Latest Updates
-
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి! -
చింతపండులో ఇంత మ్యాటర్ ఉందా? తింటే ఏమవుతుందో తెలుసా? -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ నల్లి గోష్ట్ బిర్యానీ.. ఈ సర్ప్రైజ్ కి ఫ్యామిలీ ఫిదా! -
రెస్టారెంట్ స్టైల్ మాకరోనీ సలాడ్.. ఇప్పుడు మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
అచ్చం బిర్యానీని మించే రుచితో.. ఘుమఘుమలాడే కరివేపాకు మసాలా రైస్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు, మరణాల కలకలం.. ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ.! -
భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచే తప్పులు ఇవే.. మనస్పర్థలు తొలగాలంటే ఇలా చేయండి.! -
కూల్ డ్రింక్ సీసాలను ఇలా ఓపెన్ చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా.. ఈ పొరపాట్లు ఇకపై వద్దు.! -
గుత్తి వంకాయతో మసాలా చేసి బోర్ కొడితే ఇలా కొత్తగా ట్రై చేయండి.. వదలకుండా తినేస్తారు.! -
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై వయసు ప్రభావం.. ఎంతవరకు వాస్తవం.?
మీజుట్టుకు మంచి షైనింగ్ ను అంధించే నేచురల్ పదార్థాలు
మీ జుట్టును నిగనిగలాడేలా మెరిపించుకోవడానికి ఈ నేచురల్ పదార్థాలను మీరెప్పుడైనా ఉపయోగించారా? ఆమ్లా లేదా ఉసిరి , ఇది జుట్టును సంరక్షించడంలో ఒక బెస్ట్ అండ్ బెటర్ ప్రొడక్ట్ . జుట్టుకు మంచి షైనింగ్ అందిస్తుంది. మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ ఉసిరికాయను పూర్వకాలం నుండి బ్యూటీ పదార్థంగా ఉపయోగిస్తున్నారు.
జుట్టుకు మెరుపు అందించడంలో ఉసిరికాయ వంటివే కొబ్బరిపాలు, ఎగ్ వైట్, వైన్ ఉల్లిపాయ జ్యూస్ మరియు మరికొన్ని ఇతర పదార్థాలు కూడా జుట్టుకు మరింత ఎక్స్ట్రా షైన్ తీసుకొస్తాయి.
READ MORE: మిమ్మల్ని తెల్లగా మార్చే 20 నేచురల్ ఫేస్ ఫ్యాక్స్
ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు చౌకైనవి మరియు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలన్నీ నిర్మూలించబడుతాయి. ముఖ్యంగా చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి, ఈ పదార్థాలను వారంలో కనీసం ఒకసారైనా అప్లై చేయడంవల్ల మీ జుట్టుకు మీరు కోరుకునే నేచురల్ షైన్ తీసుకొస్తాయి.
READ MORE: భారతీయ స్త్రీల కేశ సౌందర్యం యొక్క టాప్ 10 రహస్యాలు...
మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ క్రింది తెలిపి పదార్థాలను ఉపయోగించి మీ జుట్టును కూడా మెరిపించుకోండి...

ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి , మిక్సీ జార్లో వేసి జ్యూస్ తీయ్యాలి. తర్వాత అందులో కొద్దిగా తేనె లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి తలకు మాస్క్ లా అప్లై చేయాలి. ఈ ఆనియన్ జ్యూస్ జుట్టుకు చాలా ఉపయోగపడుతుంది. ఆనియన్ జ్యూస్ లో సల్ఫర్ ఉంటుంది . దాంతో జుట్టును మరింత ఎక్స్ ట్రాగా మెరిపిస్తుంది.

ఓట్ మీల్:
తలలో చుండ్రును నివారించడానికి మరియు జుట్టు స్ట్రాంగ్ గా ఉంచడానికి ఓట్ మీల్ గ్రేట్ గా సహాయపడుతుంది . మీ జుట్టుకు ఓట్ మీల్ ఉపయోగించడం ఒక ఉత్తమ మార్గం. ఓట్ మీల్ పౌడర్ కు నిమ్మరసం జోడించి తలకు మాస్క్ లా అప్లై చేయడం వల్ల మంచి షైనింగ్ వస్తుంది.

అలోవెర:
తలకు అలోవెర జెల్ అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం తలస్నానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీ జుట్టుకు అవసరం అయ్యే సెలీనియమ్ అలోవెర నుండి పూర్తిగా లభ్యం అవుతుంది. అంతే కాదు కేశాలకు నేచురల్ కలర్ ను అందిస్తుంది . తలకు రెగ్యులర్ గా అలోవెరాను అప్లై చేస్తుంటే తలలో చుండ్రు ఉండదు.

ఆమ్లా:
ఆమ్లా జుట్టుకు అత్యధికంగా పోషకాలను అంధించే పదార్థం. ఎందుకంటే వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మరియు ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . అదే సమయంలో మీ జుట్టుకు అవసరం అయ్యే నేచురల్ షైనింగ్ ను అందిస్తుంది . మీరు ఆమ్లా ఆయిల్ తో తలకు మసాజ్ చేయడం లేదా నేచురల్ జ్యూస్ ను హెయిర్ ప్యాక్ గా వేసుకోవడం చేయవచ్చు.

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో అత్యధికంగా ఫాలీ ఫినాయిల్స్ ఉంటాయి . మరియు వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికమే. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇవే లక్షణాలు జుట్టుకు నేచురల్ షైన్ కూడా తీసుకొస్తాయి . అయితే ఈపద్దతిలో కొద్దిగా ఆలస్యం అవుతుంది.

హెన్నా:
జుట్టును నిగనిగా మెరుపించుకోవడానికి ఒక ఫర్ఫెక్ట్ ఇండియన్ ఇనిగ్రెంట్ హెన్నా . అందుకు మీరు చేయాల్సిందల్లా, ఒక కప్పు హెన్నా పౌడర్ లో రెండు చెంచాల పెరుగు మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సమిస్తుంది. జుట్టుకు నేచురల్ షైన్ అందిస్తుంది.

పొటాటో జ్యూస్:
బంగాళదుంప రసంలో విటమిన్ బి పుష్కలంగా ఉంది. ఇది జుట్టును పొడవుగా మరియు స్ట్రాంగ్ పెరిగేలా చేస్తుంది. వీటితో పాటు మీ జుట్టును నిగనిగ మెరిపిస్తుంది. కాబట్టి, పొటాటో జ్యూస్ ను తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా మూడు వారాలపాటు వారానికొకసారి చేస్తుం మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications