For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు సంరక్షణకు బనానా హెయిర్ ప్యాక్

By Staff
|

ప్రపంచం మొత్తానికి హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్. హెయిర్ ఫాల్ అరికట్టడానికి మనం ఏదో ఒకటి చేయాలనుకొంటాం. ఇంకా హెయిర్ బాగా పెరగాలని ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాం. కానీ, కొన్ని చిట్కాలు మరియు చికిత్సలు మాత్రమే మంచి ఫలితాలను చూపెడుతాయి. హెయిర్ ప్యాక్ చాలా సాధారణ పద్దతి. దీన్ని ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు. హెయిర్ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కేశాలు మెత్తగా, మందంగా పెరుగుతాయి.

హెయిర్ ప్యాక్ లో చాలా రకాలు ఉన్నాయి. అందులోనూ వివిధ రకాల వస్తువులు ఉదా పెరుగు, తేనె, వెనిగర్, గుడ్డు, హెన్నా, నిమ్మ వంటి వాటితో హెయిర్ ప్యాక్స్ వేసుకుంటుంటాం. అలాగే బనానా(అరటితో)హెయిర్ ప్యాక్ మీరెప్పుడైనా విన్నారా? అరటి పండులో హెయిర్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇది పొడిబారిన, చిక్కుబడిన మరియు రఫ్ హెయిర్ ను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. బనానా హెయిర్ మాస్క్ ఇంకా కేశాలను మృదువుగా మరియు సున్నితంగా పట్టుకుంటే జారిపోయేలా తయారవుతాయి.

Banana masks to remove split ends in hair

ఈ సీజన్ లో ఏర్పడే జుట్టు సమస్యలు చుండ్రు, తల దురద, పొడిబారిన జుట్టు వంటి సాధారణ సమస్యలకు మంచి నివారణోపాయని. అందుకే బనానా హెయిర్ ప్యాక్ చాలా పాపులర్ అయింది. కాబట్టి మీ జుట్టు రాలడాన్ని తగ్గించి, మృదువైన కేశాలను పొందాలనుకుంటే కొన్ని బనానా హెయిర్ ప్యాక్ లను తలకు ఎలా వేసుకోవాలో క్రింది పద్దతులను చూడండి....

బనానా -గుడ్డు హెయిర్ ప్యాక్: కేశాలను మృదువుగా, సిల్కీగా మరియు ఆరోగ్యంగా ఉంచే వాటిలో గుడ్డు ప్రధానమైనది. గుడ్డును, బనానాను ఉపయోగించి పొడిబారిన కేశాలను నివారించి సున్నితమైన జుట్టును పొందవచ్చు. గుడ్డు, బనానా మిశ్రమాన్నికురులు, తలమాడుకు పట్టించి ఒక గంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల, సిల్కీ మరియు షైనీ హెయిర్ మీ సొంతం అవుతుంది.

అరటి మరియు కొబ్బరి నూనె: ఒక అరటి పండును మెత్తగా చేసి, అందులో రెండు చెంచాల కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి , దీన్ని జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి . ఈ ట్రీట్మెంట్ చిట్లిన జుట్టును నివారించడం మాత్రమే కాదు, ఇది కూడా జుట్టును ఒత్తుగా మార్చుతుంది నేచురల్ లుక్ ను అందిస్తుంది.

Banana masks to remove split ends in hair

అరటి మరియు తేనె: జుట్టుకు ఎక్కువగా రాలిపోతుంటే , జుట్టు రాలడం అరకట్టడానికి బెస్ట్ పదార్థం తేనె. అరటిపండును మెత్తగా చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి హెయిర్ మాస్క్ లాగా అప్లై చేయాలి. ఇది చిట్లిన జుట్టును నివారిస్తుంది , డ్రై హెయిర్ ను నివారిస్తుంది.

అరటి మరియు ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ హెయిర్ మాయిశ్చరైజర్ ను ప్రమోట్ చేస్తుంది . మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది . అరటిపండు గుజ్జుతో మసాజ్ చేయడం వల్ల డ్రైనెస్ ను నివారించి జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది.

అరటి మరియు పాలు: ఒక కప్పు పాలలో మెత్తగా ఉండే అరటి పండుగుజ్జు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . తలను దువ్వుకొని చిట్లిన జుట్టును కట్ చేయాలి. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది.

Banana masks to remove split ends in hair


అరటి మరియు పెరుగు: అరటిపండు గుజ్జులో పెరుగు మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి . ఇలా చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది . తర్వాత తలను పూర్తిగా దువ్వుకోవాలి . ఈ మిశ్రమంలో తల బాగా నానిన 20 నిముషాల తర్వాత తలస్నానంచేసుకోవాలి.

అరటి మరియు బొప్పాయి: బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీ జుట్టును ఒత్తుగా మార్చాలంటే , బొప్పాయి హెయిర్ మాస్క్ ను తయారుచేయాలి. బొప్పాయి గుజ్జులో అరటి గుజ్జు వేసి మిక్స్ చేసితలకు మాస్క్ వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత వాష్ అవుట్ చేసుకోవాలి.

English summary

Banana masks to remove split ends in hair

Every time you visit a salon, doesn't the hair dresser cut off those split ends, calling your hair dry and rough too? Well, with this effective home remedy at hand, there will be no need of you visiting a hair dresser to trim your split ends.
Desktop Bottom Promotion