For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాన్ సూన్ (వర్షాకాలం)లో డే టు డే తీసుకోవల్సిన హెయిర్ కేర్ టిప్స్ ...

|

వర్షానికి తడిస్తే మొట్టమొదటి ప్రభావం పడేది చర్మం మీద, వెంట్రుకల మీద. ఈ రెంటి గురించీ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వెంట్రుకలు గురించి శ్రద్ద తీసుకోవాలి. వర్షాకాలంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి. తలతడిగా ఉన్నప్పుడు చుండ్రు అధికమవుతుంది. పేలూపడతాయి. చుండ్రు వల్ల మొటిమలూ తప్పవు. ఇతర ఇన్ ఫెక్షన్లు బాధిస్తాయి. అందుకే తలతడవకుండా గొడుగు లాంటిది వాడాలి. వర్షాకాలంలో డే టు డే కేర్ తీసుకొంటే జుట్టును కాపాడుకోవచ్చు. అందు కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మంచి కండిషనర్ ను ఉపయోగిస్తే సరిపోతుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో హెయిర్ కేర్ అంటే కొంచెం కష్టమైన పనే. వర్షాకాలంలో సరిగా కేర్ తీసుకోకపోతే తడిచిన వెంట్రుకల నుండి చెడు వాసనలు వచ్చే అవకాశం కూడా వుంది. దాంతో చుండ్రు, వెంట్రుకలు తెగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తల తడిగా ఉండటం వల్ల తలనొప్పి తరచూ వేదిస్తుంటుంది. కాబట్టి అందుకు తగ్గ సంరక్షణ పద్దతులు పాటిస్తే వర్షాకాలంలో కూడా కురులు సురక్షితంగా ఉంటాయి. అందుకు మీకోసం కొన్ని చిట్కాలు...

చుండ్రు ఉన్నవారు వర్షాకాలంలో డైరెక్ట్ గా తలస్నానం చేయకూడదు.

చుండ్రు ఉన్నవారు వర్షాకాలంలో డైరెక్ట్ గా తలస్నానం చేయకూడదు.

చుండ్రు ఉన్నవారు వర్షాకాలంలో డైరెక్ట్ గా తలస్నానం చేయకూడదు. తలస్నానానికి ముందు పెరుగు లేదా రీఫైయిన్డ్ ఆయిల్ ను తల మాడుకు బాగా మసాజ్ చేసి. అరగంట తర్వాత స్నానం చేయాలి. నూనెలు చిక్కగా (ఆముదం)ఉన్నవి ఉపయోగించకుండా పలుచగా ఉండే బాదాం ఆయిల్, కొబ్బరినూనె వంటివి గోరువెచ్చగా చేసి తలకు మర్థన చేయాల్సి వుంటుంది.

తలకు నూనెను మసాజ్ చేసిన తర్వాత పది-పదిహేను నిమిషాల తర్వాత తలను దువ్వడం

తలకు నూనెను మసాజ్ చేసిన తర్వాత పది-పదిహేను నిమిషాల తర్వాత తలను దువ్వడం

తలకు నూనెను మసాజ్ చేసిన తర్వాత పది-పదిహేను నిమిషాల తర్వాత తలను దువ్వడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలకు వేడి నూనెతో మసాజ్ చేయడం, వెంటనే తలను దువ్వడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగేందుకు సహాయపడుతుంది. దాంతో కేశ కణాలు పునురుత్తేజం చెంది జుట్టు దృడంగా ఉండేలా చేస్తుంది.

వెంట్రుకలు పెరగడానికి:

వెంట్రుకలు పెరగడానికి:

తల మాడు చాలా చల్లగా, తడిగా మరియు దురదతో ఇరిటేషన్ తెప్పించే విధంగా ఉంటే వేపనూనె చాలా బాగా పనిచేస్తుంది. నిమ్మనూనెను తలకు రాయడం వల్ల తలను శాంతపరుస్తుంది. నిమ్మలోనున్న ఆయుర్వేద గుణాలు కురులు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది.

