For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ హెయిర్ ను నివారించే 7 నేచురల్ రెమెడీస్

By Super Admin
|

జుట్టు విషయంలో ఎప్పుడూ ఫర్పెక్ట్ గా ఉండదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆయిల్ హెయిర్, డ్రై హెయిర్, రఫ్ హెయిర్ ఈ విధంగా ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరిని వెంటాడుతుంటుంది. అయితే, ఈ సమస్యను నివారించుకోవడానికి నేచురల్ రెమెడీస్ ఉన్నాయంటే అది ఆశ్చర్యంతో పాటు, ఆనందం కూడా కలుగుతుంది.

ఈ విషయం వినడానికి కూడా బాగుంటుంది. హోం మేడ్ హెయిర్ ఆయిల్స్ ను జుట్టులో ఆయిల్ నెస్ నివారించుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. జిడ్డుగా ఉన్న జుట్టు వల్ల అందమంతా తగ్గిపోతుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇటువంటి జుట్టును నివారించుకోవడానికి వివిధరకాలుగా ప్రయత్నిస్తుంటాము.

జుట్టు జిడ్డుగామారడానికి ముఖ్య కారణం తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, తలలో శ్వేధ రంద్రాలు విడుదల చేసే చెమట వల్ల కూడా తల జిడ్డుగామారుతుంది. జెనెటిక్స్, వాతావరణ స్థితులు, హార్మోనుల డిజార్ఢర్స్, కెమికల్స్ తో తయారుచేసిన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మొదలగు కొన్ని కారణాల వల్ల, జుట్టు జిడ్డుగా మారుతుంది.

అయితే తలలో ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి కావడం,జుట్టు జిడ్డుగా మారడానికి గల కారణాలను తెలుసుకున్నట్లైతే వెంటనే ప్రస్తుతం మీకున్న అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటారు . అలవాట్లతో పాటు కొన్ని హోం మేడ్ హెయిర్ మాస్క్ లను ఉపయోగించుకోవడం వల్ల జుట్టులో ఆయిల్ లేదా జిడ్డును నేచురల్ గా తొలగించుకోవచ్చు.

తరచూ తలస్నానం చేస్తుండాలి:

తరచూ తలస్నానం చేస్తుండాలి:

ఎక్సెస్ ఆయిల్ ను నివారించుకోవడం కోసం, తరచూ తలస్నానం చేస్తుండాలి అనుకుంటారు. కానీ ఇలా ఎక్కువ సార్లు తలస్నానం చేయడం వల్ల నేచురల్ ఆయిల్స్ ను తగ్గిపోతాయి, తర్వాత తలలో శ్వేధ రంధ్రాలు మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కాబ్టి, మూడు నాలుగు రోజులకొకసారి శుభ్రం చేసుకుంటే చాలు .

గోరువెచ్చని నీళ్ళు:

గోరువెచ్చని నీళ్ళు:

జుట్టుకు, తలకు వేడినీళ్ళు ఏమాత్రం సరిపోవు, ఇది తలలో పొట్టువంటి పదార్థం ఏర్పడేలా చేస్తుంది. జుట్టు డ్యామేజ్ అవుతుంది, జుట్టునిర్జీవంగా మారుతుంది చల్లటి నీరు బాడీ టెంపరేచర్ ను చల్లబర్చడంతో పాటు, జుట్టుకు కు ఇది ఒక నేచురల్ , సులభమైన హోం రెమెడీ.

 కండీషనర్:

కండీషనర్:

ముడులు, చిక్కు కలిగిన జుట్టుకు కండీషనర్ అప్లై చేయడం మంచిది. జుట్టుకు మరియు జుట్టు చివర్ల వరకూ ఏ ఏపదార్థాలను ఉపయోగించినా సరి తలకు అంట కుండా నివారించాలి.

వెనిగర్ టానిక్ :

వెనిగర్ టానిక్ :

వెనిగర్ లో అసిడిక్నేచరల్ కలిగి ఉంటుంది. మరియు ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అత్యధింకగా ఉన్నాయి.ఇవి తలను శుభ్రంచేయడంతో పాటు, తలలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ ను కప్పు నీటిలో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు , జుట్టుకు అప్లై చేయాలి. 1 నిముసాలు డ్రైగా మారిన తర్వాత షాంపుతో తలస్నానంచేయాలి. ప్రతి సారి ఈ ఆయుర్వేదిక్ రెమెడీని ఫాలో అయ్యి, షాంపుతో తలస్నానం చేస్తే మంచిది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. తలలో ఎక్సెస్ సెబమ్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది. తలలో ఫ్రీరాడికల్స్ నుండి జుట్టుకు రక్షణ కల్పిస్తుంది.

ఎలా పనిచేస్తుంది: ఉపయోగించిన టీ బ్యాగ్స్ ను ఒక కప్పు వేడి నీటిలో మరిగించాలి,, తక్కువ మంటలో వేడి చేయాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత టీవాటర్ ను తలకు అప్లై చేసిమసాజ్ చేసి 5 నిముషాల తర్వాత మంచి నీటితో తలస్నానం చేయాలి. జిడ్డు జుట్టును తొలగించుకోవడానికి ఈ నేచురల్ పద్దగి గ్రేట్ గా సహాయపడుతుంది.

అలోవెర మాస్క్:

అలోవెర మాస్క్:

అలొవెర మాస్క్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. అలోసిన్ , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఇవన్నీ తలలో ఎక్సెస్ ఆయిల్ ఉత్పత్తి కాకుండా నివారిస్తాయి . తలలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి చుండ్రును నివారిస్తాయి.

ఎలా పనిచేస్తుంది: అలోవెరను కట్ చేసి లోపలి నుండి జెల్ తీసి, ఫ్రెష్ గా తీసిన నిమ్మరసంను మిక్స్ చేసి, కాటన్ తో తలకు అప్లై చేయాలి. 29 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ హోం మేడ్ హెయిర్ మాస్క్ తో ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జిడ్డు సమస్య తగ్గుతుంది.

టీట్రీ ఆయిల్ స్ప్రే:

టీట్రీ ఆయిల్ స్ప్రే:

టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి తలలో ఆయిల్ ఉత్పత్తిని కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, తలలో చుండ్రులేకుండా చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

2 టేబుల్ స్పూన్ల టీట్రీ ఆయిల్ ను ఒక కప్పు డిస్టిల్ వాటర్ తో మిక్స్చేసి, స్ర్పే బాటిల్లో నింపి, అవసరమైనప్పుడు తలకు స్ప్రే చేసి, కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి.

English summary

7 Natural Ways To Stop Your Hair From Getting Oily

Hair that is limp, flat and oily, well, not exactly our idea of a perfect hair, is it? What if we say, there are natural remedies for oily hair that will keep your mane fluffy like cotton candy, not one but even after five days of shampooing?
Desktop Bottom Promotion