లెమన్ జ్యూస్ లో దాగున్న హెయిర్ బ్యూటీ సీక్రెట్...

నిమ్మరసంలోని అనేకమైన బ్యూటీ మరియు హెల్త్ బెనిఫిట్స్ ఇప్పటి వరకూ అనేకం తెలుసుకున్నాము. బ్యూటీ విషయంలో నిమ్మరసం కురులకు ఎక్కువ ప్రయోజనం కల్పిస్తుంది. ఎందుకంటే నిమ్మరసంలో విటిమిన్ బి, సి మరియు ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి మరియు ఇతర మినిరల్స్ క్యాల్సియం మరియు మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు డ్యామేజ్ ను అరికడుతుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు ప్రకాశవంతమైన మెరుపును అంధించడానికి అవసరం అయ్యే పోషకాలను కూడా అంధిస్తుంది.

నిమ్మరసం జుట్టు రాలడం లేదా జుట్టు సమస్యలను నివారించడం మాత్రమే కాదు, ఈ సిట్రస్ జ్యూస్ జుట్టు పెరుగుదలకు మరియు బలమైన జుట్టు సహజంగా పొందడానికి అద్భుతంగా సహాయపడుతుంది. చుండ్రును అరకట్టడంలో నిమ్మరసం కంటే మరో ఉత్తమ చిట్కాలేదు . నిమ్మరసాన్ని తలకు పట్టించేటప్పుడు దీనికి నేచురల్ పదార్థాలను జోడించి ఉపయోగించుకోవాలి. దాంతో నిమ్మరసంలోని ఎసిడి జుట్టును రఫ్ గా మార్చకుండా ఉంటుంది. రోజ్ వాటర్ మరియు పెరుగు, తేనె, లేదా ఎగ్ వైట్ వంటివి జోడించుకోవచ్చు.

నిమ్మరసంతో ఏ పదార్థాలు జోడించి తలకు పట్టించినా 15 నిముషాల కంటే ఎక్కువ సమయం ఉంచకుండా 20 నిముషాలకు తలస్నానం చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితం ఉంటుంది. మరి నిమ్మరసాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం....

1. తల మాడుకు రక్షణ కల్పిస్తుంది:

1. తల మాడుకు రక్షణ కల్పిస్తుంది:

ప్రక్రుతి పరంగా లభించిన ఈ నేచురల్ పదార్థం తల మాడు మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. కాబట్టి నిమ్మ తొక్కతో తలకు మాడుకు మర్దన చేయాలి. 5 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలలో దురద తగ్గుతుంది మరియు మంచి సువాసన వస్తుంటుంది.

2. స్ట్రెయిట్ హెయిర్ గా మార్చుతుంది:

2. స్ట్రెయిట్ హెయిర్ గా మార్చుతుంది:

కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి, మిక్స్ చేసి ఫ్రిజ్ లో పెట్టి, కొద్దిగా చిక్కబడిన తర్వాత ఈ పేస్ట్ ను తలకు పట్టించాలి. 15 నిముషాల తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్టి చిట్కాతో మీ జుట్టు అందంగా..స్ట్రాంగ్ గా మరియు సిల్కీగా కనబడుతుంది.

3. చుండ్రు నివారిస్తుంది:

3. చుండ్రు నివారిస్తుంది:

ఇది మరొక బాగా తెలిసినటువంటి హెయిర్ బెనిఫిట్. మీ జుట్టుకు నిమ్మరసాన్ని పట్టించి, బాగా మసాజ్ చేయడం వల్ల సహజంగానే చుండ్రును నివారించుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల చుండ్రు నివారించుకోవచ్చు.

4. తలలో జిడ్డును నివారిస్తుంది:

4. తలలో జిడ్డును నివారిస్తుంది:

తలలో జిడ్డును నివారించడానికి ఒక ఉత్తమ హోం రెమెడీ నిమ్మరసం. జుట్టు మరియు తలమాడు నిమ్మరసాన్ని గ్రహించడం వల్ల సెబాసియస్ గ్లాండ్స్ విడుదల చేసే రసాయనాలను అడ్డుకుని, జుట్టు జిడ్డుగా మారకుండా నివారిస్తుంది .

5. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

5. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె మరియు నిమ్మరసం కాంబినేషన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు పొడవును పెంచుతుంది . ఈ మూడింటి కాంబినేషన్ తో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మరియు జుట్టుకు నేచురల్ షైనింగ్ ను అందిస్తుంది.

6. జుట్టు చిట్లకుండా :

6. జుట్టు చిట్లకుండా :

జుట్టు సమస్యల్లో మరో వరెస్ట్ సమస్య జుట్టు చిట్లడం. ఇది ఎంత మంచి హెయిర్ ఉన్నా కూడా జుట్టు చిట్లడం వల్ల జుట్టుకున్న అందం అంతా పాడవుతుంది . కాబట్టి, నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ తో 3 వారాల పాటు చేస్తే జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

7. జుట్టుకు బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది:

7. జుట్టుకు బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది:

మీ జుట్టు అందంగా ఉంచుకోవడం కోసం జుట్టుకు హెయిర్ డై లేదా కలరింగ్ తో డబ్బు వృదా చేసుకోకుండా తలకు రసాయనిక ఉత్పత్తులు వాడక, నిమ్మరసంతో నేచురల్ బ్యూటీని పొందవచ్చు.

8. జుట్టు రాలడానికి గుడ్ బై చెప్పొచ్చు:

8. జుట్టు రాలడానికి గుడ్ బై చెప్పొచ్చు:

జుట్టు రాలే సమస్యతో బాధపడే వారికి ఇది ఒక చక్కటి పరిష్కార మారగ్ం . నిమ్మరసం, వెనిగర్ మరియు సాల్ట్ వేసి తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే జుట్టు రాలే సమస్య ఉండదు.

9. పేలను నివారిస్తుంది:

9. పేలను నివారిస్తుంది:

తలలో పేనుతో బాధపడుతున్నావారు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనె లేదా వేపనూనెను మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా మీరు పేలను నిర్మూలించడానికి నిమ్మరసంలో వెల్లుల్లిని మిక్స్ చేసి కూడా తలకు అప్లై చేయవచ్చు.

10. జుట్టుకు మంచి కండీషనర్ లా పనిచేస్తుంది:

10. జుట్టుకు మంచి కండీషనర్ లా పనిచేస్తుంది:

ఫ్రెష్ గా ఉండే నిమ్మరసంలో కొద్దిగా కొబ్బరి నీళ్ళు మిక్స్ చేసి తలకు పట్టించాలి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయడం ద్వారా ఇది జుట్టును సాఫ్ట్ గా మరియు హెల్తీగా మార్చుతుంది.

Story first published: Wednesday, October 28, 2015, 11:27 [IST]
Desktop Bottom Promotion