For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టుకు కలరింగ్ ఇచ్చే నేచురల్ హోం మేడ్ హెయిర్ డైస్...

By Super Admin
|

మీ వంట గదిలో వంటకు ఉపయోగించే పదార్థాలు మీ జుట్టు యొక్క రంగు అందంగా మార్చుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. మార్కెట్లో కమర్షియల్ గా అందుబాటులో ఉండే హెయిర్ డైస్ ఉపయోగించడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే . అలా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే, హెర్బల్ హోం రెమెడీస్ చాలా సురక్షితమైనవి. మీకు నచ్చిన హెయిర్ కలర్స్ పొందడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి.

ఈ హోం రెమెడీస్ ద్వారా నేచురల్ హెయిర్ కలర్ మరియు జుట్టు స్మూత్ గా మరియు షైనీగా మార్చుకోవచ్చు . కాబట్టి, హెయిర్ ట్రీట్మెంట్స్ కోసం పెద్దమొత్తంలో సలోన్ కు ఎక్కువగా ఖర్చుచేయడం కంటే, ఇలా చౌకన మరియు ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం . జుట్టు సంరక్షణలో కెమికల్ ప్రొడక్ట్స్ మరియు హీట్ ట్రీట్మెంట్ జుట్టు ఆరోగ్యానికి అంత మంచిది కాదు .

కాబట్టి, మన వంటగదిలో వివిధ రకాల నేచురల్ హోం రెమెడీస్ కలిగి ఉన్నాయి. చుండ్రు, డ్రై హెయిర్, డల్ హెయిర్ నివారించడంలో కోసం ఇవి చాలా ఎఫెక్టిగా పనిచేస్తాయి . జుట్టు సంరక్షించుకోవడంలో జుట్టును ఆరోగ్యాంగా ఉంచుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాల నుండి మూలికలు మరియు టీలను జుట్టుకు ఉపయోగిస్తున్నారు .

ఇంట్లోనే జుట్టుకు రంగు ఏవిధంగా వేసుకోవాలి? మీకు నచ్చిన హెయిర్ కలర్ వేసుకోవడం కోసం, జుట్టుకు మంచి కండీషనర్ కోసం, జుట్టును స్ట్రాంగ్ గా మార్చుకోవడం కోసం , జుట్టుకు మరింత షైనింగ్ ను అందివ్వడం కోసం వంట గదిలోని పదార్థాలను కొన్నింటిని మీకు బోల్డ్ స్కై పరిచయం చేస్తున్నది. వీటిలో డ్రై అండ్ ఫ్రెష్ హెర్బ్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు..

 హెన్నా:

హెన్నా:

పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న ఈ పద్ధతి ద్వారా జుట్టుని నల్లగా మార్చుకుంటున్నారు. కలర్ ఫుల్ వర్షన్స్ లో హెన్నా అందుబాటులో ఉంటుంది. బర్గండీ, వుడ్ బ్రౌన్ కలర్ లో ఇవి ఉంటాయి. కానీ.. కలర్ లెస్ వర్షన్ లో కూడా.. హెన్నా అందుబాటులో ఉంటుంది. ఇది.. జుట్టుకి కండిషనింగ్ అందిస్తుంది. అలాగే జుట్టుకి మాయిశ్చరైజర్ ని కూడా అందిస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో బ్లీచింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం మీకున్న రంగు కంటే మరింత లైట్ గా మార్చుకోవాలంటే నిమ్మరసం ఉపయోగపడుతుంది. నిమ్మరసంను తలకు అప్లై చేసి ఎండలో కొద్దిసేపు నిలబడుకోవాలి. ఇది మీ జుట్టును లైట్ గా మార్చుతుంది.

