For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెట్టింపు వేగంతో.. జుట్టు పెరగడానికి సూపర్ సొల్యూషన్..! జామ ఆకులు..!!

న్యాచురల్ గా.. చాలా ఎఫెక్టివ్ గా జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత ఔషధం జామాకులు. జామ ఆకుల్లో దాగున్న ఔషధ గుణాలు, బ్యూటి బెన్ఫిట్స్ జుట్టు రాలడాన్ని వేగంగా తగ్గించడమే కాకుండా.. జుట్టు రీగ్రోత్ అవుతుంది

By Swathi
|

జుట్టు రాలడాన్ని వంద శాతం తగ్గిస్తుంది అంటే.. కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే.. ఈ న్యాచురల్ రెమిడీ.. మీ జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ అరికడుతుంది. ప్రస్తుత రోజుల్లో వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. న్యాచురల్ గా.. చాలా ఎఫెక్టివ్ గా జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత ఔషధం జామాకులు. జామ ఆకుల్లో దాగున్న ఔషధ గుణాలు, బ్యూటి బెన్ఫిట్స్ జుట్టు రాలడాన్ని వేగంగా తగ్గించడమే కాకుండా.. జుట్టు రీగ్రోత్ కి సహాయపడతాయి.

guava leaves for hair growth

సైంటిస్ట్ ల ప్రకారం, జామ ఆకులు.. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి న్యాచురల్ సొల్యూషన్. అలాగ జుట్టు మళ్లీ పెరగడానికి ఇందులో ఉండే.. విటమిన్ బి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు విటమిన్ బి చాలా అవసరం. అలాగే.. డెంగ్యూతో బాధపడేవాళ్లలో ప్లేట్ లెట్స్ పెంచడంలోనూ.. జామాకులు సహాయపడతాయి.

జామఆకుల్లో ఉండే విటమిన్స్ జుట్టుని స్ట్రాంగ్ గా మార్చడానికే కాదు.. యాంటీ మైక్రోబైల్ గుణాలు కూడా ఉంటాయి. ఇది స్కాల్ప్ ని క్లెన్స్ చేసి, అదనపు ఆయిల్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. చుండ్రుకి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. విటమిన్ సి కొలాజెన్ యాక్టివిటీని మెరుగుపరిచి.. జుట్టు ఎలాస్టిసిటీని పెంచుతుంది.

జామ ఆకులు జుట్టు రాలడాన్ని స్టాప్ చేయడంతో పాటు, జుట్టు రెండింతలు వేగంగా, బలంగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు షైనీగా మారుతుంది. అయితే.. జామ ఆకులతో జుట్టుని శుభ్రం చేసుకోవాలి. కనీసం మూడు నెలల పాటు ఈ రెమెడీ ప్రయత్నిస్తే.. కంపల్సరీ ఫలితాలు పొందుతారు. మరి ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా గుప్పెడు జామ ఆకులు తీసుకుని శుభ్రం చేసుకోవాలి. దుమ్ము, ధూళి ఏమాత్రం లేకుండా.. క్లీన్ గా కడిగిపెట్టుకోవాలి.

స్టెప్ 2

స్టెప్ 2

1 లీటర్ నీళ్లను ఒక గిన్నెలో తీసుకుని సన్నని మంటపై మరిగించాలి. 5 నిమిషాలు సన్నని మంటపై వేడి చేయాలి. నీళ్లు ఉడికేటప్పుడు.. జామ ఆకులు కలపాలి. ఇప్పుడు మరో 20 నిమిషాలు సన్నని మంటపై జామ ఆకులను ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

స్టెప్ 3

స్టెప్ 3

ఈ మిశ్రమం గది టెంపరేచర్ లో చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.

స్టెప్ 4

స్టెప్ 4

వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెన తీసుకుని.. చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. దీనివల్ల హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది.

స్టెప్ 5

స్టెప్ 5

స్కాల్ప్ కి, కుదుళ్లకు, జుట్టుకి ఈ మిశ్రమం అంటేలా స్ప్రే చేయాలి. అలాగే జుట్టు చివర్లకు కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. జుట్టు మొత్తం ఈ మిశ్రమంలో నాననివ్వాలి.

స్టెప్ 6

స్టెప్ 6

ఇప్పుడు స్కాల్ప్ ని చేతివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. బాగా తలకు పట్టే విధంగా కాసేపు మసాజ్ చేస్తే.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

స్టెప్ 7

స్టెప్ 7

ఒక గంట లేదా రాత్రంతా ఆ మిశ్రమం తలకు ఉండేలా జాగ్రత్తపడాలి. మైల్డ్ షాంపూ ఉపయోగించి జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

English summary

Apply This 1 Tonic Before Hair Wash & Make Your Hair Grow 2x Faster! Try It!

Apply This 1 Tonic Before Hair Wash & Make Your Hair Grow 2x Faster! Try It! This 1 magical hair tonic can make your hair twice as thicker and longer!
Desktop Bottom Promotion