Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఒక్క తెల్లవెంట్రుక పీకేస్తే.. చాలా తెల్ల వెంట్రుకలు వస్తాయా ?
హెల్తీ, షైనీ హెయిర్ పొందడానికి చాలా కష్టపడతాం. మన జుట్టుని రాలిపోకుండా, డ్యామేజ్ అవకుండా కాపాడుకోవడానికి చాలా కష్టపడతాం. ఈ సమయంలో.. చాలా విషయాలను నమ్ముతాము. కానీ.. అవన్నీ అపోహలు మాత్రమే. మన అమ్మలు, అమ్మమ్మలు చెప్పిన కొన్నివిషయాలను బలంగా నమ్ముతూ వస్తున్నాం.
కానీ.. మనం జుట్టు సంరక్షణ కోసం పాటిస్తున్న చాలా విషయాలు అపోహలు మాత్రమే. వాటికి ఎలాంటి కారణం లేకపోయినా, వాటిని పాటిస్తూ వస్తున్నాం. కాబట్టి.. మనం నమ్ముతున్న, ఇప్పటికిప్పుడే.. నమ్మడం మానేయాల్సిన జుట్టుపై ఉన్న అపోహలేంటో చూద్దాం..

ఒక తెల్ల వెంట్రుక పీకేస్తే.. చాలా వస్తాయనే నమ్మకం
ఒక్క తెల్ల వెంట్రుక కనిపించగానే.. దాన్ని పీకేస్తాం. కానీ ఇలా పీకేస్తే.. మరిన్ని ఎక్కువ తెల్లవెంట్రుకలు వస్తాయని మన అమ్మలు, అమ్మమ్మల ద్వారా పాపులర్ అయింది. ఒక తెల్లవెంట్రుక పీకిన తర్వాత.. చాలా గుర్తించడం వల్ల ఇది పాపులర్ అయింది. కానీ తెల్ల వెంట్రుకలన్నీ పీకేయాలని కాదు అర్థం. అలా తరచుగా జుట్టుని గట్టిగా లాగి పీకేయడం వల్ల.. అది బలహీనంగా మారుతుంది. దీనివల్ల జుట్టు పెరగడం ఆగిపోతుంది. అందుకే.. అలా పీకకూడదని చెబుతారు.

ఎక్కువ సమయం ఆయిల్ పెట్టుకుంటే.. స్కాల్ప్ కి మంచిది
చాలామంది జుట్టుకి ఆయిల్ పెట్టుకుని ఒక రోజు లేదా రెండ్రోజుల అలానే వదిలేస్తారు. జుట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యకమైన ప్రయోజనాలేమీ ఉండవు. ఆయిల్ జుట్టుకి కండిషనర్ లా పనిచేసి, స్కాల్ప్ కి మాయిశ్చరైజర్ అందిస్తుంది. కాబట్టి స్నానానికి 20నిమిషాల ముందు ఆయిల్ పెట్టుకున్నా సరిపోతుంది. కావాలంటే.. గంట లేదా రాత్రంతా పెట్టుకున్నా సరిపోతుంది.

పై నుంచి కిందికి దువ్వడం
జుట్టుని పై నుంచి కిందకు దువ్వడం మంచిదని చాలామంది నమ్ముతారు. కానీ అది తప్పు. పై నుంచి కిందికి దువ్వడం వల్ల జుట్టు డ్యామేజ్ కి కారణమవుతుంది. కాబట్టి జుట్టుని కొంచెం భాగాలుగా విడదీసి.. మధ్యలో మొదలుపెట్టి, చివరికి దువ్వుకోవాలి.

స్పిల్ట్ ఎండ్స్ కి ప్రొడక్ట్స్
హెయిర్ ప్రొడక్ట్స్ స్పిల్ట్ ఎండ్స్ రిపేర్ చేస్తాయని ప్రకటిస్తుంటారు. దాన్ని నమ్మకండి. ఎందుకంటే.. చిట్లిపోయిన జుట్టు ప్రాణం కోల్పోయి ఉంటుంది. కాబట్టి.. వాటిని మళ్లీ అతికించడం అసాధ్యం. కాబట్టి వాటికి ఎలాంటి ప్రొడక్ట్స్ పనిచేయవు. జుట్టుపై సరైన కేర్, ట్రిమ్మింగ్, కండిషర్ వల్ల.. చిట్లిపోకుండా అరికట్టవచ్చు.

