Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
తలలో పేనును ఎదుర్కోవటానికి 14 సమర్థవంతమైన హోం రెమిడీస్
పేలు తలలో వెంట్రుకలను అంటిపెట్టుకొని రక్తాన్ని ఆహారంగా తీసుకొని జీవిస్తున్న చిన్న పరాన్నజీవులు. ఇది పిల్లల్లో ఒక సాధారణ సమస్యగా ఉంటుంది. ఇవి వ్యక్తిగత వస్తువులను షేర్ చేసుకోవటం ద్వారా ఒకరి దగ్గరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి.
దురద,గోకటం వలన నెత్తిమీద చర్మంనకు చికాకు మరియు ఎక్కువగా బాధ కలుగుతుంది. తలలో పేల కోసం కఠినమైన రసాయనాలు కాకుండా సమర్ధవంతమైన ఇంటి చికిత్సలు ఉన్నాయి.
నేడు, మీకు Boldsky తలలో పేల కోసం కొన్ని ప్రభావవంతమైన హోమ్ రెమిడీస్ తెలియజేస్తుంది.

వెల్లుల్లి
వెల్లుల్లి బలమైన వాసన వలన పేను చికిత్స కోసం ఉపయోగించవచ్చు. అంతిమంగా అవి చనిపోతాయి. వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. దానికి నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించండి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయండి. ఆ తర్వాత దువ్వెనతో దువ్వితే పేలు వచ్చేస్తాయి.

వైట్ వెనిగర్
జుట్టులో పేలను తొలగించటం ఎలా? రాత్రి పడుకోవటానికి ముందు కొంచెం వైట్ వెనిగర్ తీసుకోని తలకు పట్టించి షవర్ క్యాప్ లేదా టవల్ తో మీ తలను కవర్ చేయాలి. రాత్రి అలా వదిలేసి ఉదయం షాంపూ తో మీ జుట్టును కడిగి మరియు దువ్వెనతో దువ్వితే పేలు బయటకు వస్తాయి.

తలలో పేను చికిత్స కోసం బేబీ ఆయిల్ కోసం చూస్తున్నారా?
బేబీ ఆయిల్ తలలో పేను కోసం బాగా ఉపయోగపడుతుంది. మీ జుట్టు మీద బేబీ ఆయిల్ ని రాసి దువ్వెనతో దువ్వితే పేలు కింద పడటం ప్రారంభం అవుతుంది. అప్పుడు, లాండ్రీ డిటర్జెంట్ మరియు వేడి నీటితో మీ జుట్టును కడగాలి.

ఆలివ్ నూనె రాసి దువ్వండి
పేను చికిత్సకు, మూడు వారాల పాటు ప్రతి ఉదయం మరియు సాయంత్రం మీ జుట్టుకు ఆలివ్ నూనె లేదా బాదం నూనె రాసి దువ్వండి. ముళ్ళు మాదిరిగా ఉన్న ఒక దువ్వెనను ఎంచుకోండి. ఇది తలలో పేలకు ఉత్తమ హోమ్ నివారణలలో ఒకటి.
ఉప్పు
ఉప్పు పేలు తీవ్రస్థాయిలో డ్రై కావటానికి కారణమవుతుంది. అరకప్పు వెనిగర్ లో ఐదు స్పూన్స్ ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఒక షవర్ క్యాప్ ధరించి రెండు గంటలు అయ్యాక మీ జుట్టు కడగడం మరియు దువ్వటం చేయాలి. అనుకూలమైన ఫలితాలను పొందడానికి ప్రతి మూడు రోజులకు ఒకసారి రిపీట్ చేయాలి.

పెట్రోలియం జెల్లీ
పెట్రోలియం జెల్లీ అనేది పేలు తిరగటానికి ఒక ఇరుకైన ప్రభావాన్నికల్గిస్తుంది. రాత్రి పడుకొనే ముందు పెట్రోలియం జెల్లీ రాసి రాత్రి అలా వదిలేసి, తెల్లారి ఉదయం పెట్రోలియం జెల్లీ తొలగించడానికి బేబీ ఆయిల్ ను ఉపయోగించండి. పేలను పూర్తిగా తొలగించటానికి దువ్వండి. ఇది పేలకు సమర్ధవంతమైన చికిత్సలలో ఒకటి.

ఎసెన్షియల్ ఆయిల్ చికిత్స
ఎసెన్షియల్ ఆయిల్ కి ఆలివ్ నూనె లేదా ఆల్కహాల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. రాత్రి పూట అలా వదిలేసి,మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసి దువ్వాలి. లావెండర్ నూనె, వేప నూనె, లవంగం నూనె,యూకలిప్టస్ నూనె, సొంపు నూనె, దాల్చిన చెక్క ఆకు నూనె, ఎరుపు థైమ్ నూనె, పిప్పరమింట్ నూనె మరియు జాజికాయ నూనెలను ఎసెన్షియల్ నూనెలుగా ఉపయోగించవచ్చు.

ట్రీ టీ ఆయిల్
టీ ట్రీ ఎసెన్షియల్ నూనె ఒక సహజ క్రిమి సంహారి మరియు తల పేల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి లేదా ఆలివ్ నూనె తో టీ ట్రీ ఆయిల్ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ నెత్తి మీద చర్మం అంతటా పట్టించి ఒక షవర్ క్యాప్ తో మీ తలను కవర్ చేయాలి. ఒక అరగంట తర్వాత వేడి నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి.

మయోన్నైస్
మయోన్నైస్ పేలను చంపటానికి సహాయపడుతుంది. మయోన్నైస్ ను జుట్టుకు పట్టించి ఒక షవర్ క్యాప్ తో కవర్ చేయాలి. అరగంట తర్వాత మీ జుట్టు కడగడం మరియు దువ్వెనతో దువ్వాలి.ఇది తలలో పేలు కోసం మరింత సహజ హోమ్ నివారణలలో ఒకటి.

వెన్న
తల పై చర్మం మీద వెన్న రాస్తే పేలను చంపుతుంది. రాత్రి పడుకోనే సమయంలో తలకు పట్టించి, మరుసటి రోజు ఉదయం షాంపూ తో కడగటం మరియు దువ్వెనతో దువ్వాలి. ఇది తలలో పేలు కోసం మరింత సహజ హోమ్ నివారణలలో ఒకటి.

బేకింగ్ సోడా
బేకింగ్ సోడా పేలను తొలగించటంలో సమర్థవంతముగా పనిచేస్తుంది. ఆలివ్ నూనెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెత్తిమీద చర్మంపై రాసి రాత్రిపూట వదిలి వేయాలి. ఉదయం, షాంపూ తో కడగడం మరియు దువ్వెనతో దువ్వాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు కొబ్బరి నూనె
ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు కొబ్బరి నూనె కలపాలి. రాత్రి పడుకోనే సమయంలో ఈ మిశ్రమాన్ని పట్టించి అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ తో కడగడం మరియు దువ్వెనతో దువ్వాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు బోరాక్స్
ఇది తలలో పేలు కోసం మరింత సహజ హోమ్ నివారణలలో ఒకటి. నీటితో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కలపండి. దానిలో బోరాక్స్ కలిపి హైడ్రోజన్ పెరాక్సైడ్ లో బాగా కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలపై చర్మం మీద బాగా రుద్దాలి. ఒక షవర్ క్యాప్ తో మీ తలను కవర్ చేసి కొన్ని గంటలు వదిలివేయాలి.



Click it and Unblock the Notifications