For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రికి రాత్రే..సెలెబ్రెటీల హెయిర్ లా మీ జుట్టు మారిపోవాలంటే....సింపుల్ టిప్స్

|

అందమైన సిల్కీ అండ్ సాప్ట్ హెయిర్ కలిగి ఉండటం ఒక వరమే. అలా లేని వారికి ఒక డ్రీమ్ . అయితే అలాంటి హెయిర్ పొందడానికి ప్రస్తుత రోజుల్లో ప్రొఫిషనల్ హెయిర్ స్టైలిస్ట్ ద్వారా రాత్రికి రాత్రే హెయిర్ స్టైల్స్ ను మార్చేసుకుంటున్నారు. అవును ఇది అక్షరాల నిజం, నిన్న ఉన్న హెయిర్ స్టైలో ఈరోజుండదు, మరో కొత్త హెయిర్ స్టైల్ తో కనబడుతుంటారు .

ఏదేమైనా, రొటీన్ గా తీసుకొనే జాగ్రత్తలతో అందమైన, సాప్ట్ అండ్ షైనీ హెయిర్ పొందవచ్చు , అందుకు ఇన్ స్టాంట్ హెయిర్ కేర్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ చిట్కాలను కనుకు ప్రతి రోజూ నిద్రించడానికి ముందు ప్రయత్నిస్తే మరుసటి రోజు ఉదయానికల్లా, అందమైన, సాఫ్ట్, షైనీ హెయిర్ ను పొందుతారు.

గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హోం రెమెడీస్

హెయిర్ బ్యూటీషియన్ నిపుణుల ప్రకారం నైట్ టైమ్ హెయి స్టైలింగ్ వల్ల, ఉదయం సమయం ఆదా అవుతుంది. మరియు ఇది అందమైన కేశసౌందర్యంతో కొత్తగా కనబడుటకు సహాయపడుతుంది. రోజులో చర్మ ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, అదేవిధంగా కేశ సంరక్షణ, జాగ్రత్తలు కూడా చాలా అవసరం అవుతాయి.

సెలబ్రెటీలు, మరియు మోడల్స్ కలిగిన సిల్కీ అండ్ షైనీ హెయిర్ స్టైల్ మరియు హేయిర్ ను ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సిల్కీ హెయిర్ అంటే హెల్తీ హెయిర్. మీ జుట్టు చిట్లడం మరియు డ్రైగా మారడం గుర్తించినట్లైతే అందుకు కేశాలలోని నేచురల్ ఆయిల్స్ కోల్పోవడమే అని గుర్తించాలి.

జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు

మరి మోడల్స్, లేదా సెలబ్రెటీల్లా సిల్కీ అండ్ షైనీ హెయిర్ తో మీ జుట్టు కూడా మెరిసిపోవాలంటే ఈ క్రింది 8 అద్భుత చిట్కాలను అనుసరించాల్సిందే....

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

ఈ 8 అద్భుతమైన చిట్కాలలో ఇది ఒకటి. కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె రాత్రికి రాత్రే మీ జుట్టును సిల్కీగా మార్చేస్తుంది . రాత్రుల్లో జుట్టుకు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల ప్రతి ఒక వెంట్రుకకు నూనె బాగా అంటుంది. అరగంట తర్వాత దువ్వెనతో దువ్వుకొని, గట్టి ముడి వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపుతో తలస్నానం చేయడం ద్వారా సిల్కీ అండ్ షైనీ హెయిర్ పొందవచ్చు.

 పెరుగు మరియు కలబంద మాస్క్:

పెరుగు మరియు కలబంద మాస్క్:

కలబంద రసంలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఈ మాస్క్ ను రాత్రుల్లో తలకు అప్లై చేసి,షవర్ క్యాప్ ధరించి, మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల సిల్కీ హెయిర్ పొందుతారు.

పిల్లో కవర్స్:

పిల్లో కవర్స్:

శుభ్రంగా ఉన్న పిల్లో కవర్స్ మాత్రమే ఉపయోగించాలి. సాటిన్ పిల్లో కవర్స్ ను ఉపయోగించడం వల్ల, మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే జుట్టు సాఫ్ట్ గా మరియు సిల్కీగా కనబడుతాయి.

కండీషనర్:

కండీషనర్:

ఈ 8 చిట్కాలలో మరో అద్భుతమైన చిట్కా తడి జుట్టుకు కండీషనర్ అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయం తలస్నాం చేసుకోవాలి. కండీషన్ అప్లై చేసుకొన్న తర్వాత తల దువ్వుకొని, కేశాలు చివరన ముడి వేసి లూజ్ హెయిర్ తో నిద్రించడం వల్ల , మరుసటి రోజు ఉదయం చిక్కు వదలడంతో పాటు, మంచి షైనింగ్ ఉంటుంది.

బీర్:

బీర్:

బీర్ లో విటమిన్ బి మరియు ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవి హెయిర్ ఫోలీసెల్స్ ను హెల్తీగా ఉంచుతాయి మరియు తలలో క్యుటికల్స్ ను మూసుకొనేలా చేస్తాయి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మాక్సిమమ్ షైనింగ్ అందుతుంది.

గుడ్డుపచ్చసొన, అవొకాడో మాస్క్:

గుడ్డుపచ్చసొన, అవొకాడో మాస్క్:

బాగా పండిన అవొకాడోను మెత్తగా పేస్ట్ చేసి అందులో గుడ్డులోని పచ్చసొన వేసి, ఈ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయాలి. తర్వాత జుట్టు ముడి వేసి, షవర్ క్యాప్ ధరించాలి. తర్వాత రోజు ఉదయం షాంపుతో తలస్నానం చేయడం వల్ల సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ పొందవచ్చు.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ తీసుకొని, దీన్ని డ్రై హెయిర్ కు అప్లై చేయాలి. ముఖ్యంగా జుట్టు చివర్లు. తలమాడుకు అప్లై చేయకూడదు. తర్వాత పల్చగా ఉన్న టవల్ ను తలకు చుట్టి, రాత్రంతా అలాగే ఉంచాలి. తర్వాత రోజు ఉదయం షాంపుతో తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది.

సల్ఫేట్ ఫ్రీషాంపు:

సల్ఫేట్ ఫ్రీషాంపు:

ఈ అద్భుతమైన 8 చిట్కాలలో ఇది ఒకటి. రెగ్యులర్ గా మీరు ఉపయోగించే షాంపులు కాకుండా సల్ఫేట్ లేనటువంటి షాంపుతో తలస్నానం చేయడంవల్ల మీ జుట్టు షైనింగ్ ను తిరిగి తీసుకొస్తుంది.

English summary

8 Awesome Ways To Make Hair Silky Overnight

8 Awesome Ways To Make Hair Silky Overnight, Waking up to those glamorous locks may look like a dream; however, professional hairstylists insist that you can get luscious and silky mane in just one night. Yes, you read it right!
Desktop Bottom Promotion