For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పెరుగుదలకు కరివేపాకును ఎలా ఉపయోగించాలి?

కరివేపాకు ఆకులు చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ, జీర్ణ వ్యవస్థ కోసం,అతిసారం నిరోధించడానికి సహాయపడతాయి. వీటితోపాటు, కరివేపాకు జుట్టుకు కూడా మంచి చేస్తుంది. మీ జుట్టు ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా ఉంచటానికి

By Lekhaka
|

కరివేపాకు ఆకులను అనేక భారతీయ వంటలలో ఉపయోగిస్తారు. అయితే, వాటిని ఎక్కువగా కూరలలో ఉపయోగించుట వలన కరివేపాకు అని పేరు వచ్చింది. దీనిని "తీపి వేప ఆకులు" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే మూలికలలో ఒకటి. కరివేపాకు మీ వంటకాల్లో వాసన మరియు రుచిని కలిగిస్తుంది. అలాగే అదే సమయంలో,వాటి వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తెల్ల జుట్టు నివారించుకోవడానికి 10 నేచురల్ మార్గాలు

కరివేపాకు ఆకులు చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ, జీర్ణ వ్యవస్థ కోసం,అతిసారం నిరోధించడానికి సహాయపడతాయి. వీటితోపాటు, కరివేపాకు జుట్టుకు కూడా మంచి చేస్తుంది. మీ జుట్టు ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా ఉంచటానికి సహాయపడుతుంది. ఈ భారతీయ హెర్బ్ మీ జుట్టును నునుపుగా మరియు మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కరివేపాకు మరియు జుట్టు పెరుగుదల మధ్య ఉన్న కనెక్షన్ గురించి తెలుసుకోవటానికి దీనిని చదవండి. ప్రకాశవంతమైన చర్మం-ఆరోగ్యకరమైన జుట్టుకోసం 10 హేర్బ్స్

జుట్టు పెరుగుదలకు కరివేపాకును ఎలా ఉపయోగించాలి

దెబ్బతిన్న రూట్స్ కు మరమ్మతు

దెబ్బతిన్న రూట్స్ కు మరమ్మతు

రసాయన చికిత్సలు, తాపన పరికరాలు, కాలుష్యం మొదలైనవి జుట్టు పెరుగుదలను ఆపివేసి జుట్టు మూలాలను నాశనం చేస్తాయి. జుట్టు కోసం మంచి పోషకాలు కలిగిన కరివేపాకు దెబ్బతిన్న మూలాలను రిపేరు చేస్తుంది. కరివేపాకు పేస్ట్ ను తల మీద చర్మంపై రాస్తే మూలాలను రిపేరు చేయవచ్చు. అలాగే జుట్టు యొక్క గ్రీవము బలంను పునరుద్ధరించడానికి కూడా సహాయపడుతుంది. మీకు చేదు రుచి ఇష్టం ఉంటే ఈ కరివేపాకు ఆకులను తినవచ్చు. కరివేపాకు మీ దెబ్బతిన్న జుట్టు ప్రథమ చికిత్స కోసం బాగా పనిచేస్తుంది. మీ జుట్టు యొక్క మూలాలు బలంగా మారటం వలన, జుట్టు పెరుగుదల వేగవంతం అవుతుంది.

హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది

హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది

కరివేపాకు ఆకులలో జుట్టు నష్టం తగ్గించేందుకు మరియు జుట్టు పెరుగుదల పెంచే ప్రోటీన్ మరియు బీటా-కెరోటిన్ సమృద్దిగా ఉంటుంది. ప్రోటీన్లు లేకపోవడం అనేది జుట్టు నష్టంనకు కారణం కావచ్చు. జుట్టు పెరుగుదలకు ఈ ఆకులను తీసుకోవటం తప్పనిసరి. అంతేకాక వీటిలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. అలాగే చనిపోయిన చర్మ గ్రీవమును తొలగించడానికి మరియు చుండ్రు నిరోధించటానికి సహాయపడుతుంది.

హెయిర్ టానిక్ చేయండి

హెయిర్ టానిక్ చేయండి

ఒక గిన్నెలో తాజా కరివేపాకు మరియు కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి. కొబ్బరి నూనె జుట్టు కోసం మంచిదని తెలుసు. దానిలో కరివేపాకు కలిపితే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. పై మిశ్రమాన్ని పొయ్యి మిద పెట్టి కరివేపాకు నల్లగా మాడే వరకు మరిగించాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టి చల్లారిన తర్వాత చర్మంపై రాయాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయాలి. ఒక వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే పదిహేను రోజుల్లో మంచి పలితాన్ని చూడవచ్చు. ఈ జుట్టు టానిక్ జుట్టు పెరుగుదల ఉద్దీపన చేయటమే కాకుండా జుట్టును నల్లగా కూడా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు కరివేపాకు నూనె చాలా ఉత్తమమైన మార్గం.

హెయిర్ మాస్క్ చేయండి

హెయిర్ మాస్క్ చేయండి

కొన్ని కరివేపాకులను తీసుకోని పేస్ట్ చేయండి. ఈ కరివేపాకు పేస్ట్ ను పెరుగులో కలిపి మీ జుట్టుకు బాగా పట్టించండి. మీ జుట్టు మీద ఈ మిశ్రమంను 20 నుంచి 25 నిమిషాల పాటు ఉంచి, ఆ తరువాత ఒక తేలికపాటి షాంపూ తో శుభ్రం చేసుకోవాలి. జుట్టు పెరుగుదలలో తక్షణ పలితాలను చూడాలంటే ప్రతి వారం ఈ ప్యాక్ వేసుకోవాలి. ఈ జుట్టు ప్యాక్ జుట్టును పెంచటమే కాకుండా నునుపుగా మెరిసేలా చేస్తుంది.

కరివేపాకు టీ

కరివేపాకు టీ

ఇది కొంచెం అసహజంగా ఉండవచ్చు. కానీ మీరు మీ జుట్టు కోసం కరివేపాకు టీ ని తయారు చేయవచ్చు. నీటిలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి మరిగించి, దానికి కొంచెం నిమ్మరసం,పంచదార జోడించండి. ప్రతి రోజు ఈ టీ త్రాగితే ఒక వారంలో మంచి పలితాలను చూడవచ్చు. ఇది మీ జుట్టు పెరుగుదలను పెంచడానికి, మీ జుట్టును మృదువుగా మెరిసేలా తయారుచేయటానికి మరియు బూడిద రంగు జుట్టును నిరోధించడానికి సహాయపడుతుంది. కరివేపాకును తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ కోసం మంచిది మరియు అనేక జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది.

English summary

How To Use Curry Leaves For Hair Growth?

Curry leaves are an inevitable part of our daily cooking. We use them to add flavour and garnish our dishes. Our ancestors had long realized the immense medicinal value of curry leaves and they used it for both health and beautification purposes.
Desktop Bottom Promotion