Latest Updates
-
నోరూరించే మామిడికాయ తాలింపు అన్నం..అదిరిపోతుంది బాసూ కేక కేక అంతే.. -
భర్త కోసం ఉద్యోగం వదలాలా? సుప్రీంకోర్టు తీర్పుతో వర్కింగ్ ఉమెన్స్‌కు ఊహించని ఊరట! -
టిఫిన్ బండి స్టైల్ అల్లం చట్నీ..ఏంట్రా ఇంత బాగుంది అని మెచ్చుకోవాల్సిందే! -
గ్రహాల కదలికలతో ఈ 4 రాశుల వారికి నేడు ఊహించని ధనయోగం..కెరీర్లో తిరుగులేని విజయాలు! -
ఫైబర్, ప్రోటీన్ పుష్కలం..కొవ్వు కరిగించి, కొండలను ఢీకొట్టే బలాన్నిచ్చే జొన్న కిచిడి..ఎలా చేసుకోవాలంటే.. -
మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
శత్రువుకి తెలియకుండా దెబ్బ కొట్టే చాణక్యుని సీక్రెట్ ఫార్ములా ఇదే! -
శని అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు ఖాయం.. మీరు చేయాల్సిన ముఖ్యమైన పూజలివే! -
2026 మే 16 శని జయంతి: ఈ రాశుల వారికి కష్టాలు తీరి, అదృష్టం తలుపు తట్టబోతోంది! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి గురుదేవుని కృపతో భారీ ధనయోగం..! - గురువారం, 14 మే 2026
జుట్టు రాలడానికి కారణం అయ్యే మీకు ఇష్టమైన ఆహారాలు..
ప్రస్తుత రోజుల్లో జుట్టు సమస్య చాలా సాధారణ సమస్యగా తీసుకుంటున్నారు. ఎందుకంటే జుట్టు రాలే సమస్య ఒక్కరిద్దరిది కాదు, ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య వేదిస్తున్నది. ముఖంగా నగ జీవితానికి అలవాటు పడి వారిలో ఇలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయి.
జుట్టు రాలే సమస్యను ఎలా గుర్తిస్తారు? ప్రతి రోజూ నార్మల్ గా 100 కేశాలు రాలిపోవడం సహజం. ఇది సాధారణ సమస్యగా చెప్పవచ్చు. రాలిపోయినా, తిరిగి కొత్త వెంట్రులకు వస్తాయి. అయితే జుట్టు రాలడం సాధారణంగా కంటే ఎక్కువగా ఉండి, కంట్రోల్ చేయడానికి కూడా వీలులేనప్పుడు దాన్ని తీవ్రస్థితిగా గుర్తించాలి.
READ MORE: జుట్టు పెరుగుదలకు 30 వండర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్
ముఖ్యంగా మన అందంలో జుట్టుకూడా ప్రధాణ పాత్రపోషిస్తుంది. మన పర్సనాలిటిని తెలుపుతుంది. జుట్టు రాలిపోవడం వల్ల మన అందం మొత్తాన్ని హరించేసి, డల్ లుక్ ను ఇస్తుంది. అంతే కాదు అలా జరిగినప్పుడు మనలో ఆత్మగౌరవం తగ్గుతుంది. అలాంటి వారు ఇతరులతో కలవడం చాలా వరకూ తగ్గించేస్తుంటారు.
READ MORE: జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి 12 సూపర్ స్నాక్
జుట్టు రాలడానికి కారణాలు, ఒత్తిడి, జుట్టుకు ఉపయోగించే కెమికల్ ప్రొడక్ట్స్, హార్మోనుల అసమతుల్యత, ప్రతి రోజూ తలస్నానం చేయడం మొదలగునవి ప్రధాణ కారణాలు కావచ్చు. ఈవే కాకుండా, జుట్టు రాలడానికి కొన్ని ఆహారాలు కూడా కారణం కావచ్చు. అలాంటి (ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్ ఫ్రీఫుడ్స్ మొ.. )ఫుడ్స్ ను మోతాదుకు మించి తీసుకోకపోవడమే మంచిది. వీటిని తగ్గిస్తే జుట్టు రాలడం కంట్రోల్ చేసుకోవచ్చు. వీటితో జుట్టు రాలడానికి కారణం అయ్యే మరికొన్ని ఆహారలు ఈ క్రింది స్లైడ్ లో...

ఫ్రైడ్ ఫుడ్స్:
ఎక్కువగా ఫ్యాట్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ఎందుకంటే వీటిలో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ హార్మోనుల అసమతుల్యతలకు కారణం అయ్యి జుట్టు రాలడానికి కారణం అవుతాయి.

కెఫిన్:
కెఫిన్ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల జుట్టు రాలడానికి కారణం అవుతుంది . కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది. జుట్టు పెరుగుదలలో నిద్రకూడా ప్రధాణ పాత్రపోషిస్తుంది. సరైన నిద్రలేకపోతే హార్మోనుల అసమతుల్యత వల్ల జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది.

షుగర్ ఫ్రీ ఫుడ్స్:
జీరో క్యాలరీ ఫుడ్స్ లేదా షుగర్ ఫ్రీ ఉన్నవాటితో ఆహారాలు తయారుచేయడం వల్ల వాటిలో ఉండే కెమికల్ కంటెంట్ ఆస్పర్టమి(ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్) జుట్టు పల్చబడటానికి మరియు జుట్టు రాలిపోవడానికి కారణం అవుతాయి.

ప్యాక్ చేసిన ఆహారాలు:
ఇవి ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిసియల్ కలర్స్ మరియు ఫ్లేవర్స్ తో నిల్వచేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. వాటిలో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి.

విటమిన్ ఎ మోతాదు ఎక్కువైతే:
విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది . విటమిన్ ఎ రోజుకి 5000 ఐయు(ఇంటర్నేషనల్ యూనిట్స్)ను మించరాదు. అలాగే శరీరంలో విటమిన్ ఎ తగ్గడం వల్ల జుట్టు తిరిగి పెరుగడం ప్రారంభం అవుతుంది.

రిఫైండ్ ఫుడ్స్:
కేక్స్, వైట్ బ్రెడ్, కుక్కీస్ మొదలగు ఫుడ్స్ తయారికి రిఫైడ్ ఫ్లోర్(పిండిని)ఉపయోగించడం వల్ల జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ఈ ఫుడ్స్ శరీరంలో షుగర్ లెవల్స్ ను పెచుతుంది. దాంతో ఒత్తిడికి గురై జుట్టు రాలడానికి ప్రధాణ కారణం అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఆహారాల్లో చాల తక్కువ న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని మరింత బలహీనంగా మార్చుతుంది.

అశుభ్రమైన ఆహారం తినడం:
ముఖ్యంగా బయట తినే ఆహారాల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల అవి టైఫాయిడ్ మరియు ఇతర ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఇలాంటి వ్యాధులు జుట్టు రాలడానికి కారణం అవుతాయి. కాబట్టి, అశుభ్రమైన స్ట్రీట్ ఫుడ్స్ తినడం నివారించాలి . వ్యాధుల మరియు జుట్టు రాలడం నుండి మీకు మీరు రక్షణ కల్పించుకోవాలి.



Click it and Unblock the Notifications