For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో కంపల్సరీ పాటించాల్సిన హెయిర్ కేర్ టిప్స్..!

By Swathi
|

వర్షాకాలంలో చిరుజల్లులను ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. చినుకుల్లో తడుస్తూ హాయిగా గడపాలి అనుకుంటారు. అలాగే.. ఈ క్లైమెట్ ని కపుల్స్ చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తారు. అయితే.. ఎంజాయ్ మెంట్ వరకు వర్షాకాలం బాగా ఉన్నప్పటికీ.. జుట్టుకి మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి.

వర్షాకాలంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకి హాని కలుగుతుంది. వర్షం నీటివల్ల జుట్టు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఎలాంటి హోం రెమిడీస్.. మీ జుట్టుని వర్షాకాలంలో హెల్తీగా, షైనీగా ఉంచుతాయో ఇప్పుడు చూద్దాం..

జుట్టుకి మాయిశ్చరైజర్

జుట్టుకి మాయిశ్చరైజర్

వర్షాకాలంలో స్కాల్ప్ డ్రై అవుతుంది. కొబ్బరినూనెతో మాయిశ్చరైజ్ అందించడం చాలా అవసరం. జుట్టు అంతటికీ.. ఆయిల్ అప్లై చేసి దువ్వెనతో దువ్వుకోవాలి. దీనివల్ల ఆయిల్ జుట్టు మొత్తానికి అందుతుంది. దీనివల్ల స్కాల్ప్ మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది.

ఆయిల్ ట్రీట్మెంట్

ఆయిల్ ట్రీట్మెంట్

అర టీస్పూన్ ఆముదంను కొబ్బరినూనెలో కలిపి.. కాస్త వేడి చేసి.. స్కాల్ప్ కి పట్టించడం వల్ల.. జుట్టు హెల్తీగా పెరుగుతుంది. ఇలా రాత్రంతా వదిలేసి.. ఉదయాన్నే మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

డాండ్రఫ్ నివారించడానికి

డాండ్రఫ్ నివారించడానికి

రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, రెండు నిమ్మకాయల రసం, ఒక ఆరంజ్ జ్యూస్ తీసుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. తర్వాత టవల్ తో తలను చుట్టుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత.. జుట్టుని మైల్డ్ షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

జుట్టు రాలడాన్ని నివారించడానికి

జుట్టు రాలడాన్ని నివారించడానికి

మరీ ఎక్కువగా కండిషనర్, ఎక్కువ కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించరాదు. వర్షాకాలంలో షాంపూ చేసుకున్న ప్రతిసారీ.. కండిషనర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. వర్షాకాలంలో జుట్టు డ్రైగా మారి.. ఎక్కువ హెయిర్ ఫాల్ అవడానికి కారణమవుతుంది. అలాగే జుట్టుకి రంగు వేసుకోవడం వల్ల కూడా మరింత డ్రై అవుతుంది. అలాగే.. ప్లాస్టిక్ కంటే.. చెక్క దువ్వెన ఉపయోగించడం మంచిది.

హైడ్రేట్ గా ఉండటం

హైడ్రేట్ గా ఉండటం

వర్షాకాలంలో నీళ్లు ఎక్కువగా దప్పిక కావు. కానీ.. రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. ఇది చర్మానికి మాత్రమే కాదు.. జుట్టుకి కూడా మంచిది.

బలమైన జుట్టుకి

బలమైన జుట్టుకి

జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ప్రొటీన్, ఐరన్ ఫుడ్ ని ఖచ్చితంగా వర్షాకాలంలో తీసుకోవాలి. ఎగ్స్, పెరుగు, ఫిష్, క్యారట్స్, నట్స్, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

సరిపడా నిద్ర

సరిపడా నిద్ర

ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోవడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. సరిపడా నిద్రపోకపోతే.. ఒత్తిడికి కారణమవుతుంది. ఒత్తిడి జుట్టు రాలడానికి ఒక కారణం.

English summary

6 tips for to prevent dandruff, hair fall and other hair problems during monsoon

6 tips for to prevent dandruff, hair fall and other hair problems during monsoon. The humidity in monsoon makes it impossible for you to have a good hair day! Taming the frizz becomes a tough job and you end up tying your hair up.
Story first published:Thursday, July 21, 2016, 15:26 [IST]
Desktop Bottom Promotion