For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందారంతో ఆశ్చర్యం కలిగించే జుట్టు పెరుగుదల రహస్యాలు..!!

By Super Admin
|

మీ జుట్టు సహజంగా ఉండాల్సిన దానికంటే మరీ పల్చగా మారిందా? ప్రతి రోజూ జుట్టు ఊడిపోవడం గమనిస్తున్నారు. మీరు నిద్రలేచినప్పుడు, పిల్లో మీద రాలిపోయిన జుట్టును చూసి ఆందోళ చెందుతున్నారా?మరింత జుట్టు రాలిపోతుందేమోన్న భయంతో ఆందోళ చెందున్నారా?ఐతే ఈ సమస్యకు పరిస్కారం ఏంటని ఆలోచిస్తున్నారా? జుట్టు రాలడం అరికట్టడానికి హోం మేడ్ హైబిస్కస్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలకోసం పురాతన కాలం నుండే మందారంను ఉపయోగిస్తున్నారు . ఇది జుట్టు రాలడం నివారించి, జుట్టు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మందారంలో విటమిన్ సి ఎక్కువగా ఉంది, ఇది తలలోని తలలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే సెబమ్ ను నివారిస్తుంది. ఫ్రీరాడియల్స్ నుండి చర్మ రంద్రాలకు రక్షణ కల్పించి జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది.

మందారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారిస్తుంది, తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది, ఇది హెయిర్ ఫాలిసెల్స్ ను రీజనరేట్ చేస్తుంది.

ఇంకా మందారంలో వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్ మరియు ఎసెన్సియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉన్నాయి . ఇవన్నీ జుట్టును ఒత్తుగా, స్మూత్ గా మరియు బౌన్సీగా పెరిగేలా చేస్తుంది.

జుట్టు ఒత్తుగా పెరిగేందుకు మందారంను ఎలా ఉయోగించాలో తెలుసుకుందాం...

మందారం నూనె

మందారం నూనె

మందారం నూనెను, కొబ్బరి నూనెలో మిక్స్ చేసి రెగ్యులర్ ప్రతి రోజూ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.

ఎలా పనిచేస్తుంది:

7 మందారం పువ్వులు తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు కొబ్బరి నూనెను వేడి చేయాలి. అందులోనే ఈ మందారం పేస్ట్ కూడా వేసి 10 నిముషాలు పేస్ట్ చేయాలి. ఈ ఆయిల్ ను చల్లారిన తర్వాత తలకు మరియు జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

మందారం షాంపు:

మందారం షాంపు:

హెయిర్ ఫాల్ తగ్గించడంలో మరో టెస్టెడ్ హోం రెమెడీ మందారం షాంపు. మందారంలో జారుడు గుణం ఉంటుంది , ఇది జుట్టుకు ఎటువంటి హాని కలిగించకుండా తలను శుభ్రం చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

5 మందారపువ్వులను మెత్తగా పేస్ట్ చేసి, ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిని, పెరుగును మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకుఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. జుట్టు ఆయిలీగా ఉంటే, ఈ ప్రొసెస్ ను రిపీట్ చేయండి.

మందారం+మెంతి యాంటీ డ్యాండ్రఫ్ మాస్క్ :

మందారం+మెంతి యాంటీ డ్యాండ్రఫ్ మాస్క్ :

ఈ హెయిర్ మాస్క్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది, తలలో ఆయిల్ ప్రొడక్షన్ ను నివారిస్తుంది, దాంతో తలలో చుండ్రు నివారించబడుతుంది.

ఎలా పనిచేస్తుంది:

మెంతులను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం దీన్ని పేస్ట్ చేసిపెట్టుకోవాలి. అలాగే మందారం పువ్వులను కూడా పేస్ట్ చేసియాలి.

ఈ రెండు పేస్ట్ లను ఒకటిగా కలుపుకుని, తలకు పూర్తిగా పట్టించాలి. ఒకగంట తర్వాత షాంపుతో తలస్నాం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల మొదటసారికే మంచి ఫలితాలను చూపుతుంది.

జుట్టు డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేసి హైబిస్కస్ టానిక్

జుట్టు డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేసి హైబిస్కస్ టానిక్

మందారం పువ్వు, ఆకులు మాత్రమే కాదు, మందారం వేర్లు కూడా జుట్టు సంరక్షణకు ఉపయోగించుకోవచ్చు . జుట్టుకు హీటింగ్ టూల్స్ ఉపయోగించడం, టాక్సిక్ కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల, కాలుష్యం వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా మందార మిశ్రమం జుట్టుకు టానిక్ గా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

10 నుండి `12 మందారం ఆకులు, పువ్వులు తీసుకుని నీటిలో వేసి ఉడికించాలి. 30 తక్కవు మంటలో ఉడికించాలి. తర్వాత 12 గంటల సేపు అలాగే ఉంచాలి. వడగట్టి, దీన్నిహెయిర్ టానిక్ గా ఉపయోగించడం వల్ల హెయిర్ డ్యామేజ్ హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.

హైబిస్కస్ కండీషనర్

హైబిస్కస్ కండీషనర్

మందారంలో విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మార్కెట్లోని కండీషనర్స్ కంటే 10 రెట్లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి .

ఎలా పనిచేస్తుంది: మందారం పువ్వును వాటర్ తో మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని తలకు పూర్తిగా అప్లై చేసి, షవర్ క్యాప్ పెట్టాలి, ఒక గంట అలాగే ఉంచాలి. గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

జుట్టును స్ట్రాంగ్ గా మార్చడానికి హైబిస్కస్ మాస్క్ :

జుట్టును స్ట్రాంగ్ గా మార్చడానికి హైబిస్కస్ మాస్క్ :

ఈ హెయిర్ మాస్క్ వల్ల నిర్జీవంగా మారిన జుట్టు, చిట్లిన జుట్టుకు తిరిగి జీవం పోస్తుంది. బలాన్నిస్తుంది.

ఈ మాస్క్ తయారికి కావల్సిన పదార్థాలు:

మందారం పౌడర్ 3 టేబుల్ స్పూన్లు

తేనె: 1 టేబుల్ స్పూన్

అలోవెర జెల్ 1 టేబుల్ స్పూన్

పెరుగు రెండు టేబుల్ స్పూన్లు

ఎలా పనిచేస్తుంది:

అన్ని పదార్థాలను ఒక బౌల్లో మిక్స్ చేయాలి. ఇవన్నీ స్మూత్ గా తయారయ్యే వరకూ మిక్స్ చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఈ హోం మేడ్ హైబిస్కస్ మాస్ జుట్టు పెరుగుదలను వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

6 Ways You Can Use Gudahal (Hibiscus) To Make Hair Thicker

Does your hair feel thinner than normal? Do you often wake up to hair strands coating your bedsheets and pillow? Are you too scared to touch your hair, fearing it will break more? We have only one suggestion for you and that is, homemade hibiscus masks for hair growth.
Story first published: Thursday, September 22, 2016, 18:01 [IST]
Desktop Bottom Promotion