతో తలకు మసాజ్ చేయాలి:
స్వచ్చమైన నూనెలు జిడ్డుగా ఉండవు . తలకు మరియు కేశాలకు చాలా సులభంగా షోషింపబడుతాయి. ఇది కొత్తగా జుట్టు పెరుగడానికి సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు ల్యావెండర్ మరియు నువ్వుల నూనె గ్రేట్ గా సహాయపడుతుంది.

4. పెరుగు మరియు ఎగ్ ప్యాక్:
అరకప్పు పెరుగులో ఒక గుడ్డు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని తలకు బాగా పట్టించాలి . ఇది జుట్టు రాలడం తగ్గించడం మాత్రమే కాదు, చుండ్రును కూడా నివారిస్తుంది. పురుషుల్లో జుట్టు రాలడం అరికట్టడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

5.ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టిస్తే జుట్టును స్ట్రాంగ్ గా ఉంచి రాలకుండా చేయడం మాత్రమే కాదు, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. రెండు మూడు ఉల్లిపాయలను నీళ్ళ వేసి ఉడికించి తర్వత వడకట్టి, ఆ నీరు చల్లారిన తర్వాత తలకు పట్టించాలి . ఇది పురుషుల్లో జుట్టు రాలడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

6. వెల్లుల్లి పేస్ట్:
వెల్లుల్లిని హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ లో ఉపయోగించవచ్చు. వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసి, ఈ పేస్ట్ ను బట్టతల ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. మరియు జుట్టు ఎక్కువగా రాలుతున్న ప్రాంతంలో అప్లై చేయడం వల్ల జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది.

7. గ్రీన్ టీ:
గ్రీన్ టీ మామూలు మీరు తయారుచేసినట్లే తయారుచేసి, చల్లార్చి ఆ గ్రీన్ టీని తలారాపోసుకోవాలి. 20 నిముషాల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి. పురుషులకు ఇది ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్.

8. ధూమపానం నిలిపేయాలి:
ధూమపానం తలకు రక్తప్రసరణను అడ్డుకుంటుంది. ఫలితంగా జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది మరియు జుట్టును డ్యామేజ్ చేస్తుంది మరియు జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

9. మన్నికైన షాంపును ఉపయోగించాలి:
తలస్నానానికి ఉపయోగించే షాంపులు మన్నికగా ఉండాలి. అప్పుడే జుట్టు రాలడం అరికట్టవచ్చు .

10. తరచూ తలస్నానం చేయకూడదు:
తరచూ తలస్నానం చేయడం వల్ల తలలో నేచురల్ ఆయిల్స్ ను తగ్గించేస్తుంది. అంతే కాదు పోషణ కూడా తగ్గుతుంది. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.

11. హెయిర్ జెల్స్ అప్లై చేయడం నివారించాలి:
చాలా మంది పురుషులు వారి జుట్టును సెట్ చేయడం కోసం హెయిర్ జెల్స్ అధికంగా ఉపయోగిస్తుంటారు. జుట్టు రాలడానికి ఇది కూడా ఒక ప్రాధాణకారనం. హెయిర్ జెల్స్ లో ఉండే కెమికల్స్ జుట్టు రాలడానికి కారణం అవుతుంది.



Click it and Unblock the Notifications