For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడం మరియు ఇతర సమస్యలను నివారించే సహజ షాంపులు

|

ప్రస్తుత రోజుల్లో ఎవ్వరూ చూడా హెయిర్ ఫాలింగ్ సమస్యతో బాధపడుతున్నారు . ఈ హెయిర్ ఫాల్ కు కారణాలు అనేకం ఉన్నాయి. అది డైట్ పరంగా కావచ్చు, రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో ఉప్పులేదా పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు అధికంగా రాలిపోతుంటుంది మరియు కెమికల్స్ అధికంగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ షాంపు, నూనె, మరియు ఇతర ప్రొడక్ట్స్ మరియు హార్డ్ వాటర్ వల్ల కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

కాబట్టి, కారణం ఏదైనా, జుట్టు రాలడాన్ని అరకట్టాలంటే, కొన్ని సులభ చిట్కాలతో హోం మేడ్ షాంపులను ప్రయత్నించాలి . ఈ హోం మేడ్ షాంపులు హెయిర్ ఫాల్ ను తగ్గించడం మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా మంచివే..

ఉదాహరణకు, అలోవెరా షాంపు జుట్టుకు నేచురల్ షైనింగ్ అందివ్వడంతో పాటు, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శీకాకయ డ్రై హెయిర్ మరియు చుండ్రును నివారిస్తుంది . అలాగే జుట్టు రాలడం అరికట్టడానికి సోప్ నట్స్ ను కూడా అధికంగా ఉపయోగిస్తున్నారు.

జుట్టు రాలడం నివారించే హోం మేడ్ షాంపులు...

శీకాయ:

శీకాయ:

శీకాయ్ ఒక హోం మేడ్ నేచురల్ షాంపు . దీన్ని జుట్టుకు ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. దీన్ని పౌడర్ గా చేసి తలకు మరియు కేశాలకు పట్టించి తలస్నానం చేయాలి.

కుంకుడు కాయలు:

కుంకుడు కాయలు:

కుంకుడుకాలయు లేదా రీటా మరో హోం మేడ్ నేచురల్ షాంపు. జుట్టు రాలే సమస్యలను అరకట్టడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . దీన్ని పౌడర్ గా చేయడం లేదా కుంకుడు కాయ నట్స్ ను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తలకు పట్టించి స్నానం చేసుకోవాలి . వీటిని వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి.

అలోవెర జెల్:

అలోవెర జెల్:

అలోవెర కట్ చేసి తాజా జెల్ ను తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇది హెయిర్ రూట్స్ నుండి సమస్యలను క్లియర్ చేసుకొస్తుంది . అలోవెర జెల్ తలకు పట్టించిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ హోం రెమెడీ వల్ల జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.

ఉసిరికాయ:

ఉసిరికాయ:

ఉసిరికాయను పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి తర్వాత జుట్టుకు పట్టించాలి . వీటిలో ఉండే ప్రోటీన్ కంటెంట్, విటమిన్ సి మరియు న్యూట్రీషియన్స్ జుట్టు రాలడం తగ్గిస్తాయి . మరో ప్రయోజనం జుట్టుకు మంచి షైనింగ్ తో పాటు మంచి వాసన కలిగి ఉంటుంది.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

మూడు చెంచాల బేకింగ్ సోడా తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు సోసి, బాగా మిక్స్ చేయాలి. ఈ నీటిని బాగా మిక్స్ చేసిన తర్వాత తలకు పట్టించాలి. ఈ బేకింగ్ వాటర్ జుట్టు రాలడం తగ్గిస్తుంది . కొన్ని వారాల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

శెనగపిండి:

శెనగపిండి:

శెనగపిండికి కొద్దిగా పాలు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు మరియు కేశాలకు పట్టించి బాగా డ్రై అయ్యే వరకూ ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ నేచురల్ హోం మేడ్ షాంపుతో హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు.

English summary

RECIPES: Natural Shampoos To Fight Hair Loss

These days there are a lot of reasons why as to why our hair falls. It could be the diet we follow which has too much of salt or it could also be due to the use of hard water and different chemicals we use in our hair like shampoos, oils and other products.
Story first published: Saturday, October 17, 2015, 14:21 [IST]
Desktop Bottom Promotion