Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మీకు బట్టతల రాబోతోందనడానికి హెచ్చరికలివే.. బీ అలర్ట్..!
జుట్టు దువ్వుకున్న తర్వాత మీ దువ్వెన చూసి అవాక్కవుతున్నారా ? కుచ్చులు కుచ్చులుగా ఊడిపోయే జుట్టు చూస్తే ఎవరికైనా షాకింగ్ గానే ఉంటుంది. ఈ సమస్య మీ ఒక్కరిది మాత్రమే కాదు.. చాలామంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలిపోతోందని డీలాపడుతున్నవాళ్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం ఒత్తిడే అని.. బ్యూటీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
ఒత్తిడి కాకుండా.. తీసుకునే ఆహారం, జుట్టు సంరక్షణకు ఫాలో అయ్యే పద్ధతులు జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు హోం రెమిడీస్ ఫాలో అవడం వల్ల.. సమస్య తగ్గించుకోవచ్చు. హోం రెమిడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి హాని కూడా చేయవు. కాబట్టి ఇలాంటి పద్ధతుల ద్వారా జుట్టు పెరుగుతుంది.
అలాగే మన అలవాట్లు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వారానికి రెండుసార్ల కంటే ఎక్కువ శుభ్రం చేయకూడదు. హోంమేడ్ కొకనట్ ఆయిల్స్ జుట్టుకి, తలకు బాగా పట్టించడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే షాంపూలు, కండిషనర్స్ కూడా న్యాచురల్ వి వాడటం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. దీంతోపాటు ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా అవసరం.
మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అనడానికి కొన్ని సంకేతాలున్నాయి. అలాంటి హెచ్చరికల గురించి ఇప్పుడు చర్చిద్దాం.. వీటిలో ఏదైనా.. మీలో గుర్తిస్తే.. మీరు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇంతకీ జుట్టు రాలుతోందనడానికి సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..

పల్చగా
మీ జుట్టు మధ్య చేతి వేళ్లు పెట్టాలి. అలా తలపై వేళ్లు పాకినట్టు చేసినప్పుడు.. మీ తలమాడు భాగం తగులుతోంది అంటే.. మీ జుట్టు పల్చబడిపోతోందని అర్థం. కాబట్టి వెంటనే పరిష్కార మార్గం వెతుక్కోవడం మంచిది.

బట్టతల
బట్టతల సంకేతాలు మీ జుట్టు రాలుతోంది అనడానికి చాలా సాధారణ హెచ్చరిక. కొన్ని సందర్భాల్లో ఈ స్పాట్ చాలా దురదగా, రెడ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ జుట్టు మధ్యలో లేదా తలలో ఖాళీ ప్రాంతాన్ని గుర్తించారంటే.. వెంటనే జుట్టు పెరుగుదలకు తోడ్పడే హోం రెమిడీస్ ఫాలో అవడం అవసరం.

జుట్టు రాలడం
హఠాత్తుగా మీ జుట్టు ఎక్కువగా రాలిపోతోంది అంటే.. వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ సమస్యను గుర్తించిన వెంటనే.. జుట్టుకి వారానికి రెండుసార్లు ఆయిల్ పెట్టుకోవడం మొదలుపెట్టాలి. ఇలా చేయడం వల్ల.. మీ సమస్య వెంటనే తగ్గిపోతుంది.

హెయిర్ లైన్
హెయిర్ లైన్ అంటే.. తలమాడు భాగంలో ఎక్కడైనా.. ఖాళీగా లైన్ కనిపించిందంటే.. మీ జుట్టు రాలిపోతోందని సంకేతం. ఉదయం నిద్రలేచిన తర్వాత మీ దిండుపై జుట్టు రాలిందని గుర్తిస్తే.. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. మీ జుట్టు రాలకుండా.. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications