Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
తలలో మొటిమలు-ఇన్ఫెక్షన్ నివారించే 8 సింపుల్ హోం రెమెడీస్
అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోరాదు. తలలో కూడా వస్తుంది. తల దురదకు కేవలం పేలు, డ్యాండ్రఫ్ మాత్రమే కారణం అనుకోరాదు. అలర్జీ కూడా కారణమే. తల దురద వచ్చిందంటే ఆ బాధ చెప్పలేము. బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడితే కలిగే చికాకు ఇంతా అంతా కాదు. తలలో దురద వచ్చిందనుకోండి! ఏం చేస్తాం! గోళ్లతో గోకి తాత్కాలికంగా సాంత్వన పొందుతాం.అలా గోకడం వల్ల తల మాడు ఎర్రబడం, పుండ్లుగా తయారవడం, ఇన్ఫెక్షన్ సోకడం వంటి వాటితో మొదలై దురుదకు దారి తీస్తుంది.
తలలో మొటిమలు ఉండటం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. తలలో మొటిమల వల్ల తల దువ్వడం మరియు తలను శుభ్రం చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. తలలో మొటిమలున్నప్పుడు తలస్నానం చేయడం కూడా చలా బాధకరమైన పరిస్థితిని ఎదుర్కోవల్సి వస్తుంది.
READ MORE: తలదురదకు 10 శాశ్వత పరిష్కార మార్గాలు..!
కాబట్టి, మీ తలలో మొటిమలను ఎలా ఎదుర్కోవాలి? తలను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో తలలో మొటిమలు అదనంగా దురదకు, చిరాకు, వాపుకు మరియు నొప్పికి కారణం అవుతుంది.
మరి మొటిమలకు కారణం ఏంటి? మీ చర్మంలో రంద్రాలు ఉంటాయి. వీటిని ఆయిల్ గ్లాండ్స్ (నూనెగ్రంతులు) అనిపిలుస్తాము. వీటి ద్వారా విడులయ్యే సెబమ్ వల్ల చర్మానికి రక్షణ కల్పిస్తుంది . నేచురల్ ఆయిల్స్ లేకుండా మీ చర్మం చాలా డ్రై అవుతుంది . చర్మం మురికి మరియు డెడ్ స్కిన్ సెల్స్ తో బ్లాక్ అయినప్పుడు బ్యాక్టీరియా చేరి చర్మంను ఇన్ఫెక్షన్ కు గురిచేస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్ కు కూడా గురిచేస్తుంది.
READ MORE: ఆరోగ్యకరమైన జుట్టు కొరకు ఉత్తమ ఆహారాలు
తలలో ఇన్ఫ్లమేషన్ మరియు మొటిమలను నివారించే కొన్ని హోం రెమెడీస్ కూడా ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి...

వేపనీళ్ళుః:
వేపనీళ్ళలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలు తలలో మొటిమలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి . అందుకు నీళ్ళలో వేప ఆకులను వేసి బాగా మరిగించాలి. తర్వాత చల్లారనివ్వాలి . ఈ నీటిని ఫిల్టర్ చేసి తలకు పట్టించాలి. అలాగే షాంపు వాటర్లో కూడా వేయవచ్చు మరియు ఈ నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మెంతి ఆకులు
రెండు చెంచాల మెంతి ఆకులను పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను తలకు పట్టించి 15 నిముషాల తర్వాత, తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం:
నిమ్మరసంను ఒక బౌల్లోకి పిండుకొని, ఒక టేబుల్ స్పూన్ వాటర్ తో మిక్స్ చేయాలి. 15 నిముషాల తర్వాత తలకు పట్టించాలి . 20 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్కాల్ప్ పింపుల్స్ ను నివారిస్తుంది.

వెల్లుల్లి రెబ్బలు:
వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గిస్తుంది మరియు తలలో జిడ్డును నిర్మూలిస్తుంది . ఈ రెమెడీ వల్ల చాలా ఘాటైన వాసన వస్తుంది. కాబట్టి, ఈ వాసన నచ్చిని వారు మరో హోం రెమెడీని ఉపయోగించుకోవచ్చు!

టీట్రీ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్:
టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తలలో మొటిమలను నివారించడానికి సహాయపడుతాయి. హోం మేడ్ ట్రీట్మెంట్ లో ఆలివ్ ఆయిల్ మరియు టీట్రీ ఆయిల్ సమంగా తీసుకొని మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. మసాజ్ చేసుకొన్న 2 గంటల తర్వాత తలస్నానం చేయాలి.

నట్ మగ్ -పాలు :
నట్ మగ్(జాజికాయను)పౌడర్ చేసి అందులో కొద్దిగా పాలు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

లావెండర్ ఆయిల్ మరియు టీట్రీ ఆయిల్ :
ఒక టేబుల్ స్పూన్ ల్యావెండర్ ఆయిల్లో ఒక టీ స్పూన్ టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి..

తేనె-దాల్చిన చెక్క:
రెండు చెంచాల తేనెకు రెండు చెంచాల దాల్చిన చెక్క పొడి మిక్స్ చేయాలి . ఈ పేస్ట్ ను తలకు పట్టించాలి. తర్వాత అరగంట తర్వాత తలస్నానం చేయాలి. దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు స్టిములేటింగ్ లక్షణాలు మరియు తేనెలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు తలలోని మొటిమలు నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.



Click it and Unblock the Notifications