Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చుండ్రు నివారించి, జుట్టును సాఫ్ట్ అండ్ షైనీగా మార్చే హోం రెమెడీస్
జుట్టు పొడవుగా ఒత్తుగా ఉన్నా..మంచి రంగు, సాప్ట్ నెస్ లేకపోతే చూడటానికి అందంగా కనిపించదు . జుట్టుకు నేచురల్ షైన్ అందివ్వడానికి హోం రెమెడీస్ అధికంగా ఉన్నాయి . జుట్టు షైనింగ్ కోసం కెమికల్స్ తో తయారుచేసిన కలర్స్ ప్రత్యామ్నాయంగా హెన్నా తలకు పట్టించి జుట్టును సాప్ట్ గా మార్చుకోవచ్చు. ఫ్రూట్స్ హెయిర్ ప్యాక్స్, నేచురల్ లేదా హోం మేడ్ షాంపులు మరియు కండీషనర్స్, ఆల్కహాలిక్ బెవరేజెస్ వంటి డైరీ ప్రొడక్ట్స్ డ్రైహెయిర్ ను స్మూత్ గా మార్చడానికి చాల గ్రేట్ గా సహాయపడుతాయి.
READ MORE: బీర్ లో దాగున్నాయి జుట్టు పెరుగుదల రహస్యాలు..!
ఇంకా ఈ హోం రెమెడీస్ సురక్షితమైనవి, అయితే..వీటిని ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. జుట్టును సాఫ్ట్ గా మార్చే కొన్నినేచురల్ పదార్థాల యొక్క లిస్ట్ ను ఈ క్రింది ఇవ్వడం జరిగింది, వీటిని హెయిర్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల 24 గంటల్లోనే మంచి మార్పుటు ఉంటుంది. ఒక వేళ ఈ పదార్థాల వల్ల తలలో దురద వంటి లక్షణాలు కనబడితే వీటిని నివారించండి ...
మరి డ్రై హెయిర్ ను హెల్తీగా మరియు షైనీగా మార్చడానికి సహాయపడే పదార్థాలేంటో చూద్దాం...

డ్రై హెయిర్ ను నివారించే హేర్బల్ టీస్:
డ్రై హెయిర్ నివారించుకోవడం కోసం హేర్బల్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. హేర్బల్ టీలో ఉండే ఔషధగుణాలు డల్ గా నిర్జీవంగా ఉన్న జుట్టును బలోపేతం చేస్తుంది . మరియు జుట్టుకు నేచురల్ కలర్ ను అందిస్తుంది. తలస్నానం చేసిన తర్వాత గ్రీన్ టీ వాటర్ తో తలస్నానం చేసుకోవాలి. అదే విధంగా చమోమెలీ టీ జుట్టు పెరుగుదలను మరియు నేచురల్ షైన్ ను అందిస్తుంది.

డైరీ ప్రొడక్ట్స్:
డైరీప్రొడక్ట్స్ లో పాలు, పెరుగు, గుడ్లు, ఎగ్ వైట్ వంటివి తలకు పట్టించడం వల్ల డ్రై హెయిర్ స్మూత్ గా తయారవుతుంది. వీటిని తలకు పట్టించిన తర్వాత వేడినీటిలో ముంచిన టవల్ తో తలకు చుట్టాలి . అరగంట తర్వాత, గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఈ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఇవి జుట్టు మొదళ్ళ నుండి స్ట్రాంగ్ గా మార్చుతుంది.

ఎసెన్షియల్ ఆయిల్ :
తలకు కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదా ల్యావెండర్ ఆయిల్ ను అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుతుంది మరియు ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ ను నివారిస్తుంది.

డ్రై హెయిర్ కు ఫ్రూట్ జ్యూస్ లు :
తలకు ఫ్రూట్ జ్యూస్ లతో మాస్క్. ఒక చెంచా ఫ్రెష్ ఆపిల్ జ్యూస్ అందులో ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్నితలకు పట్టించాలి. 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

గ్రీన్ వెజిటేబుల్ ప్యాక్:
వందగ్రాముల ఆకుకూరలను గ్రైండ్ చేసి అందులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, తేనె మిక్స్ చేసి తలకు మొదళ్ళ నుండి పట్టించాలి . ఈ వెజిటేబుల్ హెయిర్ ప్యాక్ తలకు కావల్సిన న్యూట్రీషియన్స్ అందిస్తుంది, డ్రై హెయిర్ ను సిల్కీగా మరియు స్మూత్ గా మార్చుతుంది.

సోర్ బెవరేజెస్:
యాపిల్ సైడర్ వెనిగర్ నేచురల్ క్లెన్సర్. ఇది జుట్టును క్లీన్ అండ్ షైనీగా ఉంచుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో లో వేసి తలస్నానం చేసిన తర్వాత తలారా పోసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే డ్రై హెయిర్ నివారించబడుతుంది.

డ్రైహెయిర్ కు బీర్:
బీర్ ను తలకు ఉపయోగించడం వల్ల చుండ్రును నివారించడం మాత్రమే కాదు, ఇది డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ ను కూడా నివారిస్తుంది. నెలలో రెండు సార్లు బీర్ తో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

హోం మేడ్ షాంపు:
హోం మేడ్ షాంపులలో సోప్ నట్స్, శీకాకయ్ వంటివి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. సోప్ నట్స్ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ వంటివి. ఈ సోప్ నట్స్ పేస్ట్ ను వారంలో రెండు సార్లు తలకు పట్టించి తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ వంటింటి చిట్కాల వల్ల తలదురద తగ్గుతుంది.



Click it and Unblock the Notifications