Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఉల్లిపాయ, తేనెతో జుట్టుకి కలిగే ప్రయోజనాలు
మన వంటింటి నేస్తం ఉల్లిపాయ. ఇది లేకుండా వంటకం లేదు.. రుచి ఉండదు. ఉల్లి వంటలకు మాత్రమే కాదు, సౌందర్య పోషణలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టుకు మాస్క్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం నివారించబడుతుంది.
అంతే కాదు రకరకాలుగా ఉపయోగపడే ఈ ఉల్లి పాయ కీటక నివారినిగా కూడా ఉపయోగపడుతుంది. పురుగులు కుట్టినప్పుడు నొప్పి, మంట నివారిణిగా దీన్ని ఉపయోగిస్తారు. ముఖంపై వేడి వల్ల వచ్చే మొటిమలను నివారించుకోవడానికి ముఖానికి రుద్దుకుంటారు. ఇక తలకు పట్టించి, జుట్టు రాలే సమస్యలను నివారించుకోవచ్చు. మరి ఉల్లిరసం, తేనె జుట్టుకు ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం...

జుట్టు రాలడం
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయను ఉపయోగించడం పాత పద్దతి మాత్రమే కాదు. హార్మోనుల అసమతుల్యతలు, వయస్సు పెరగడం, మందులప్రభావం, వాతావరణం మొదలగు కారణాలవల్ల రాలే జుట్టు ను నివారించడంలో ఇది గ్రేట్ నేచురల్ రెమెడీగా ఉపయోగిస్తారు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టురాలడం తగ్గిస్తుంది.

హెయిర్ ఫాల్ కి ఉల్లిపాయ ఎలా ఉపయోగించాలి ?
ఉల్లిపాయలో మినిరల్స్, న్యూట్రీషియంట్స్ అధికంగా ఉంటాయి. ఉల్లిపాయ రసం హెయిర్ ఫోలిసెల్స్ కు పోషణ అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీన్ని ఉపయోగించిన తర్వాత వెంటనే ఫలితాలను చూపించకపోవచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత తప్పనిసరిగా మంచి ఫలితాలను మీరు గమనించవచ్చు.

ఉల్లిరసాన్ని తయారుచేసుకోవడం:
ఉల్లిపయను పొట్టు తీసి తురుముకోవాలి. తురిమిన ఉల్లిపాయను పలుచని బట్టలో వేసి రసాన్ని పిండుకోవాలి. లేదంటే మరో ఉత్తమ పద్దతి, ఉల్లిపాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి రసాన్ని తీసుకోవాలి.

అలర్జీ కలుగుతుందో లేదో గుర్తించాలి:
ఉల్లిపాయ రసంతో పాటు కొన్ని నేచురల్ పదార్థాలు జోడించి ఉపయోగించడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ముందు చేతి మీద కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎలాంటి చీకాకులు లేకుంటే జుట్టుకు పెట్టుకోవచ్చు.

పద్దతి:
ఉల్లిపాయ రసాన్ని నేరుగా తలకు పట్టించి 30 నిముషాలు అలాగే ఉంచాలి. ఏదైనా దురద, లేదా చీకాకు కలిగినప్పుడు వెంటనే స్నానం చేయాలి. లేదంటే అలాగే ఉండనిచ్చిన తలకు క్యాప్ లేదా టవల్ చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రసాన్ని బాగా గ్రహిస్తుంది. అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

ఉల్లిపాయ, తేనె:
ఉల్లిపాయ రసాన్ని నేరుగా అప్లై చేసుకోవచ్చు లేదా తేనె మిక్స్ చేసి తలకు పట్టించవచ్చు. మార్కెట్లో రెడీమేడ్ పదార్థాలకన్నా, ఇలా ఇంట్లో తయారుచేసుకొనే జుట్టు సంరక్షణ ఉత్పత్తుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు .

జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ, తేనె రిసిపి:
జుట్టు రాలడం నివారించడానికి , జుట్టు పల్చబడటం అరికట్టడానికి కొద్దిగా ఉల్లిపాయ రసం, తేనె మిక్స్ చేసి తలకు పట్టించాలి. రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు. లేదా తలస్నానానికి ఒక గంట ముందు పెట్టుకుంటే కూడా సరిపోతుంది. ఈ పద్దతిని వారానికొకసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది అందమైన , పొడవైన జుట్టు మీ సొంతమవుతుంది.



Click it and Unblock the Notifications