For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ డై వల్ల స్కాల్ఫ్ అలర్జీలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్...

|

హెయిర్ కలరింగ్ కోసం హెయిర్ డై వాడుతున్నారా..? ఐతే జాగ్రత్త హెయిర్ డై రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల అలర్జీలకు గురికావల్సి వస్తుంది? అలర్జీ అయితే తగ్గించుకోవచ్చు. కానీ అదే తలనొప్పికి దారితీస్తే పరిస్థితి ఏంటి? మీ జుట్టును స్టైలిష్ గా మరింత బ్యూటిఫుల్ గా కనడుట కోసం వివిధ రకాల హెయిర్ డైలను వేసుకుంటుంటారు. అయితే శి ఒక్కసారి తలలో అలర్జీకి గురిచేస్తుంది. అలర్జీ వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది.

ప్రస్తుత ట్రెండ్ హెయిర్ స్టైలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు . స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా వివిధ రకాల కారణాల వల్ల హెయిర్ డైలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. హెయిర్ డైస్ లో అమ్మోనియా, ప్రోప్లియన్, గ్లైకోల్ మరియు పిపిడి వంటి కెమికల్స్ ఉండటం వల్ల అలర్జీలకు కారణముతుంది . ఈ అలర్జీ రియాక్షన్ వల్ల తలలో దురద, బర్నింగ్ వంటి లక్షణాలు కనబడుతాయి. చెవులు, చేతులు, ముఖం మరియు తలలో కూడా రాషెస్ ఏర్పడుతాయి . కొన్ని పరిస్థితుల్లో హెయిర్ డై వాడే వారిలో శ్వాససంబంధిత సమస్యలు కూడా వస్తాయి . అందుకు వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం . హెయిర్ డై వేసుకొన్న ఒకటి రెండు రోజులకల్లా అలర్జిక్ రియాక్షన్ కనబడుతుంది.

బాధపడకండి హెయిర్ డైల వల్ల వచ్చే అలర్జీలను కొన్ని హోం రెమెడీస్ తో చాలా ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ అలర్జీలను నివారించడం మాత్రమే కాదు, జుట్టును స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా మార్చుతాయి. హెయిర్ డై వల్ల వచ్చే అలర్జీలను నివారించుకోవడానికి సహాయపడే హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం..

1. నిమ్మరసం:

1. నిమ్మరసం:

నిమ్మరసంలో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. హెయిర్ కలరింగ్ వల్ల వచ్చే అలర్జీలక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసంను నీటితో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది తలలో అలర్జీలను, దురదను నివారించడంలో ఎపెక్టివ్ గా పనిచేస్తుంది.

2. జోజోబా ఆయిల్ :

2. జోజోబా ఆయిల్ :

వండర్ ఫుల్ ట్రీట్మెంట్ జోజబా ఆయిల్. ఈ నూనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది తలలో ఎర్రని మచ్చలు, దురద, ఇన్ఫ్లమేషన్ తగ్గిండచంలో గ్రేట్ గా సహాయపడుతుంది . రాత్రి నిద్రించడానికి ముందు కొద్దిగా జోజోబా ఆయిల్ ను తలకు మసాజ్ చేయడం వల్ల తలలో ఇన్ఫెక్షన్స్, ఇతర జుట్టు సమస్యలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

3. బేకింగ్ సోడ:

3. బేకింగ్ సోడ:

బేకింగ్ సోడా వాటర్ కూడా స్కాల్ఫ్ అలర్జీలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించి 15 నిముషా తర్వాత తలస్నానం చేయాలి.

4. చమోమెటీ టీ:

4. చమోమెటీ టీ:

చమొమోలి టీలో కొన్ని ఐస్ ముక్కలు వేసి ఈ నీటితో తలకు స్నానం చేయాలి. లేదా తలకు పట్టించి 10 నిముషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల తలలో ఇన్ఫ్లమేషన్ మరియు దురద వంటి సమస్యలు నివారించబడుతాయి. ముఖ్యంగా హెయిర్ డై వల్ల వచ్చే అలర్జీలను నివారించడంలో చమొమోలి టీ గ్రేట్ గా సహాయపడుతుంది.

5. టీ ట్రీ ఆయిల్:

5. టీ ట్రీ ఆయిల్:

టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పనుష్కలంగా ఉన్నాయి . ఇవి అలర్జీలను గ్రేట్ గా నివారిస్తుంది. హెయిర్ డై వల్ల వచ్చే అలర్జీలను , స్కిన్ రాషెస్, దద్దుర్లు, దురద మరియు ఇన్ఫ్లమేషన్ వంటి లక్షణాలను నివారించడంలో టీట్రీఆయిల్ ఉత్తమం.

6. అలోవెర:

6. అలోవెర:

అలోవెర జెల్ అలర్జిక్ లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా హెయిర్ డై వల్ల వచ్చే అలర్జీలను నివారిస్తుంది తలలో దురద , హెయిర్ డ్రైగా మారడం వంటి లక్షణాలను నివారిస్తుంది . తలకు అలోవెర జెల్ ను అప్లై చేసి 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

7. కొబ్బరి నూనె:

7. కొబ్బరి నూనె:

అలర్జీలను నివారించడంలో కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జుట్టును మాయిశ్చరైజింగ్ లో ఉంచుతుంది. జుట్టు డ్రైనెస్ మరియు దురదను నివారించడంలో ఇది గ్రేట్ హెయిర్ ఆయిల్. తలస్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనె అప్లై చేసి తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

8. విట్చ్ హాజెల్ :

8. విట్చ్ హాజెల్ :

విట్చ్ హాజల్లో గ్రేట్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ హెర్బ్ నేచురల్ ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది హెయిర్ డై వల్ల వచ్చే అలర్జిక్ రియాక్షన్ నివారిస్తుంది. ఈ హెర్బ లో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలర్జిక్ రియాక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

9. ఆపిల్ సైడర్ వెనిగర్ :

9. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా హెయిర్ కలరింగ్ వల్ల వచ్చే అలర్జీలను నివారిస్తాయి. ఇది జుట్టు డ్రైగా మారకుండా, దురద కలగకుండా నివారిస్తుంది.

10. నువ్వుల నూనె:

10. నువ్వుల నూనె:

హెయిర్ డై వల్ల తలలో దురద మరియు ఇన్ఫ్లమేసన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. తలలో దురద మరియు అసౌకర్యం నివారించడంలో నువ్వుల నూనె గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ నూనెను తలకు పట్టించడానికి ముందు గోరువెచ్చగా వేడి చేసి తర్వాత తలకు పట్టించాలి . తర్వాత షాంపు చేయడం వల్ల హెయిర్ డై వల్ల వచ్చే అలర్జీలక్షనాలన్నింటిని నివారిస్తుంది.

English summary

10 Effective Home Remedies To Treat Hair Dye Allergies

The use of hair dye is a trend these days among both men and women for various reasons.Hair dye contains chemicals such as ammonia, propylene, glycol and PPD, that can cause allergy. This allergic reaction may manifest as itching or burning of the scalp. Some rashes are visible on the ears, hands, face and even on the scalp. In severe cases, patients could also experience breathing difficulties, in which case, immediate medical attention is required. The allergic reaction may show up immediately or even after one or two days of application of the hair color.
Story first published:Monday, June 6, 2016, 16:52 [IST]
Desktop Bottom Promotion