For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పెరుగుదలకు ఆల్మండ్ ఆయిల్ రెమెడీస్..!

By Super Admin
|

ఈ మద్య కాలంలో సెడన్ గా జుట్టు రాలడం ప్రారంభమైంది? దువ్వెనకు ఊడిన జుట్టు చూసి ఆందోళన చెందుతున్నారా? జుట్టు రాలడంతో క్రమంగా జుట్టు పల్చబడుతోంది? అయితే, అందుకు ఒక పరిష్కారం ఉంది. అదే ఆల్మండ్ హెయిర్ మాస్. పూర్వకాలంలో బాదం నూనెను ఎక్కువగా ఉపయోగించేవారు. . జుట్టు సంరక్షణలో బాదం గింజల నుండి తీసిన నూనెను ఎక్కువగా ఉపయోగించేవారు!

ఈ బాదం గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ జుట్టును ఆరోగ్యంగా కాపాడుట కొరకు ఉపయోగపడుతాయి.ఆల్మండ్ ఆయిల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ తలకు కావల్సిన పోషణను అందిస్తుంది. హెయిర్ క్యూటికల్స్ ను క్లోజ్ చేస్తుంది. అలాగే కొత్తగా హెయిర్ ఫాలీసెల్స్ ఏర్పాటుకు సహాయపడుతుంది.

బాదం నూనెలో ఉండే ఫైటో స్టెరాల్స్ పొడి జుట్టుకు తగిన పోషణను అందిస్తుంది. తలలో పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. చుండ్రును నివారిస్తుంది. విటమిన్ ఇ, జుట్టుకు కండీషనర్ గా పని చేస్తుంది. విటమిన్ బి ఫ్రీరాడికల్స్ వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా పోరాడి రక్షణ కల్పిస్తుంది.

ముఖ్యంగా, ఇతర నూనెతో పోల్చితే బాదం ఆయిల్లో న్యూట్రీషియన్స్ అత్యధికంగా ఉన్నాయి. అందుకే ఈ నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా మరియు స్ట్రాంగ్ గా పెరుగుతాయి. బాదం నూనెను జుట్టుకు అప్లై చేయడానికి ముందు, మీ జుట్టు రాలడానికి గల అసలు కారణాన్ని కనుక్కోవాలి. కారణం తెలుసుకోవడం వల్ల జుట్టు సంరక్షణలో రెగ్యులర్ గా తీసుకోవల్సిన జాగ్రత్తలను పాటించడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.

బాదం ఆయిల్ ను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టుకు మంచి షైనీంగ్ తో పాటు, ఒత్తుగా సాఫ్ట్ గా కనబడుతుంది.

హెయిర్ షైనింగ్ సెరమ్:

హెయిర్ షైనింగ్ సెరమ్:

చిట్లిన జుట్టును నివారించి, జుట్టుకు మంచి షైనింగ్ అందిస్తుంది. జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది. అందుకు చేయాల్సిందల్లా, కొన్ని చుక్కల బాదం ఆయిల్ తీసుకుని, తలకు, జుట్టు పొడవును అప్లై చేసి, మర్ధన చేయాలి. తర్వాత తలదువ్వాలి.

జుట్టు పెరగడానికి నూనె:

జుట్టు పెరగడానికి నూనె:

బాదం నూనెలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్స్, జుట్టు కణాలకు బలాన్నిస్తుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బాదం ఆయిల్, ఆముదం నూనెను రెండూ సమంగా తీసుకుని వేడి చేయాలి. ఈ నూనెను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.

తలకు పోషణ:

తలకు పోషణ:

ఈ బాదం ఆయిల్ హెయిర్ మాస్క్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది మూసుకున్న చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి తలకు మంచి పోషణను అందిస్తుంది, హెయిర్ ఎలాసిటి పెంచుతుంది . హెయిర్ బ్రేకేజ్ నివారిస్తుంది.

ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ వైట్ వేసి, ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ మిక్స్ చేసి రెండూ బాగా కలగలిసే వరకూ బీట్ చేయాలి. తర్వాత జుట్టును తడి చేసి, ఈ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయాలి. జుట్టు పొడవునా కూడా అప్లై చేయొచ్చు. తర్వాత షవర్ క్యాప్ పెట్టి, 1 గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

జుట్టు చిట్లకుండా చేస్తుంది:

జుట్టు చిట్లకుండా చేస్తుంది:

బాదం నూనె హెయిర్ ఫాలీ సెల్స్ కు వాటర్ లా పనిచేస్తుంది, క్యూటికల్స్ ను సీల్ చేస్తుంది. జుట్టు చివర్లు చిట్లకుండా నివారిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ హెన్నాకు, ఒక టీస్పూన్ బాదం ఆయిల్ మిక్స్ చేసి, పేస్ట్ చేసి, రాత్రంతా అలాగే ఉంచాలి. తర్వాత రోజు ఉదయం జుట్టును తడి చేసి, ఈ మాస్క్ ను వేసుకోవాలి. తర్వాత షవర్ క్యాప్ పెట్టుకుని, అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది:

హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది:

బాదం ఆయిల్ ను చాల తేలికగా ఉంటుంది. ఇది తలలోకి చాలా త్వరగా ఇంకుతుంది.

ఇంకా జుట్టుకు పోషణను అందిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం మాత్రమే కాదు, జుట్టు వాల్యూమ్ పెంచుతుంది. జుట్టుకు మంచి షైనింగ్ అందుతుంది.

2 టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్లో కొద్దిగా ల్యావెండర్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్ మిక్స్ చేయాలి. తర్వాత వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు పెట్టి మసాజ్ చేయాలి. రాత్రుల్లో పెట్టుకుని ఉదయం శుభ్రం చేసుకోవాలి.

జుట్టుకు బలాన్నిస్తుంది:

జుట్టుకు బలాన్నిస్తుంది:

జుట్టు రాలడానికి కారణం జింక్ లోపించడం వల్లే,కాబట్టి ఈ బాదం ఆయిల్లో జింక్,పొటాషియం,మరియు క్యాల్షియంలు అధికంగా ఉన్నాయి.ఈ నూనెను అప్లై చేయడం వల్ల సగానికి సగం జుట్టు రాలడం నివారించబడుతుంది.

బాదం ఆయిల్ ను తీసుకుని, అందులో రోజ్మెర్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. కొన్ని చుక్కుల జోజోబ ఆయిల్ మిక్స్ చేసి, తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడంను తగ్గిస్తుంది. ఈనూనెను జుట్టుకు అప్లైచేసిన తర్వాత షాంపుతో తలస్నానంచేసుకోవాలి.

జుట్టును డార్క్ గా మార్చుతుంది:

జుట్టును డార్క్ గా మార్చుతుంది:

బాదం నూనెలో యాంటీయాక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి.ఈ మాస్క్ లో జుట్టులో నేచురల్ పిగ్మెంటేషన్ అందిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మస్టర్డ్ పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ డ్రైడ్ కరివేపాకు పొడి, ఒక టీస్పూన్ హెన్న పౌడర్, 10 చుక్కల బాదం నూనెను, 10 చుక్కల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, పేస్ట్ చేసి, తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

డిటాక్సిఫైయింగ్ మాస్క్:

డిటాక్సిఫైయింగ్ మాస్క్:

ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ , గ్లైకోసైడ్ , యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ హెయిర్ ఆయిల్ జుట్టు పల్చగా మార్చడాన్ని నివారిస్తుంది. డెడ్ స్కిన్ లేయర్స్ ను నివారిస్తుంది. ఈ మాస్క్ చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. పోషణ అందిస్తుంది. డిటాక్సిఫై చేస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్లో, ఒక టేబుల్ స్పూన్ బర్డక్ రూట్ ఆయిల్ , విటమిన్ ఇ జెల్ క్యాప్యూల్ వేసి మొత్తం పదార్థాలు మిక్స్ చేయాలి. ఈ నూనెను తలకు అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. ఉదయం తలస్నానం చేయాలి.

హెయిర్ స్ప్రే:

హెయిర్ స్ప్రే:

ఈ హెయిర్ స్ప్రేలో కెమికల్స్ ఉండవు. జుట్టును స్మూత్ గా మార్చుతుంది. పొడి జుట్టు నివారిస్తుంది.

ఒక కప్పు డిస్టిల్డ్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ మిక్స్ చేసి, స్ప్రే బాటిల్లో వేసి, షేక్ చేసి, తలమొత్తం స్పే చేయాలి. ఇది తలలో ఎక్సెస్ టిష్యులను నివారిస్తుంది.

జుట్టుకు పోషణను అందిస్తుందిం:

జుట్టుకు పోషణను అందిస్తుందిం:

ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. డ్యామేజ్ అయిన హెయిర్ ను రిపేర్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ శీకాకాయ పౌడర్ లో 10చుక్కల బాదం ఆయిల్ , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. కొద్దిగా వాటర్ మిక్స్ చేసి,పేస్ట్ చేయాలి. తలకు, జుట్టు పొడవును అప్లై చేయాలి. ఇది తలలో మురికిని తొలగిస్తుంది.

జుట్టుకు షైనింగ్ వస్తుంది:

జుట్టుకు షైనింగ్ వస్తుంది:

బాదం ఆయిల్ జుట్టును బలోపేతం చేయడం మాత్రమే కాదు, చుండ్రును నివారిస్తుంది, ఆయిల్ ప్రొడక్షన్ ను నివారి్తుంది. హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది.

అరకప్పు యాపిల్ సైడర్ వెనిగర్, అరకప్పు వాటర్ మిక్స్ చేసి, 10 చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేసి, టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. దీన్ని తలకు అప్లై చేసి, 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

హెయిర్ గ్రోత్ మాస్క్ :

హెయిర్ గ్రోత్ మాస్క్ :

బాదం హెయిర్ మాస్క్ లో విటమిన్ సి , ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును క్రమబద్దం చేస్తుంది. తలలో రక్తప్రసరణ పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొత్తగా హెయిర్ ఫాలిసెల్స్ ను ప్రోత్సహిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ డ్రైూడ్ ఆమ్లా పౌడర్, ఒక టీస్పూన్ రీటా పౌడర్ , ఒక టీస్పూన్ బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, పేస్ట్ చేసి, తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలన్నానం చేయాలి.

English summary

12 Almond Hair Growth Remedies For Thinning Hair

The earthy nut contains a high ratio of omega-3 fatty acids, vitamin E, vitamin B1, vitamin B2, magnesium and antioxidants, all of which are literally designed to love your hair. Omega-3 fatty acids in almond nourish scalp, seal cuticles and promote the regeneration of new hair follicles.
Story first published:Wednesday, October 12, 2016, 18:26 [IST]
Desktop Bottom Promotion