డ్రై స్కాల్ప్ వల్ల డాండ్రఫ్
డ్రై స్కాల్స్ వల్ల చుండ్రు ఏర్పడుతుందని చాలామంది నమ్ముతారు. కానీ ఆయిలీ స్కాల్ప్ వల్ల డాండ్రఫ్ ఏర్పడుతుంది.

ఎక్కువగా దువ్వుకుంటే.. హెల్తీ హెయిర్ పొందవచ్చు
జుట్టుని దువ్వడం, బ్రష్ చేయడం వల్ల హెల్తీగా ఉంటుంది. కానీ.. మోతాదు మించిదే హానికరమే. కాబట్టి రోజుకి 100 స్ట్రోక్స్ కంటే ఎక్కువసార్లు దువ్వడం వల్ల అది మంచి కంటే.. హానే ఎక్కువ చేస్తుంది. అలాగే ఎక్కువగా దువ్వడం వల్ల.. ప్రొటెక్టివ్ లేయర్ డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల ఎక్కువ చిక్కుపడిపోయి, డ్రైగా మారుతుంది.

హెయిర్ జిడ్డుగా ఉంటే ఆయిల్ పెట్టకూడదు
ఇది అపోహ మాత్రమే. జుట్టుకి డీప్ కండిషనింగ్, హైడ్రేటింగ్ చాలా అవసరం. మీ జుట్టు ఏ తత్వం కలిగినది అయినా.. ఆయిల్ పెట్టడం మంచిది. అవసరమైతే.. స్కాల్ప్ కి ఆయిల్ పెట్టకుండా జుట్టుకి మాత్రమే పెట్టవచ్చు.

తరచుగా కట్ చేయడం వల్ల వేగంగా పెరుగుతుంది
ప్రతి 6 నుంచి 8 వారాలకు ఒకసారి.. జుట్టుని కట్ చేయడం వల్ల.. వేగంగా పెరుగుతుందని భావిస్తారు. కానీ.. జుట్టు పలుచబడిపోయి, చిట్లిపోవడానికి కారణమవుతుంది. జుట్టుని అప్పుడప్పుడు కట్ చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ పోయి.. అది హెల్తీగా ఉంటుంది. కానీ.. వేగంగా పెరగడానికి సహాయపడదు.

తరచుగా షాంపూ చేస్తే జుట్టు రాలుతుంది
తరచుగా షాంపూ చేయడం వల్ల జుట్టు రాలడానికి కారణమవుతుందని చాలా మంది నమ్ముతారు. తలస్నానం చేసినప్పుడు ఎక్కువ జుట్టు రాలిపోవడం గమనించి.. దీనికి కారణం షాంపూ అని భావిస్తారు. కానీ.. మైల్డ్ షాంపూ ఉపయోగిస్తూ.. నెమ్మదిగా షాంపూ చేసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదు. ప్రతి రోజూ షాంపూ చేసినా.. ఏం కాదు.

ఎక్కువ నురుగు వస్తే.. జుట్టు శుభ్రమైనట్టు
నురుగుతో శుభ్రతను పోల్చుతూ ఉంటాం. షాంపూలు ఖచ్చితంగా నురుగు తీసుకొస్తే.. జుట్టు శుభ్రమైనట్టు కాదు. షాంపూలో ఉండే సల్ఫేట్ నురుగుకి కారణమవుతాయి. ఇది హానికరమైనది. కాబట్టి సల్ఫేట్ లేని షాంపూలు ఉపయోగించడం మంచిది. మంచి ఫలితాలు కూడా పొందవచ్చు.



Click it and Unblock the Notifications











