For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలిపోవడం, చుండ్రువంటి సమస్యలపై కొన్ని అపోహలు మరియు వాస్తవాలు

|

మనకు పుట్టినప్పడు ఉండే నేచురల్ హెయిర్ ఒక గొప్ప ఆభరణం బహుమతి వంటిది. అయితే వయస్సుతో పాటు, శారీరకంగా అనేక మార్పులు, జుట్టు, చర్మం విషయంలోకూడా మార్పులు చేసుకుంటాయి. మనకు నేచురల్ గా వచ్చిన ఈ జుట్టును సంరక్షించుకోవడం మన బాధ్యత. ఎల్లప్పుడు, నల్లని, మంచి షైనింగ్ తో మిళమిళ మెరుస్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

అయితే కొందరికి ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న కెమికల్స్, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడి, పౌష్టికాహార లోపం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు గ్రే లేదా తెల్లగా మారుతుంటుంది. దాంతో చిన్న వయస్సులోనే వయస్సైన వారిగా కనబడుతుంటారు. అందువల్ల, జుట్టు విషయంలో ఒక్కొక్క జనరేషన్ కొన్ని కొన్ని అపోహలు వివిధ రాకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అవును, అటువంటి అపోహలకు కొన్ని వాస్తవాలను కూడా మనం తెలుసుకోవల్సిన అవసరం ఉంది.

అయితే, అపోహలన్నింటికి కాకపోయినా కొన్నింటికి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని అపోహలు మిమ్మల్ని తప్పదోవ పట్టించి ఉండవచ్చు కాబట్టి, కొన్నిఅపోహలకు కొన్ని వాస్తవాలను మీరు తెలుసుకోవడం కోసం ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. ఆలస్యం చేయకుండా మరి అవేంటో తెలుసుకుందాం..

చన్నీటి స్నానం:

చన్నీటి స్నానం:

చన్నీటి స్నానం చేస్తే జుట్టు మెరుస్తుందని కొందరు రోజూ చన్నీటి స్నానం చేస్తుంటారు. కానీ తరచూ చన్నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే మంచిది.

చుండ్రు వల్ల జుట్టు రాలుతుంది:

చుండ్రు వల్ల జుట్టు రాలుతుంది:

చుండ్రు ఉండటం వల్ల జుట్టు రాలిపోదు. కానీ చుండ్రు వల్ల ఫాలిక్యులైటివ్ వచ్చి ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు మాత్రమే జుట్టు రాలిపోతుంది.

బైక్ ప్రయాణం:

బైక్ ప్రయాణం:

బైక్ మీద స్పీడుగా వెళ్లినప్పుడు వెంట్రుకలు గాలికి వెనక్కి వెళ్లిపోతాయి కాబట్టి ఊడిపోతాయని భయపడతాం. కానీ ఇది కూడా ఒక అపోహ మాత్రమే!

 ఒకే షాంపు వాడికూడదా?

ఒకే షాంపు వాడికూడదా?

జట్టు దృఢంగా ఉండాలంటే ఎప్పుడూ ఒకే షాంపూ వాడకూడదని చాలామంది అనుకుంటుంటారు. నెలకోసారి షాంపూలను మార్చుతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. జుట్టు ఆరోగ్యానికి ఇలా షాంపూలను మార్చుకోవడంతో ఎలాంటి సంబంధం ఉండదు. నిజానికి జుట్టు తత్వాన్ని బట్టి ఒకే షాంపూను వాడితే సరిపోతుంది.

బట్టతలకు కారణం జీన్స్:

బట్టతలకు కారణం జీన్స్:

బట్టతల తల్లివైపు నుంచే వస్తుందనేది వాస్తవం కాదు. తండ్రి తరపు వారి నుంచి కూడా బట్టతల రావచ్చు. అంటే మేనమామ నుంచీ కాకుండా తాత, బాబాయ్ నుంచి కూడా బట్టతల వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు.

ఒత్తిడి వల్ల:

ఒత్తిడి వల్ల:

పని, చదువులు, లాంటి మానసిక ఒత్తిడి వల్ల జుట్టు రాలదు. అయితే ఒత్తిడి వల్ల నిద్ర లేకపోతే మాత్రం జుట్టు రాలే అవకాశం ఉంది. అలాగే ట్రైకోటిలేమియా అనే సైకలాజికల్ కండీషన్ లో జుట్టు పీక్కోవటం వల్ల జుట్టు ఊడిపోతుంది.

