For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబ్బాయిల్లో హెయిర్ ఫాల్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్

By Swathi
|

జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఆడవాళ్లు పొడవాటి కురులకు మాత్రమే కాదు మగవాళ్లలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవాళ్ల జుట్టు రాలినా.. పొడవుగా ఉంటుంది కాబట్టి.. ఏదో ఒక హెయిర్ స్టైల్ తో కవర్ చేసుకోవచ్చు. కానీ అబ్బాయిల్లో జుట్టు రాలడం మొదలయింది అంటే.. ఇక బట్టతలకే ఎక్కువ అవకాశాలుంటాయి. కాబట్టి బీ కేర్ ఫుల్.

అబ్బాయిలు వాళ్ల జుట్టు విషయంలో చేసే కామన్ మిస్టేక్స్..!అబ్బాయిలు వాళ్ల జుట్టు విషయంలో చేసే కామన్ మిస్టేక్స్..!

అబ్బాయిల్లో జుట్టు రాలడానికి జెనిటిక్స్, లైఫ్ స్టైల్, పోషక లోపం, డైట్ వంటి రకరకాల కారణాలుంటాయి. కాబట్టి డైట్ ని బ్యాలెన్స్ చేస్తూనే కొన్ని రకాల హోం రెమిడీస్ ఫాలో అయితే అబ్బాయిల్లో జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. మరి అబ్బాయిల్లో హెయిర్ లాస్ అరికట్టే ఎఫెక్టివ్ హోం రెమిడీస్ ఏంటో ఓ లుక్కేయండి..

రెగ్యులర్ మసాజ్

రెగ్యులర్ మసాజ్

గోరువెచ్చని ఆయిల్ తో రెగ్యులర్ గా స్కాల్ప్ కి మసాజ్ చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. హెయిర్ గ్రోత్ కి కూడా సహాయపడుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. కాబట్టి వారానికి 3 నుంచి 4 సార్లు కొబ్బరినూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

కొబ్బరిపాలు

కొబ్బరిపాలు

కొబ్బరిపాలు జుట్టుకి పోషణ అందించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జుట్టుని సాఫ్ట్ గా మారుస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు కొబ్బరి పాలను జుట్టుకి ప్యాక్ లా అప్లై చేస్తూ ఉంటే.. జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె

ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె

ఆల్మండ్ ఆయిల్, కొబ్బరినూనె, ఉసిరి నూనెలను మిక్స్ చేసి అప్లై చేయాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం కలిపితే.. చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. చుండ్రు ఎక్కువగా ఉన్నా జుట్టు రాలుతుంది. కాబట్టి చుండ్రుని వదిలిస్తే.. జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

జ్యూస్

జ్యూస్

వీట్ గ్రాస్ జ్యూస్ హెయిర్ ఫాల్ అరికట్టడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ గా వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం వల్ల వారంరోజుల్లో జుట్టు రాలడం తగ్గడాన్ని గమనించవచ్చు. అలోవెరా జ్యూస్ కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది.

మెంతులు, కొబ్బరినూనె

మెంతులు, కొబ్బరినూనె

కొబ్బరినూనెలో మెంతులను వేడిచేసి.. నూనెను వడకట్టి జుట్టుకి అప్లై చేయాలి. కుదుళ్ల వరకు మసాజ్ చేయాలి. దీనివల్ల జుట్టుకి పోషణ అంది జుట్టు రాలడం తగ్గుతుంది.

అలోవెరా జెల్

అలోవెరా జెల్

అలోవెరా జ్యూస్ మాత్రమే కాదు జెల్ ని జుట్టుకి, స్కాల్ప్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ లాస్ ని నివారించవచ్చు. అలోవెరా జెల్ తో జుట్టుకి మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వేపాకులు

వేపాకులు

కొన్ని వేప ఆకులు తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. దాన్ని జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం నివారించడంతో పాటు, స్కాల్ప్ ఆయిల్ తగ్గించి, ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.

తేనె, ఆలివ్ ఆయిల్ ప్యాక్

తేనె, ఆలివ్ ఆయిల్ ప్యాక్

తేనె, ఆలివ్ ఆయిల్, చెక్క పొడి కలిపి పేస్ట్ లా చేసుకుని.. జుట్టుకి పట్టించడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

హెయిర్ ప్యాక్స్

హెయిర్ ప్యాక్స్

తలస్నానానికి ముందు కొన్ని కొత్తిమీర ఆకులు తీసుకుని.. కొద్దిగా జ్యూస్ తీసి జుట్టుకి అప్లై చేయాలి. ఇలా చేస్తూ ఉంటే.. జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

ఫుడ్

ఫుడ్

జుట్టు రాలే సమస్యతో బాధపడే అబ్బాయిలు ఎక్కువ గింజలు, డ్రై ఫ్రూట్స్ బాదాం, పీనట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి.

English summary

7 Home Remedies to Control Hair Loss

7 Home Remedies to Control Hair Loss. Seems to have turned into a healthcare plague. Use the following home remedies for controlling hair loss.
Story first published: Thursday, June 2, 2016, 11:36 [IST]
Desktop Bottom Promotion