బ్లాక్ టీ:

బ్లాక్ టీ:

న్యాచురల్ గా జుట్టుకి బ్లాక్ డై వేసుకోవడానికి ఇది చాలా ఎఫెక్టివ్ టిప్. బ్లాక్ టీ తీసుకుని ఉడికించాలి. అది నల్లగా మారేంతవరకు ఉడికించాలి. ఇప్పుడు జుట్టుని పోర్షన్లుగా విడదీసి.. జుట్టుకి పట్టించాలి. దాన్ని వాష్ చేసుకోకుండా.. జుట్టు నల్లగా అయ్యేంతవరకు.. తరచుగా అప్లై చేస్తూ ఉండాలి.

చమోమెలీ టి:

చమోమెలీ టి:

జుట్టు రాగి కలర్ లో కోరుకుంటున్నట్లైతే అందులకు చమోమెలి లేదా కాంటిప్ టీని ఎంపిక చేసుకోవాలి. అంతే కాదు ఇది మీ జుట్టును బ్రైట్ గా మర్చుతుంది . ఈ టీ తయారుచేయడానికి ఆకులను మరియు పువ్వులను నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

బీట్ రూట్:

బీట్ రూట్:

జుట్టుకి రెడ్ కలర్ తీసుకురావడానికి ఇంట్లోనే ప్యాక్ ప్రయత్నించవచ్చు. బీట్ రూట్, క్యారట్ రెండింటినీ మిక్స్ చేసి రసం తీసి.. జుట్టుకి పట్టించడం వల్ల రెడ్ షేడ్ పొందవచ్చు. ఈ రసాన్ని జుట్టు మొత్తానికి పట్టించి.. షవర్ క్యాప్ వేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

క్యారెట్ జ్యూస్ జుట్టుకు స్మూతింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. జుట్టుకు నేచురల్ కలర్ అందివ్వడానికి ఇది మరో హెయిర్ డై.

హైబిస్కస్:

హైబిస్కస్:

న్యాచురల్ బ్లాక్ హెయిర్ డై తయారు చేసుకునే న్యాచురల్ పద్ధతుల్లో ఇది ఒక ఎఫెక్టివ్ రెమిడీ. మందారం పువ్వుల రెక్కలు తీసి.. మరుగుతున్న నీటిలో వేయాలి. తర్వాత వడకట్టి.. చల్లార్చాలి. ఇప్పుడు.. దీన్ని జుట్టుకి మసాజ్ చేయాలి. ఇది జుట్టుకి న్యాచురల్ కలర్ ని తీసుకొస్తుంది. అలాగే జుట్టుకి, మాడుకు పోషకాలను అందిస్తుంది.

కాఫీ:

కాఫీ:

బ్లాక్ కాఫీ పౌడర్ ని నీటిలో కలిపి ఉడికించాలి. బాగా స్ట్రాంగ్ గా తయారయిన తర్వాత చల్లార్చాలి. ఇప్పుడు జుట్టుని శుభ్రపరుచుకుని, ఈ కాఫీ డికాషన్ ని పట్టించాలి. తర్వాత షవర్ క్యాప్ తో కవర్ చేసుకుని అరగంట ఉండాలి. ఇలా.. వారానికి రెండు సార్లు చేస్తే.. వేగంగా జుట్టు నల్లబడుతుంది.

వాల్ నట్స్ షెల్స్ :

వాల్ నట్స్ షెల్స్ :

వాల్ నట్స్ కి ఉండే టెంక జుట్టుని నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుందని ఎప్పుడైనా ఊహించారా ? వాల్ నట్ టెంకను పొడి చేసి.. ఉడుకుతున్న నీటిలో మిక్స్ చేయాలి. అరగంటపాటు బాగా మరగనివ్వాలి. చల్లారిన తర్వాత వడకట్టి.. తెల్లబడిన జుట్టుకి ఈ లిక్విడ్ అప్లై చేయాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే వేడి నీటితో శుభ్రపరుచుకోకూడదు.

English summary

All-Natural Hair Dyes To Colour Your Hair!

Sometimes, it gets really boring to stick with your usual hair colour. We all want a change, don't we? But, chemicals in hair dyes can be really, really harsh on your hair and skin. That's why, we'll be sharing with you some natural hair dyes that you can use to colour your hair.
Story first published: Friday, September 30, 2016, 18:16 [IST]
Desktop Bottom Promotion