For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేచురల్ హెయిర్ థెరఫీలతో తెల్ల జుట్టుకు గుడ్ బై..

|

ఈ మోడ్రన్ లైఫ్ స్టైల్లో జుట్టు సమస్యలు అధికం. ముఖ్యంగా ఈ సమస్యల్లో వైట్ హెయిర్ తో చాలా మంది బాధపడుతున్నారు. నలుగురిలో అందంగా కనిపంచమనే భావనతో నలుగురిలోకి కలవకుండా ఉండే వారు ఉన్నారు. జుట్టు సమస్యల్లో బట్టతల మరియు తెల్ల జుట్టు ఈ రెండు సమస్యలు మనిషి యొక్క వ్యక్తిగత జీవితాన్ని క్రుంగదీస్తుంది.

గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

ప్రతి సారి అద్దం ముందు నిలబడ్డటప్పుడు, బాధపడటం తప్ప ఏం చేయలేని పరిస్థితి. తెల్ల జుట్టును కప్పి పుచ్చుకోవడానికి ఎన్నో చిట్కాలను, ట్రీట్మెంట్స్ ను మరియు కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించినా ఫలితం శూన్యం. ఇలా చిన్న వయస్సులో జుట్టు తెల్లగా మారడం వల్ల పెద్దవారిగా..వయస్సైన వారిలా కనబడుతుంటారు. . 30 నుండి 20 మద్యలో ఇలా తెల్లజుట్టును గమనించినట్లైతే చాలా బాధకరం అనిపిస్తుంది.

తెల్ల జుట్టుకు అనేక కారణాలున్నాయి . తెల్ల జుట్టు నివారణకు మనం తీసుకొనే జాగ్రత్తలకంటే ముందు తెల్లజుట్టుకు ప్రధాణ కారణలేంటో తెలుసుకుందాం...

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు..

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు..

మెలనిన్ తగ్గిపోవడం: తలలో మెలనిన్ లోపించడం వల్ల తెల్ల జుట్టు అధికం అవుతుంది, . ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ లోపం వల్ల మెలనిన్ లోపిస్తుంది.

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు..

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు..

ఒత్తిడి : ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్(చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణం ఒత్తిడి . జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం మరియు ఆల్కహాల్ కూడా ..

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు..

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు..

కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్: కొన్ని సందర్భాల్లో కెమికల్ బేస్డ్ షాంపు, సోపులు, హెయిర్ డైలు తలకు వాడటం వల్ల నేచుగా తెల్ల జుట్టుకు కారణం అవుతుంది . అలాగే కొన్ని అలర్జిక్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అవుతుంది.

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు..

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు..

. జెనిటిక్ డిజార్డర్స్: అదే విధంగా : జెనిటిక్ డిజార్డ్స్ వల్ల కూడా ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ కు దారితీస్తుంది.

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు..

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణాలు..

తెల్ల జుట్టుకు కారణం ఏదైనా నివారించడంలో కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ నేచురల్ రెమెడీస్ మన ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి . కాబట్టి వీటితో తెల్లజుట్టును నివారించుకోవడం ఎలాగో తెలుసుకుందాం,....

ఆమ్లా:

ఆమ్లా:

ఇండియన్ గూస్బ్రెర్రీ లేదా ఆమ్లా లేదా ఉసిరికాయ . తెల్ల జుట్టును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . మీ హోం రెమెడీస్ లో ఎండిన ఉసిరికాయను కూడా ఉపయోగించుకోవచ్చు . ఉసిరికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి తర్వాత రోజూ ఈ నూనెతో తలకు మసాజ్ చేయాలి . అలాగే కొద్దిగా ఎండిన ఉసిరికాయ పొడి, నిమ్మరసం, బాదం ఆయిల్ ను మిక్స్ చేసి తలకు ప్యాక్ వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.

క్యారెట్ సీడ్స్ మరియు నువ్వుల నూనె థెరఫీ:

క్యారెట్ సీడ్స్ మరియు నువ్వుల నూనె థెరఫీ:

అరటీస్పూన్ క్యారెట్ ఆయిల్ ను 4 చెంచాలా నువ్వుల నూనెలో మిక్స్ చేసి , తలకు అప్లై చేసి హెయిర్ రూట్స్ నుండి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రాదు మరియు హెయిర్ కు నేచురల్ కలర్ వస్తుంది . ఆరెండింటి మిశ్రమాన్ని తలకు పట్టించి కొద్దిసేపటి తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

 బ్లాక్ టీ:

బ్లాక్ టీ:

బ్లాక్ టీ చాలా సింపుల్ రెమెడీ. వైట్ హెయిర్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ . రెండు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీని బాయిల్ చేసి . తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేయాలి . గమనిక: షాంపు ఉపయోగించకూడదు.

 కరివేపాకు మరియు కొబ్బరి నూనె థెరఫి:

కరివేపాకు మరియు కొబ్బరి నూనె థెరఫి:

అరకప్పు కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా ఉగికించాలి. బాగా ఉడికించిన తర్వాత స్టెయినర్ తో వడగట్టుకోవాలి . గోరువెచ్చగా అయ్యాక తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. మైల్డ్ షాంపుతో శుభ్రం చేసుకోవాలి. ఈ థెరఫీని కొన్ని వారాల పాటు అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

 సేజ్ లీవ్స్ థెరఫీ :

సేజ్ లీవ్స్ థెరఫీ :

నేచురల్ హెయిర్ కలర్ ను తిరిగి పొందడాినకి కొన్ని సేజ్ లీవ్స్ ను వాటర్ లో వేసి బాయిల్ చేయాలి. తర్వాత గోరువెచ్చగా మారిన తర్వాత తలకు మరియు కేశాల పొడవునా చిలకరించాలి . 2 గంటల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి. కొన్ని వారాల తర్వాత తిరిగి ఇలా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బీరకాయ థెరఫీ :

బీరకాయ థెరఫీ :

అరకప్పు బీరకాయ ముక్కలు తీసుకొని, సన్నగా కట్ చేసి, ఎండబెట్టాలి. తర్వాత వాటిని అరకప్పు కొబ్బరి నూనెలో వేసి 4-5రోజులు బాగా నానబెట్టాలి. తర్వాత ముక్కలతో పాటు, నూనెను మరిగించాలి. బీరకాయ ముక్కలు నల్లగా మారే వరకూ మరిగించి వడగట్టుకోవాలి. గోరువెచ్చగా మారిన తర్వాత తలకు అప్లై చేయాలి. ఇలా వారానొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది .

 మజ్జిగ మరియు కరివేపాకు థెరఫీ:

మజ్జిగ మరియు కరివేపాకు థెరఫీ:

ఆయిల్ హెయిర్ కు ఇది ఎఫెక్టివ్ హోం ట్రీట్మెంట్ . ఒక కప్పు మజ్జిగలో , ఒక కప్పు కరివేపకు జ్యూస్ మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని కొన్ని నిముషాలు వేడి చేసి , గోరువెచ్చగా తలకు పట్టించి , ఒక గంట సేపు అలాగే ఉంచాలి . తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టును నివారించుకోవచ్చు.

మెంతులతో హెయిర్ థెరఫీ:

మెంతులతో హెయిర్ థెరఫీ:

సౌత్ ఇండియాలో తెల్లజుట్టు నివారణకు ఉపయోగించే రెమెడీస్ లో ఇది ఒక పవర్ ఫుల్ హోం రెమెడీ.ప్రతి రోజూ ఉదయం మెంతులతో తయారుచేసిన మెలకలను తినవచ్చు, లేదా మెంతులు నానబెట్టిన నీటిలో ప్రతి రోజూ ఉదయం తాగాలి. లేదా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం మెత్తగా పేస్ట్ చేసి తలకు ప్యాక్ చేసుకోవడం వల్ల తెల్ల జుట్టును నివారించుకోవచ్చు.

హెన్నా థెరఫీ:

హెన్నా థెరఫీ:

జుట్టు సమస్యలను నివారించడంలో హెన్నా గ్రేట్ గా సహాయపడుతుంది . హెన్నాను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు . హెన్నా పౌడర్ ను పెరుగు, మెంతులు, తులసి, మరియు పుదీనా రసంతో స్మూత్ పేస్ట్ లా చేసుకొని తలకు ప్యాక్ వేసుకోవాలి. అలాగే మరో రెమెడీ. పెరుగు, కాఫీ, నిమ్మరసం, క్యాటచ్యు, ఆమ్లా పౌడర్, వెనిగర్, మరియు పుదీనా పౌడర్ అన్నీ ఒక్కోక్క స్పూన్ తీసుకొని, మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి . 1గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

 నువ్వుల నూనె మరియు బాదం ఆయిల్:

నువ్వుల నూనె మరియు బాదం ఆయిల్:

వైట్ హెయిర్ నివారించడంలో ఇది మరో బెస్ట్ నేచురల్ రెమెడీ. ఒక స్పూన్ నువ్వుల నూనెకు 4 చెంచాల బాదం నూనెను మిక్స్ చేసి తలకు పట్టించి, అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి . వైట్ హెయిర్ కు నివారించడంలో మంచి ఫలితాలను అందిస్తుంది.

Story first published: Thursday, May 5, 2016, 13:16 [IST]
Desktop Bottom Promotion