For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెమికల్ షాంపూ ఉపయోగించకుండా.. జుట్టు శుభ్రం చేసుకునే ఎఫెక్టివ్ రెమిడీస్..!!

By Swathi
|

షాంపూ లేకుండా జుట్టు శుభ్రం చేసుకోవడం అంటే.. చాలా కొత్తగా ఉంది కదూ. నిజమే.. మన అమ్మమ్మల కాలంలో షాంపూలు, రకరకాల ఫ్లేవర్స్ లో కండిషనర్లు ఉండేవి కాదు. షాంపూల ఊసే ఉండేది కాదు. మరి వాళ్లెలా తలస్నానం చేసేవాళ్లు ? సింపుల్.. హెర్బల్ ఇంగ్రిడియంట్స్ తోనే తలస్నానం చేసేవాళ్లు.

షాంపూలు 1930 తర్వాతే అందుబాటులోకి వచ్చాయి. హెర్బల్ పదార్థాలను ఉపయోగించడం ద్వారా.. స్కాల్ప్ కూడా క్లీన్ గా, శుభ్రంగా ఉంటుంది. షాంపూలను ఉపయోగిస్తేనే.. జుట్టు శుభ్రంగా ఉండదు. న్యాచురల్ ఇంగ్రిడియంట్స్ ఉపయోగించడం వల్ల జుట్టు హెల్తీగా, బలంగా ఉంటుంది.

షాంపూలలో ఉండే కెమికల్స్ జుట్టుని షైనీగా, స్ట్రాంగ్ గా మార్చినా.. జుట్టులోని న్యాచురల్ ఆయిల్స్ కోల్పోయేలా చేస్తుంది. అలాగే జుట్టు డ్రైగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి న్యాచురల్ గా జుట్టుని శుభ్రం చేసుకోవడం మంచిది.

కుంకుడుకాయలు, ఉసిరికాయలు

కుంకుడుకాయలు, ఉసిరికాయలు

కుంకుడుకాయలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబైయాల్ గుణాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్ లోని డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి, జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది.

ఉపయోగించే విధానం

ఉపయోగించే విధానం

కుంకుడుకాయల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉసిరిపొడి 1 టేబుల్ స్పూన్, నీళ్లు తీసుకుని అన్నింటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. జుట్టుని తడుపుకుని స్కాల్ప్ కి, జుట్టుకి పట్టించాలి. 5నిమిషాలు మసాజ్ చేయాలి. ఇప్పుడు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.

బేకింగ్ సోడా, ఆల్మండ్ ఆయిల్

బేకింగ్ సోడా, ఆల్మండ్ ఆయిల్

బేకింగ్ సోడా స్కాల్ప్ పై పేరుకున్న కెమికల్స్ ని శుభ్రపరుస్తుంది. ఆల్మండ్ ఆయిల్ కండిషనర్ లా పనిచేస్తుంది.

ఉపయోగించే విధానం

ఉపయోగించే విధానం

1టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 కప్పు నీళ్లు, 5 చుక్కల ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి. నీటిలో బేకింగ్ సోడా కరిగించి, ఆల్మండ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. కొన్ని నిమిషాలు మసాజ్ చేసి.. శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం, దోసకాయ రసం

నిమ్మరసం, దోసకాయ రసం

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టుకి షైనింగ్ ఇస్తుంది. దోసకాయ చల్లటి అనుభూతి కలిగిస్తుంది. 1టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ దోసకాయ రసం తీసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. కాటన్ బాల్ సహాయంతో.. జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసుకోవాలి.

అలోవెరా

అలోవెరా

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటం వల్ల ఇది స్కాల్ప్ ని క్లెన్స్ చేస్తుంది. అదనపు నూనె ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ఉపయోగించే విధానం

ఉపయోగించే విధానం

అరకప్పు అలోవెరా జెల్, 2టేబుల్ స్పూన్ల షీకాయ పౌడర్, 5 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవాలి. అన్నింటినీ ఒక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి. జుట్టుని తడుపుకుని.. ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇది స్కాల్ప్ ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. జుట్టులో పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది.

ఉపయోగించే విధానం

ఉపయోగించే విధానం

1టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. వెనిగర్ ని నీటిలో మిక్స్ చేసి.. జుట్టుని శుభ్రం చేసుకోవడానికి ఈ మిశ్రమాన్ని ఉపయోగించాలి. 10 నిమిషాల తర్వాత మళ్లీ చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి.

బంకమట్టి

బంకమట్టి

పావు కప్పు బంకమట్టి, 1టీ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు నీళ్లు, 5 చుక్కుల లావెండర్ ఆయిల్ తీసుకుని అన్నింటినీ మిక్స్ చేసి.. పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

7 Herbal Ingredients To Wash Your Hair Without A Shampoo

7 Herbal Ingredients To Wash Your Hair Without A Shampoo. However, our grandmother and great grandmothers before that used herbal ingredients to wash their hair, and they did just fine. In fact, their hair was much more healthier, darker and heavier!
Story first published:Tuesday, September 13, 2016, 10:56 [IST]
Desktop Bottom Promotion