నూనెలో కరివేపాకు ఆకులను వేసి నూనెను వేడి చేసి గోరువెచ్చగా తలకు మర్దన చేసుకోవాలి

నూనెలో కరివేపాకు ఆకులను వేసి నూనెను వేడి చేసి గోరువెచ్చగా తలకు మర్దన చేసుకోవాలి

కురులు మందంగా, నల్లగా నిగనిగలాడాలంటే నూనెలో కరివేపాకు ఆకులను వేసి నూనెను వేడి చేసి గోరువెచ్చగా తలకు మర్దన చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే వెంట్రుకలు సున్నితంగా నల్లగా పెరుగుతాయి.

 హెర్బల్ షాంపూ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించడం మంచిది.

హెర్బల్ షాంపూ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించడం మంచిది.

తలకు హెర్బల్ షాంపూ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించడం మంచిది. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయడం మంచిది. లేదంటే వాతావరణంలోని కాలుష్యంతో హెయిర్ దెబ్బతిని రాలిపోవడం, తెగిపోవడం వంటివి జరుగుతాయి. పొడి జుట్టు వున్నవారా తలస్నానానికి ముందు తప్పనిసరిగా కండిషనర్ ను అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించకూడదు

హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించకూడదు

తలస్నానం తర్వాత తలను తడి ఆర్పుకోవడానికి హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించకుండా మంచి పొడి టవల్, మెత్తని టవల్ తో తలను తడుచుకోవడం వల్ల ఇదితలకు మసాజ్(మాయిశ్చరైజర్)గాను ఉపయోగపడుతుంది.

తడిగా ఉన్నప్పుడు తలను దువ్వకూడదు.

తడిగా ఉన్నప్పుడు తలను దువ్వకూడదు.

తడిగా ఉన్నప్పుడు తలను దువ్వకూడదు. తడిలె కురులు బలహీన బడి ఉండటం వల్ల కురులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

హెయిర్ కలరింగ్ లేదా స్ట్రైయిట్ హెయిర్ చేయించుకోవడం

హెయిర్ కలరింగ్ లేదా స్ట్రైయిట్ హెయిర్ చేయించుకోవడం

హెయిర్ కలరింగ్ లేదా స్ట్రైయిట్ హెయిర్ చేయించుకోవడం ఈ సీజన్ లో అంత మంచిది కాదు. హెయిర్ కలరింగ్, స్ట్రైటనింగ్ చేయించుకోవడనికి తర్వాత తలస్నానం చేసుకోవడానికి, తలను తడి ఆర్పడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్రొసెస్ లో వెంట్రుకలు రాలిలోపోయే అవకాశం ఉంది. కాబట్టి తలకు సహజ పద్దతులల్లో కేర్ తీసుకోవడం ఉత్తమం.

ఎక్కువ నీరు త్రాగడం :

ఎక్కువ నీరు త్రాగడం :

అన్ని చిట్కాలలో కల్లా ముఖ్యమైనది, మొట్టమొదటిది మిమ్మలిని మీరు హైడ్రేటెడ్ ఉంచుకోండి. జుట్టు కుదుళ్ళు గట్టిగా, మృదువైన కేశాలు ఉండాలంటే మీరు ద్రవాలిని ఎక్కువగా తీసుకోండి. మీరు తీసుకునే నీటి స్థాయిని పెంచండి.

నేచురల్ కలర్స్ (మెహింది లేదా టీ డికాషన్)ను ఉపయోగించడం ఎంతో ఉత్తమమై పద్దతి.

నేచురల్ కలర్స్ (మెహింది లేదా టీ డికాషన్)ను ఉపయోగించడం ఎంతో ఉత్తమమై పద్దతి.

ఈ హెయిర్ కేర్ టిప్స్ వర్షాకాలం ప్రతి రోజూ తీసుకోవాల్సినవి. నేచురల్ కలర్స్ (మెహింది లేదా టీ డికాషన్)ను ఉపయోగించడం ఎంతో ఉత్తమమై పద్దతి.

English summary

Day To Day Hair Care Tips For Monsoon

It isn't very hard to take a good care of your hair, that too in monsoon. Some simple tips can help in maintaining your hair all long. Hair care doesn't require expensive brands to be in good condition but basics is definitely a must.
Story first published: Friday, July 8, 2016, 23:11 [IST]
Desktop Bottom Promotion