For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు రెడ్ వైన్ ఉపయోగించటం వలన కలిగే ప్రయోజనాలు

By Super
|

మేము వైన్ గురించి ఆలోచించినప్పుడు, అది ఆరోగ్యానికి చాలా హానికరము అని భావిస్తాం. అయితే, అది రెడ్ వైన్ విషయంలో నిజం కాదు. ఆధునిక స్థాయిలో వినియోగించినప్పుడు,రెడ్ వైన్ ఆరోగ్యం,చర్మం మరియు జుట్టుకు విస్తృతమైన పరిధిలో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే,దీనిని ఎక్కడ నుండి సేకరిస్తారు? రెడ్ వైన్ ను ఎరుపు, ముదురు ఊదా మరియు నీలం వంటి అన్ని ముదురు రకాల వర్గీకృత ద్రాక్ష ల నుంచి తయారు చేస్తారు.

ద్రాక్ష రసం మరియు దాని చర్మం కిణ్వన ప్రక్రియ సమయంలో ఈ రెడ్ వైన్ కు ఎరుపు రంగు వస్తుంది. వివిధ రకాల ద్రాక్షలను ఉపయోగించి రంగు, రుచి మరియు వయస్సును బట్టి మార్కెట్ లో అందుబాటులో అనేక రకాల రెడ్ వైన్స్ ఉన్నాయి.

ఈ రెడ్ వైన్ ప్రకాశవంతమైన జుట్టు కోసం మరియు జుట్టు సంరక్షణ కోసం ఈ రోజుల్లో సర్వసాధారణంగా వాడే ఒక సహజ వస్తువుగా ఉన్నది. జుట్టు కొరకు రెడ్ వైన్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మంచి కండీషనర్ గా పనిచేయటమే కాకుండా అనేక జుట్టు సమస్యల చికిత్సలో సహాయపడుతుంది.

రెడ్ వైన్ ను ఆధునిక పరిమాణంలో ప్రత్యక్షంగా వినియోగించటం వలన మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. అంతేకాక మీ చర్మం మరియు మీ జుట్టు మీద గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.

అయితే, మీకు తీసుకోవడం ఇష్టం లేకపోతే,మీరు ఇప్పటికీ బాహ్య అప్లికేషన్ ద్వారా దాని ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ వ్యాసంలో జుట్టు మీద రెడ్ వైన్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రకాశవంతమైన జుట్టు
ప్రతి స్త్రీ కి జుట్టు అందంగా ఉండాలనే కల ఉంటుంది. అలాగే సిల్కీ, మెరిసే మరియు పొడవాటి జుట్టు కలిగి ఉండటం ఇష్టం. జుట్టు సంరక్షణ కొరకు రెడ్ వైన్ మీకు సులభతరం చేస్తుంది. జుట్టు మాస్క్ లను ఉపయోగిస్తే దుర్భరమైన ప్రక్రియను తొలగిస్తుంది. జుట్టు మీద రెడ్ వైన్ యొక్క ఉత్తమ ప్రయోజనం పొందాలంటే, మీ రెగ్యులర్ షాంపూ మరియు కండీషనర్ తో మీ జుట్టును శుభ్రం చేసుకున్న తర్వాత, చివరగా ఎరుపు వైన్ ఉపయోగించండి.

మీరు ఎటువంటి సమయంలోనైనా మీ జుట్టు మీద మేజిక్ చూడవచ్చు. మీరు మీ మొండి జుట్టు గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సూర్యకాంతి లో UV కిరణాలు మీ జుట్టును పొడి మరియు కర్లిగా చేయవచ్చు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి రెడ్ వైన్ సహాయపడుతుంది.

జుట్టు క్షీణత
జుట్టు క్షీణతతో బాధపడుతున్న వారి కోసం, ఎరుపు వైన్ ఒక గొప్ప పరిష్కారం అని చెప్పవచ్చు. మృత కణాలను తొలగించటానికి మరియు మంట తగ్గటానికి సహాయపడే రెస్వెట్రాల్ అనే ముఖ్య పదార్దం రెడ్ వైన్ లో ఉంటుంది. తద్వారా గణనీయంగా హెయిర్ ఫాల్ తగ్గించడం మరియు జుట్టు పెరుగుదల కూడా ఉంటుంది. కెరాటిన్ వృద్ధికి రెడ్ వైన్ సహాయం మరియు కెరాటిన్ అధోకరణం వ్యతిరేకంగా మిమ్మల్ని రక్షిస్తుంది.

చుండ్రు
చుండ్రు చర్మ దురదకు దారితీసే ఒక ప్రకోపం సమస్య. ప్రతి రోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగితే తలపై చర్మం యొక్క రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా రక్తనాళాలు బలోపేతం మరియు చుండ్రు యొక్క ఉనికి తొలగించడం జరుగుతుంది. ఇది జుట్టు మీద రెడ్ వైన్ ఉత్తమ ప్రయోజనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

చుండ్రు చికిత్స కోసం, కొద్దిగా నీటిలో రెండు స్పూన్ల ఎరుపు వైన్ కలపాలి. దీనిని మీ తలపై చర్మం మీద రాయాలి. ఈ మిశ్రమం మీ కళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. ఒక టవల్ తో మీ తలను కవర్ చేసి దాదాపు ముప్పై నిమిషాల పాటు అలా వదిలేయాలి. మీరు ఒక సాధారణ షాంపూ ను ఉపయోగించి వెచ్చని నీటితో శుభ్రం చేయవచ్చు.

రెడ్ వైన్ మీ జుట్టుకు ఇబ్బందిగా ఉంటే, మీరు 30 నిమిషాలు వేచి చూడకుండా, వెంటనే మీ జుట్టును శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాకుండా రెడ్ వైన్ మరియు నీటిని సమాన పరిమాణంలో కలిపి, మీ జుట్టు మీద స్ప్రే చేయవచ్చు.

పాడైపోయిన జుట్టుకు మరమత్తు
రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన పాడైపోయిన జుట్టు మరమత్తు కోసం ఒక ఉత్తమమైన ఎంపికగా ఉంటుంది.

English summary

Benefits Of Using Red Wine For Hair

When we think of wine, we consider it as something very injurious to health. However, this is not true with Red wine. When consumed at moderate levels, red wine provides a wide range of benefits to health, skin and hair.
Story first published: Thursday, May 7, 2015, 13:02 [IST]