 తలకు నూనెతో మర్దన చేయడం వల్ల చుండ్రు వస్తుంది

తలకు నూనెతో మర్దన చేయడం వల్ల చుండ్రు వస్తుంది

నూనె మర్దన వల్ల మాడుపై రక్తప్రసరణ పెరుగుతుంది. అలసట పోతుంది. పట్టించిన నూనెను సరిగ్గా కడగకపోతే అది మురికిని చేరనిస్తుంది. అలా చుండ్రు వస్తుంది.

నూనె మర్దనతో జుట్టు బాగా పెరుగుతుంది.

నూనె మర్దనతో జుట్టు బాగా పెరుగుతుంది.

అందరూ అనుకున్నట్టుగా నూనె వల్ల జుట్టుకు పోషణ అందదు. నూనె జుట్టుకు కండిషనర్‌గా మాత్రమే పనిచేస్తుంది. సాధారణంగా హెయిర్ సెలూన్లలో పోర్స్ ఆయిల్ మసాజ్ చేస్తే మూసుకుపోయిన పోర్స్ తెరచుకుని జుట్టు ఒత్తుగా పెరుగుతుందని అనుకుంటారు. కానీ పోర్స్ మూసుకుపోవటం అనేది అసలు జరగదు.

షాంపూలు జుట్టును బలహీనపరిచి రాలిపోయేలా చేస్తాయి

షాంపూలు జుట్టును బలహీనపరిచి రాలిపోయేలా చేస్తాయి

వాస్తవానికి షాంపూల వల్ల మాడుకు పట్టిన మురికి, జిడ్డు పోతాయి. షాంపూ చేసిన తర్వాత తలను బాగా కడగకపోతే మాత్రం ప్రమాదమే.

షాంపూ మారుస్తుండాలి:

షాంపూ మారుస్తుండాలి:

ఒక షాంపూ వాడుతూ ఉంటే అది జుట్టుకు అలవాటు పడిపోతుందని తరచుగా షాంపూని మారుస్తుండాలని అనుకోవటం కూడా ఒక అపోహే

తినే తిండికి జుట్టు నాణ్యతకు ఏ సంబంధమూ లేదు.

తినే తిండికి జుట్టు నాణ్యతకు ఏ సంబంధమూ లేదు.

మంచి ఉత్పత్తులు వాడితే తమ జుట్టు ఆరోగ్యంగా ఉంటుందను కుంటారు ఎక్కువమంది. అది నిజం కాదు. పోషకాలున్న ఆహారం తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు, మంచినీరు ఇవన్నీ ముఖ్యమే.

తరచూ కత్తిరిస్తుంటే జుట్టు త్వరగా పెరుగుతుంది.

తరచూ కత్తిరిస్తుంటే జుట్టు త్వరగా పెరుగుతుంది.

కత్తిరింపుల వల్ల జుట్టుకో షేప్ వస్తుంది, అందంగా కనిపిస్తుంది తప్ప పెరగదు. జుట్టు పెరగడం అనేది లోపల నుంచి జరగాల్సిన ప్రక్రియ. బయట పనుల వల్ల అది జరగదు.

 వెంట్రుకల చివర్లు చిట్లిపోవడాన్ని ఆపచ్చు

వెంట్రుకల చివర్లు చిట్లిపోవడాన్ని ఆపచ్చు

కత్తిరించడం తప్ప వాటి నేమీ చెయ్యలేం. కండిషనర్లు, వేరే ఎలాంటి చికిత్సలు పనికిరావు.

చివర్లు చిట్లిన జుట్టు పెరగదు

చివర్లు చిట్లిన జుట్టు పెరగదు

జుట్టు కుదుళ్లలోంచి పెరుగుతుంది తప్ప చివర్లు కాదు. అందువల్ల చివర్లు చిట్లిపోయినా జుట్టు పొడవుగా పెరుగుతుంది.

హెన్నా పెట్టిన జుట్టుకు రంగేస్తే ఎక్కువకాలం ఉంటుంది.

హెన్నా పెట్టిన జుట్టుకు రంగేస్తే ఎక్కువకాలం ఉంటుంది.

