For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు సమస్య పని పట్టే హెన్నా హెయిర్ ప్యాక్స్

By Nutheti
|

హెన్నా.. ప్రతి ఒక్కరికి తెలిసిన.. న్యాచురల్ రెమిడీ. ఇది జుట్టు సమస్యలన్నింటితో.. పోరాడే సహజ పరిష్కారం. పొడి జుట్టు, చిట్లిపోయిన జుట్టు, చుండ్రు వంటి రకరకాల జుట్టు సమస్యలతో పోరాడుతుంది హెన్నా. జుట్టు ఆరోగ్యానికి, కుదుళ్ల బలానికి హెన్నా బాగా సహాయపడతుంది.

హెన్నాలో న్యాచురల్ గుణాలుంటాయి. ఇందులో ఉండే ప్రొటీన్స్ జుట్టు చిట్లిపోవడాన్ని అరికడుతుంది.. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. తరచుగా హెన్నా హెయిర్ ప్యాక్ వాడటం వల్ల జుట్టు మెరుస్తూ.. అందంగా కనిపిస్తుంది.
అలాగే జుట్టుకు సహజరంగునిస్తుంది హెన్నా. స్కాల్ఫ్ లో పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తూ.. జుట్టు రాలడాన్ని అరికట్టి, చుండ్రు, దురద వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. జుట్టు పొడిబారకుండా.. చూస్తుంది.

అయితే హెన్నాను జుట్టుకి ఉపయోగించడానికి రకరకాల మార్గాలున్నాయి. హెన్నాలో రకరకాల పదార్థాలు కలిపి పట్టించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇంతకీ హెన్నాలో ఏ పదార్థం కలిపితే.. ఎలాంటి ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుందాం..

ఎగ్, ఆలివ్ ఆయిల్, హెన్నా పౌడర్

ఎగ్, ఆలివ్ ఆయిల్, హెన్నా పౌడర్

గుడ్డులోని తెల్లసొన, ఆలివ్ ఆయిల్, హెన్నా పౌడర్ అన్నింటినీ బాగా కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుంచి అంతా పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో క్లీన్ చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

హెన్నా, పెరుగు, నిమ్మరసం

హెన్నా, పెరుగు, నిమ్మరసం

ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. ఒక నిమ్మకాయ రసం, 4 టేబుల్ స్పూన్ల హెన్నా, కొంచెం పెరుగు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ని తలకు పట్టించి.. కాసేపటి తర్వాత కడిగేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

ఆవనూనె, హెన్నా

ఆవనూనె, హెన్నా

ఆవనూనె చుండ్రు నివారించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హెన్నాతో కలిపి పెట్టుకోవడం వల్ల కండిషనర్ లా పనిచేస్తుంది. జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

మెంతులు, వెనిగర్, హెన్నా

మెంతులు, వెనిగర్, హెన్నా

రాత్రంతా మెంతులను నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తగా పేస్ట్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, 4 టేబుల్ స్పూన్ల హెన్నా, మెంతుల పేస్ట్ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.. గంట తర్వాత మైల్డ్ హెర్బల్ షాంపూతో కడిగేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు సిల్కీగా, స్ర్టాంగ్ గా మారుతుంది.

హెన్నా, గ్రీన్ టీ, నిమ్మ

హెన్నా, గ్రీన్ టీ, నిమ్మ

జుట్టుకి గ్రీన్ టీ కండిషనర్ లా పనిచేస్తుంది. గ్రీన్ టీ, హెన్నా, నిమ్మరసం కాంబినేషన్ లో జుట్టుకి ప్యాక్ వసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తగ్గిపోయి.. ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే జుట్టు స్మూత్ గా తయారై.. చిట్లిపోవడాన్ని అరికడతుంది. 4 టేబుల్ స్పూన్ల హెన్నాని గ్రీన్ టీలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం అందులోకి నిమ్మరసం కలిపి.. తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

హెన్నా, కరివేపాకు

హెన్నా, కరివేపాకు

గోరింట ఆకులు, కరివేపాకు, మందారం ఆకులు, మెంతుల మిశ్రమం కూడా జుట్టు పెరుగుదలకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వీటన్నింటిని మిశ్రమంలా తయారు చేసి.. పెరుగు కలిపి తలకు పట్టించాలి. 40 నుంచి 45 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేసుకుంటే.. జుట్టు స్ర్టాంగ్ గా పెరుగుతుంది. న్యాచురల్ లుక్ అందిస్తుంది.

English summary

Henna Hair Packs To Treat Dandruff And Hair Loss

Henna, widely known as mehindi is one of the popular and natural remedies that combats all sorts of hair problems including dry hair, breakage, dandruff and split ends.
Story first published: Wednesday, December 30, 2015, 10:27 [IST]
Desktop Bottom Promotion