For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్లర్ కి వెళ్లకుండా ఇంట్లోనే జుట్టుని స్ట్రెయిట్ చేసే న్యాచురల్ టిప్స్

By Swathi
|

రింగు రింగుల జుట్టు లేదా వంపులు తిరిగిన జుట్టుని స్ట్రెయిట్ గా మార్చుకోవడానికి చాలా ట్రీట్మెంట్స్ ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది తరచుగా పార్లర్లకు వెళ్లి జుట్టుని స్ట్రెయిట్ చేయించుకుంటారు. కానీ.. వెంటనే మళ్లీ మామూలు పరిస్థితే. అలాంటప్పుడు న్యాచురల్ రెమిడీస్ తో మీ జుట్టుని స్ట్రెయిట్ గా అందంగా మార్చుకునే సింపుల్ ట్రీక్స్ మీ చేతుల్లోనే ఉన్నాయి.

స్ట్రెయిట్ హెయిర్ ఉంటే.. జుట్టుని రకరకాల స్టైల్స్ లో అలంకరించుకోవచ్చు. ట్రెండీ హెయిర్ స్టైల్స్ తో అందంగా తయారు కావచ్చు. అందుకే చాలామంది స్ట్రెయిట్ హెయిర్ కోసం ఆరాటపడుతుంటారు. కానీ.. చాలామందికి స్ట్రెయిట్ హెయిర్ ఉండదు. స్ట్రెయిట్ కవాలని కోరుకునేవాళ్లు కొంచెం ఓపిగ్గా.. సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. మీరు మెచ్చిన స్ట్రెయిట్ హెయిర్ పొందవచ్చు.

కొబ్బరిపాలు

కొబ్బరిపాలు

కొబ్బరిపాలు జుట్టుని స్ట్రెయిట్ గా చేయడంతో పాటు, జుట్టుకి కొత్త నిగారింపు తీసుకురావడానికి సహాయపడుతుంది. కొబ్బరిని మిక్సీవేసి పాలు తీసి.. జుట్టుని శుభ్రం చేసుకున్న తర్వాత కొబ్బరిపాలతో శుభ్రం చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్లీ చల్లటినీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు స్ట్రెయిట్ గా మారిపోతుంది.

కొబ్బరిపాలు, నిమ్మరసం

కొబ్బరిపాలు, నిమ్మరసం

ఒక కప్పు కొబ్బరిపాలకు ఒక నిమ్మకాయ రసం కలిపి.. రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఈ పేస్ట్ ఉదయాన్నే జుట్టుకి పట్టించి.. గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

హాట్ ఆయిల్ మసాజ్

హాట్ ఆయిల్ మసాజ్

హాట్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల.. మీ జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారిపోతుంది. కొంచెం కొబ్బరినూనె లేదా ఆముదం లేదా ఆలివ్ అయిల్ ని కాస్త వేడి చేయాలి. గోరువెచ్చగా చేయాలి. మరీ ఎక్కువగా హీట్ చేయరదు. ఈ ఆయిల్ ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించి బాగా మసాజ్ చేయాలి. తర్వాత టవల్ తో జుట్టుని కవర్ చేయాలి. 30 నిమిషాల తర్వాత టవల్ తీసేసి.. మంచి షాంపూ, కండిషర్ ఉపయోగించి జుట్టుని శుభ్రం చేసుకుంటే.. మీ జుట్టు స్ట్రెయిట్ గా మారిపోతుంది.

బనానా, పెరుగు, ఆలివ్ ఆయిల్

బనానా, పెరుగు, ఆలివ్ ఆయిల్

రెండు అరటిపండ్లను బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె, పెరుగు, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా కలిపి.. 30 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తర్వాత తలకు పట్టించి.. టవల్ లేదా షవర్ క్యాప్ తో కవర్ చేసుకోవాలి. గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీరు మెచ్చిన జుట్టు మీ సొంతమవుతుంది. ఎగ్ వైట్ మిక్స్ చేసుకుంటే.. మరింత బెటర్ రిజల్ట్స్ పొందవచ్చు.

పాలు

పాలు

పాలల్లో మాయిశ్చరైజింగ్ గుణాలుంటాయి. కాబట్టి ఇది జుట్టు స్ట్రెయిట్ గా మారడానికి సహాయపడుతుంది. అరకప్పు పాలు, అరకప్పు నీళ్లు తీసుకుని కలపాలి. దీన్ని స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. జుట్టు చిక్కుల్లేకుండా దువ్వుకోవాలి. ఇప్పుడు పాలను స్ప్రే చేసి.. మళ్లీ దువ్వుకోవాలి. 30 నిమిషాల తర్వాత షాంపూ, కండిషర్ తో జుట్టుని శుభ్రం చేసుకోవాలి. అంతే సింపుల్ టిప్ కదూ..

ముల్తానీ మట్టి, ఎగ్

ముల్తానీ మట్టి, ఎగ్

ఒక కప్పు ముల్తానీ మటట్టి, 5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. రెండింటినీ మిక్స్ చేసి.. ఎగ్ వైట్ కలపాలి. బాగా మిక్స్ చేయాలి. కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి.. 30 నిమిషాలు జుట్టుని టవల్ తో కవర్ చేయాలి. ఇలా నెలకు ఒకసారి చేస్తే మీ జుట్టు స్ట్రెయిట్ గా మారిపోతుంది.

వెనిగర్

వెనిగర్

ఒక కప్పు నీళ్లకు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేయాలి. జుట్టుని షాంపూతో శుభ్రం చేసిన తర్వాత దీన్ని అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత మళ్లీ చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

English summary

7 Excellent Home Remedies For Straight Hair

7 Excellent Home Remedies For Straight Hair. One of the best benefits of having perfectly straight hair is that you can pull off any kind of hairstyle with extreme ease.
Story first published: Monday, April 18, 2016, 11:10 [IST]
Desktop Bottom Promotion