Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మిరాకిల్ !! హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టె సింపుల్ ప్యాక్స్.. !
హెయిర్ లాస్..!! ఇది అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరినీ ఇబ్బందికి గురి చేసే సమస్య. ఒకరకంగా చెప్పాలంటే.. జుట్టు రాలుతోంది అంటే.. తీవ్ర ఒత్తిడికి కూడా లోనయ్యే ఛాన్స్ ఉంది. కానీ.. ఇంతగా చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే.. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి అనేక పరిష్కారాలున్నాయి. కాస్త ఓపిక చేసుకుని కేర్ తీసుకుంటే.. జుట్టు రాలడం ఆపడం తేలికే.
జుట్టు రాలడానికి మనం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్, కాలుష్యం, కెమికల్స్, ఆందోళన, హార్మోనల్ డిజార్డర్, మందులు. ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అంతేకాదు.. నిద్రపోయే విధానం కూడా జుట్టు రాలడానికి కారణమవుతోంది. కారణమేదైనా.. జుట్టు రాలకుండా వెంటనే కేర్ తీసుకోకపోతే.. మొత్తానికే మోసం వచ్చే అవకాశముంది. కాబట్టి.. ఇక్కడ ఉన్న సింపుల్ టిప్స్ చాలా ఎఫెక్టివ్ గా, న్యాచురల్ గా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడే చెక్ చేసి.. ఫాలో అయిపోండి.

ఉసిరి ప్యాక్
హెయిర్ ఫాల్ తగ్గించటాన్ని, జుట్టు తెల్లబడటాన్ని అరికట్టడంలో ఉసిరి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి.. జుట్టు కుదుళ్లని బలపరిచి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. 3 నుంచి4 ఉసిరికాయలను ఒక కప్పు వేడినీళ్లలో గంటపాటు నాననివ్వాలి. అది మెత్తగా అయిన తర్వాత విత్తనాలు తీసేసి.. మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలిపాలి. జుట్టుని గోరువెచ్చని నీటితో తడుపుకుని.. ఈ పేస్ట్ ని తల మాడుకి, జుట్టుకి పట్టించాలి. ఇప్పుడు షవర్ క్యాప్ తో కవర్ చేసుకుని 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఉల్లిపాయ ప్యాక్
జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఉల్లిపాయను పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టుని మందంగా మార్చడమే కాదు.. జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది. 2 మీడియమ్ సైడ్ ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. దానికి 4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలిపి, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసి.. మాడుకి, జుట్టుకి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. వారానికి ఒకసారైనా.. ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి.. జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.

హెన్నా ప్యాక్
జుట్టు రాలడాన్ని అరికట్టడంలో మందారం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టు పెరగడానికి, జుట్టు తెల్లబడకుండా నివారించడానికి, చిట్లిపోకుండా అరికట్టడానికి సహాయపడుతుంది. 4 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ తీసుకుని పావు కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. మాడుకి, జుట్టుకి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి కంపల్సరీ వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా.. జుట్టు పెరుగుతుంది.

మెంతి ప్యాక్
మెంతులు జుట్టుని నల్లగా, నిగనిగలాడేలా చేసి.. చుండ్రుని నివారిస్తాయి. 4 టేబుల్ స్పూన్ల మెంతులను గోరువెచ్చని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. అందులో అర నిమ్మకాయ రసం, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. బాగా మిక్స్ చేసి, జుట్టుకి, స్కాల్ఫ్ కి పట్టించి 20 నిమిషాల తర్వాత మైల్డ్ కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు రాలడాన్ని పూర్తీగా అరికట్టవచ్చు.

ఎగ్ ప్యాక్
ఎగ్ లో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యంగా, స్ర్టాంగ్ గా ఉండటానికి సహాయపడతాయి. 2 కోడిగుడ్ల తెల్లసొన తీసుకుని, అరకప్పు కొకనట్ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకుంటే.. జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.



Click it and Unblock the Notifications