For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలస్నానం సమయంలో జుట్టుని డ్యామేజ్ చేసే మిస్టేక్స్

By Swathi
|

అమ్మాయిలకు జుట్టే అందం. అందుకే రకరకాల స్టైల్స్, రకరకాల హంగుల్లో హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతుంటారు. తల దువ్వడానికే ఎక్కువ సమయం తీసుకుంటూ రెడీ అవుతూ ఉంటారు. కొందరికి పొడవాటి జుట్టు, మరికొందరికి పొట్టి జుట్టు అందం, ఆసక్తి. అయితే కొందరికి జుట్టుని అలంకరించుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది.

జుట్టుని స్టైలిష్ గా మార్చుకోవడమే కాకుండా.. జుట్టుపై కేర్ కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే జుట్టుకి రెగ్యులర్ గా ఆయిల్ పెట్టుకోవడం, ప్యాక్స్ వేసుకోవడం, హెయిర్ ఫ్రెండ్స్ ఫుడ్స్ తీసుకోవడం వంటివి కూడా ఫాలో అవుతుంటారు. అయినా కూడా మీ జుట్టు మీరు ఆశించిన అందంగా, ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు.

మీ జుట్టుని అందంగా మార్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించి.. మీరు కోరుకున్న ఫలితాలు పొందక డీలాపడుతున్న వాళ్లలలో మీరూ ఉంటే.. మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటో గమనించాలి. మీరు మీ జుట్టుకి షాంపూ చేసుకునే తీరులో తప్పులు చేస్తుండవచ్చు లేదా తలస్నానం చేసే విధానంలో పొరపాట్లు చేస్తుండటం వల్ల కూడా మీ జుట్టు ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. మరి జుట్టుని శుభ్రం చేసుకునేటప్పుడు సాధారణంగా చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దామా..

వేడినీళ్లు

వేడినీళ్లు

మీరు మీ జుట్టుని శుభ్రం చేసుకోవడానికి వేడినీళ్లు ఉపయోగిస్తున్నారా ? అయితే ఇదే మీరు చేస్తున్న పెద్ద పొరపాటు. హాట్ వాటర్ ని హెడ్ బాత్ కి ఉపయోగించడం వల్ల జుట్టు, స్కాల్ఫ్ పొడిబారుతుంది. కాబట్టి తలస్నానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం వల్ల.. షాంపూ, కండిషనర్ ఉపయోగించిన ఫలితం పొందవచ్చు. అలాగే జుట్టుని ఒక్కసారైనా అంటే.. చివర్లో చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

జుట్టుకు తడి

జుట్టుకు తడి

చాలా మంది జుట్టు పూర్తీగా తడవక ముందే.. షాంపూతో శుభ్రం చేసుకుంటారు. షాంపూ చేయడానికి ముందు జుట్టునంతటినీ కనీసం రెండునిమిషాలు తడవనివ్వాలి.

ఎక్కువ మోతాదులో షాంపూ

ఎక్కువ మోతాదులో షాంపూ

చాలామంది జుట్టు షైనింగ్ గా కనిపించాలని.. ఎక్కువ మోతాదులో షాంపూ ఉపయోగిస్తారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. ఎక్కువ షాంపూ ఉపయోగించడం వల్ల జుట్టుకి క్లెన్సింగ్ అందదు. కాబట్టి ఒక రూపాయి బిల్ల పరిమాణంలో షాంపూ ఉపయోగించాలి. అది సరిపోకపోతే.. రెండోసారి.. దాని కంటే తక్కువ మోతాదులో షాంపూ ఉపయోగించాలి.

జుట్టు శుభ్రం చేసే సమయం

జుట్టు శుభ్రం చేసే సమయం

ఎవరైతే 5 నిమిషాల కంటే.. తక్కువ సమయంలో జుట్టుని శుభ్రం చేసుకునే అలవాటు ఉంటుందో వాళ్లు తప్పు చేస్తున్నట్టే. ఎక్కువ షాంపూ ఉపయోగించి.. గబగబా స్నానం చేయడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి.. కాసేపు స్కాల్ఫ్, జుట్టుపై చేతివేళ్లతో మసాజ్ చేస్తేనే దాని ఫలితం పొందవచ్చు.

కండిషనర్

కండిషనర్

తలస్నానం తర్వాత తలలో న్యాచురల్ ఆయిల్స్ కోల్పోతాయి. దీనివల్ల జుట్టు డ్రైగా మారుతుంది. కాబట్టి మీ జుట్టుకి కంపల్సరీ కండిషనర్ అవసరం. కండిషనర్ అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది.

రోజూ హెయిర్ వాష్

రోజూ హెయిర్ వాష్

రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ సూచిస్తారు. అయితే.. మీ జుట్టు మీకు ఎప్పుడు చిరాగ్గా అనిపిస్తే.. అప్పుడు తలస్నానం చెయవచ్చు. అవసరమైతే.. మీ జుట్టు జిడ్డుగా మారి ఉంటే రోజు మార్చి రోజు తలస్నానం చేయవచ్చు.

షాంపూలు

షాంపూలు

మార్కెట్ లో రకరకాల షాంపూలు అందుబాటులో ఉండటం వల్ల చాలా మంది రకరకాల షాంపూలను ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని రోజులకే.. తాము వాడుతున్న షాంపూ మంచి ఫలితాన్ని ఇవ్వడం లేదని భావించి.. మరో దానికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అయితే.. సీజన్ ని బట్టి మీ జుట్టులో మార్పులు వస్తుంటాయి. కాబట్టి మైల్డ్ షాంపూ ఎంచుకోవడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. తరచుగా షాంపూలు మార్చడం మంచిది కాదు.

English summary

7 Common Hair Washing Mistakes That Most Women Make

7 Common Hair Washing Mistakes That Most Women Make. Well, here are some tips to guide you from making the most common mistakes in "Step One" of your hair care regimen that is, hair wash. So, let us begin.
Story first published:Wednesday, April 20, 2016, 16:27 [IST]
Desktop Bottom Promotion