నిజానికి హెన్నా (గోరింటాకు) జుట్టుకు ఒక శాశ్వతమైన కోటింగ్ ఇస్తుంది, అందువల్ల రంగు నిలిచే ప్రసక్తే లేదు. అలాగే హెన్నా వల్ల జుట్టు మృదుత్వాన్ని, సహజత్వాన్ని కోల్పోతుంది. హెన్నా లేదా రంగు - ఏదో ఒక్కటి వాడటమే మేలు. రెండిటినీ కలపి పట్టించడం మంచిది కాదు.

 రాత్రికిరాత్రే జుట్టు రాలిపోతుంది

రాత్రికిరాత్రే జుట్టు రాలిపోతుంది

అలా ఎప్పుడూ జరగదు. జుట్టు పండిపోవడం వయసుతో పాటు నెమ్మదిగా జరిగే ప్రక్రియ. పండిన వెంట్రుక ఒక్కటి పీకేస్తే, దానిచుట్టూ ఉన్నవన్నీ పండిపోతాయి ఇది తప్పు. ఒకటి పీకేసినంత మాత్రాన పక్కవాటికి ఏమీ జరగదు.

మందులతో జుట్టు ఊడిపోకుండా చూడొచ్చు

మందులతో జుట్టు ఊడిపోకుండా చూడొచ్చు

వయసుమీరడం వల్ల లేదంటే జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల జుట్టు రాలిపోకుండా. వయసునేమీ చెయ్యలేరు గనక, జీవనశైలిని మెరుగుపరచుకుంటే జుట్టు పండిపోకుండా జాగ్రత్త పడొచ్చు. వేళకు తిండితో పాటు తగినంత నిద్ర పోతే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

మీరు ఒక తెల్ల వెంట్రుకను లాగితే, హెయిర్ ఫోలిసెల్స్ నుండి ఎక్కువగా తెల్ల వెంట్రుకలు పెరుగుతాయి.

మీరు ఒక తెల్ల వెంట్రుకను లాగితే, హెయిర్ ఫోలిసెల్స్ నుండి ఎక్కువగా తెల్ల వెంట్రుకలు పెరుగుతాయి.

వాస్తవం: ఇది ఖచ్చితంగా అవాస్తవం. తెల్లజుట్టును లాగడం ఆపకపోతే, కొన్ని రోజుల తర్వాత నిజంగా గుడ్డు అయిపోవడం ఖాయం. తలలో ఒక్కో వెంట్రుకకు ఒక్కో హెయిర్ ఫోలిసెల్ మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఇతర ఫోలిసెల్స్ జుట్టును తెల్లగా మార్చడం అసాద్యం.

సిగరెట్ త్రాగడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది

సిగరెట్ త్రాగడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది

. వాస్తవం: అవును, ఇది నిజం, స్మోక్ చేయడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. నిపుణులు జె.జీ మోస్లే అభిప్రాయం ప్రకారం, సిగరెట్ త్రాగని వారికంటే, సిగరెట్ త్రాగేవారిలో నాలుగు రెట్లు ఎక్కువగా తెల్ల జుట్టుకు కారణం అవుతుంది. స్మోక్ చేయడం వల్ల జుట్టు తెల్లబడుట మాత్రమే కాదు, జుట్టు రాలడానికి కూడా కారణం అవుతుంది. అందువల్ల, ధూమపానంకు దూరంగా ఉండా తెల్లజుట్టు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

హెల్మెట్ వాడితే జుట్టు రాలుతుంది:

హెల్మెట్ వాడితే జుట్టు రాలుతుంది:

హెల్మెట్ వాడితే జుట్టు రాలిపోతుందన్నదానికి వాస్తం లేదు,. కానీ అదే నిజమైతే ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకుని ఉండే ట్రాఫిక్ పోలీసులు అందరికీ జుట్టు రాలిపోవాలిగా..!

English summary

20 Hair Myths You Need to Stop Believing

20 Hair Myths You Need to Stop Believing, Are you fed up of listening to the old stories of your Granny bragging about those lustrous locks she used to possess in her era? Believe it or not, but we all believe in what our ancestors have said or done.
Story first published: Monday, April 11, 2016, 12:05 [IST]
Desktop Bottom Promotion