Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హెయిర్ ఫాల్ తగ్గించే అమేజింగ్ సొల్యూషన్ అలోవెరా జెల్..!!
అలోవెరాతో జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలి ?
10 మందిలో 9మంది తమ జుట్టుని దువ్వుకోవాలన్నా, ముట్టుకోవాలన్నా భయపడతారట. ఎందుకంటే.. జుట్టు రాలిపోతుందని. ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతుంటే.. ఒకే ఒక్క సొల్యూషన్ అద్బుతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గించే ఆ ఒకే ఒక్క పరిష్కారమే.. అలోవెరా మాస్క్.
బంకగా ఉండే ఈ అలోవెరా జెల్ ని జుట్టు రాలడాన్ని అరికట్టడానికి అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. అలోవెరాలో 96శాతం నీళ్లు ఉంటాయి. 18 నుంచి 20 రకాల ఎమినో యాసిడ్స్, వివిధ ప్రొటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ మైక్రోన్యూట్రియంట్స్ హెయిర్ ఫాల్ ని అరికట్టడమే కాదు... జుట్టుని షైనింగ్ ని, కుదుళ్లకు బలాన్ని అందిస్తాయి.
అలోవెరాలో ఉండే మరో కార్బొహైడ్రేట్.. జుట్టు తంతువుల వరకు చేరి, పోషణ అందిస్తాయి. టాక్సిన్స్ ని తొలగిస్తాయి. మరి ఇన్ని అద్భుత ప్రయోజనాలు అందించే అలోవెరా మీ జుట్టు రాలడాన్ని అరికడుతుందని కాన్ఫిడెన్స్ మీలో వచ్చేసింది కదూ. అయితే.. అలోవెరాను ఎలా ఉపయోగించాలో చూద్దాం..

అలోవెరా జెల్
అలోవెరాలో పెక్టిన్ ఉంటుంది. అది డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి.. స్కాల్ప్ కి మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఒక గిన్నెలో అలోవెరా జెల్ తీసుకుని జుట్టుకి, స్కాల్ప్ కి సున్నితంగా 5 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత హాట్ టవల్ చుట్టుకుని 30 నిమిషాల తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా, ఆలివ్ ఆయిల్, విటమిన్ ఈ
చిట్లిపోయిన జుట్టుని, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది ఈ హెయిర్ ప్యాక్. అరకప్పు అలోవెరా జెల్, 1విటమిన్ ఈ ట్యాబ్లెట్, 2టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. సన్నటిమంటపై 5నిమిషాలు వేడిచేయాలి. చల్లారనివ్వాలి. కాటన్ బాల్ ఉపయోగించి జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. షవర్ క్యాప్ పెట్టుకుని 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా, ఉల్లిరసం, కొబ్బరినూనె
ఈ మాస్క్ చుండ్రుని తొలగించి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ ఉల్లిరసం, అరకప్పు కొబ్బరినూనె మిక్స్ చేయాలి. తక్కవ మంటపై 15 నిమిషాలు వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయం మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

మెంతులు, అలోవెరా, టీట్రీ ఆయిల్
ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్, మినరల్స్ కలిపి జుట్టుకి ప్యాక్ లా వేసుకుంటూ ఉంటే.. నెలలోనే జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుంది. 1 టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం పేస్ట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 10 చుక్కల టీట్రీ ఆయిల్ కలపాలి. దీన్ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. 40 నిమిషాల తర్వాత.. షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా, ఎగ్, పెరుగు
జుట్టు రాలడాన్ని తగ్గించి పెరగడానికి సహాయపడుతుంది. ఒక గిన్నెలో ఎగ్ వైట్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పెరుగు, అలోవెరా జెల్ మిక్స్ చేయాలి. మూడింటినీ బాగా మిక్స్ చేశాక జుట్టుకి పట్టించాలి. 40 నిమిషాల తర్వాత.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

అలోవెరా, నిమ్మరసం
అదనపు ఆయిల్ ని కంట్రోల్ చేసి..జుట్టు మందంగా, షైనీగా మారడానికి ఈ ప్యాక్ సహాయపడుతుంది. 1టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 2టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications