Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చిట్లిపోయిన జుట్టుకి చీప్ అండ్ బెస్ట్ హోం ట్రీట్మెంట్స్
జుట్టు చివర్ల చిట్లిపోతే..చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. జుట్టు చాలా పొడవుగా ఉన్నా చివర్లు చిట్లిపోయి ఉంటే.. ఆ జుట్టు అందవిహీనంగా ఉంటుంది. అలాగే పొట్టి జుట్టు ఉన్నా..చివర్లు పొరలుపొరలుగా చిట్లిపోతే.. ఏ మాత్రం అందంగా ఉండదు.
సాధారణంగా చివర్లను కట్ చేస్తూ ఉంటాం. మళ్లీ కొన్ని రోజులకే చిట్లిపోతూ ఉంటాయి. లేదా పార్లర్ లో స్ల్పిట్ ఎండ్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఇలా కాకుండా.. న్యాచురల్ క్యూర్ లేదా ? అని ఆలోచిస్తున్నారా.. ఎందుకు లేదు.. కాస్త ఓపిగ్గా ట్రై చేస్తే.. కట్ చేయకుండా, పార్లర్ కి వెళ్లకుండా జుట్టు చివర్లు చిట్లిపోవడానికి నివారించవచ్చు.

మసాజ్
తలకు, మాడుగా బాగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి.. జుట్టు మెరుస్తూ, బలంగా ఉండటమే కాదు, జుట్టు చివర్ల చిట్లిపోవడాన్ని అరికడుతుంది. కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ని సమానంగా తీసుకోవాలి. మూడింటిని కలిపి.. తలకు పట్టించుకోవడానికి ముందు గోరువెచ్చగా చేయాలి. తర్వాత తల మాడుకి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చు.

హెయిర్ ప్యాక్
ఒక అరటిపండుని బాగా పేస్ట్ చేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా రోజ్ వాటర్, కొంచెం నిమ్మరసం కలపాలి. ఈ ప్యాక్ ని తలకు మొదల్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితాలుంటాయి.

అవొకాడో ప్యాక్
ఒక అవొకాడో పండును గుజ్జులా తయారు చేసుకొని అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. ఇది చిట్లిన జుట్టుకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

ఎగ్ ప్యాక్
మరో హోం మేడ్ హెయిర్ ప్యాక్ ద్వారా మీ జుట్టు చివర్లు చిట్లడాన్ని న్యాచురల్ గా అరికట్టవచ్చు. ఒక కోడిగుడ్డు తీసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ తేనె, అరకప్పు పాలు కలపాలి. ఈ ప్యాక్ ని తలకు మొదళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చు.

బొప్పాయి ప్యాక్
మీ జుట్టు పొడవును బట్టి, బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసుకొని దానికి పెరుగు మిక్స్ చేసి బాగా మెత్తగా చేయాలి. ఈ పేస్ట్ ను మీ తల మాడుకు జుట్టుకు పట్టించాలి. తర్వాత నిదానంగా మసాజ్ చేసి పది నిముషాలు అలాగే ఉంచాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

తేనె ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ల తేనె కు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారయ్యాకు తలకు ప్యాక్ లా వేసుకోవాలి. పదిహేను నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

జుట్టు చిట్లి పోకుండా జాగ్రత్తలు
జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా కారణమే. జుట్టుని టవర్ తో ఎక్కువగా రుద్ద కూడదు. తడి జుట్టుని దువ్వకూడదు. చిక్కు తీయడానికి పెద్ద పళ్లు ఉన్న దువ్వెన ఉపయోగించాలి. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రొటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్, విటమిన్ ఏ, సి, సెలీనియం వంటివి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఈ చిన్న చిట్కాలు మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications